ప్యాక్ యువర్ బ్యాగ్స్, మీరిప్పుడు ఏయే దేశాలకు వెళ్లొచ్చో తెలుసుకోండి

ఇప్పుడిప్పుడే అన్ని దేశాలూ విమాన ప్ర‌యాణాల‌కు అనుమ‌తిస్తున్నాయి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బ‌బుల్ నియ‌మాల ప్ర‌కారం ఆయా దేశాలు ప్ర‌యాణికుల‌ను త‌మ భూభాగంలోకి అనుమ‌తిస్తున్నాయి.

news18-telugu
Updated: September 26, 2020, 6:36 PM IST
ప్యాక్ యువర్ బ్యాగ్స్, మీరిప్పుడు ఏయే దేశాలకు వెళ్లొచ్చో తెలుసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
COVID-19 నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా టూరిస్ట్ డెస్టినేష‌న్‌లు క‌ళ త‌ప్పాయి. మ‌హ‌మ్మారి కార‌ణంగా విదేశాల‌కు విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకున్న‌వారు త‌మ ప్ర‌యాణాల‌ను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని దేశాలూ విమాన ప్ర‌యాణాల‌కు అనుమ‌తిస్తున్నాయి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బ‌బుల్ నియ‌మాల ప్ర‌కారం ఆయా దేశాలు ప్ర‌యాణికుల‌ను త‌మ భూభాగంలోకి అనుమ‌తిస్తున్నాయి. ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ నియ‌మాల ప్రకారం భారతీయులు ప్రయాణించగల దేశాల జాబితా మీకోసం.


  1. నేపాల్: అక్టోబర్ 17 నుంచి త‌మ దేశానికి అంతర్జాతీయ ప్రయాణికులను అనుమ‌తిస్తామ‌ని నేపాల్ ప్ర‌క‌టించింది. సాధార‌ణ ప్ర‌యాణాలతో పాటు గ్రూప్‌ ట్రెక్కింగ్, పర్వతారోహణకు కూడా ఆ దేశం అనుమ‌తులు ఇచ్చింది. మీరు తప్పక వెళ్లాల్సిన జాబితాలో నేపాల్ ఉంటే తొంద‌ర‌ప‌డాల్సిందే. ఎందుకంటే త‌మ దేశంలోకి అనుమ‌తించే పర్యాటకుల సంఖ్యను 3,000కే పరిమితం చేసింది. ఆర్టీ-పీసీఆర్ క‌రోనా టెస్ట్ చేయించుకుని, ఫ‌లితం నెగెటివ్‌గా వ‌చ్చిన వ్య‌క్తుల‌ను నేపాల్ అనుమ‌తిస్తుంది. ఆ ప‌రీక్ష 72 గంటల్లోపు చేయించుకుని ఉండాలి. ఢిల్లీ నుంచి ఖాట్మండు రిటర్న్ ఫ్లైట్ టికెట్ ధర సుమారు రూ.13,000. నేపాల్‌కు చాలా సంస్థ‌లు టూరిస్ట్ ప్యాకేజీల‌ను అందిస్తున్నాయి. భోజనం, ర‌వాణా, వసతి, ట్రావెలింగ్ క‌లిపి ఒక్కో వ్యక్తికి మూడు రోజుల వ‌ర‌కు ప్యాకేజీలు ఉన్నాయి. హోటల్ ఫెయిర్‌ఫీల్డ్-మారియట్- రూ.8,499, హోటల్ రాడిసన్ (నాన్-కాసినో)- రూ.13, 899, షాంగ్రి లా(నాన్- క్యాసినో)- రూ.10,599 వ‌ర‌కు ఉంది.


Helicopter With 7 People on Board Crashes in Nepal Mountains, Fate of Passengers Unknown
నేపాల్ ప్రతీకాత్మక చిత్రం


నేపాల్‌లో భారత కరెన్సీ (రూ.100, అంతకంటే తక్కువ విలువ ఉన్న‌వి) చెల్లుతుంది. ఖాట్మండు, పోఖ్రా వంటి పెద్ద నగరాల్లో భారత కరెన్సీని చాలామంది తీసుకుంటారు. కానీ ఆ దేశంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల‌నుకుంటే నేపాల్ రూపాయిని తీసుకెళ్లండి.

2 మాల్దీవులు: ఈ హిందూ మహాసముద్ర ద్వీప సమూహం జూలై 15 నుంచే సరిహద్దులను తెరిచింది. కానీ టూరిస్టులకు ఆ దేశ పర్యాటక శాఖ కొన్ని నియ‌మాలు విధించింది. పర్యాటకులు క‌రోనా పీసీఆర్ టెస్ట్‌- నెగటివ్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. ద్వీపాలలో ప్ర‌యాణాలకు కూడా అనుమ‌తులు ఇచ్చారు. అక్క‌డికి వెళ్లిన‌ పర్యాటకులు ఏదైనా రెండు రిసార్ట్‌లకు వెళ్లి సెల‌వుల‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. ఇంత‌కు ముందు ఒక్క రిసార్టు వ‌ర‌కే ప‌ర్మిష‌న్ ఉండేది. ఢిల్లీ నుంచి మాలెకు ఎకానమీ విమాన స‌ర్వీసులు రూ.15,500 నుంచి ప్రారంభమవుతాయి.
maldives, cheating, scam, tour operators, ahmedabad, gujarat, case, police, crime story, crime case, తెలుగు వార్తలు, నేరాలు, నేర వార్తలు, క్రైమ్ స్టోరీ, క్రైమ్ కేసు, మాల్దీవులు, పోలీసులు, టూర్ ఆపరేటర్లు, మోసాలు, చీటింగ్, స్కామ్,
ప్రతీకాత్మక చిత్రం


ప్యాకేజీలు: హలో మాల్దీవ్స్‌- డ‌బుల్ షేరింగ్లో ఒక్కో వ్య‌క్తికి రూ.39,990 నుంచి ప్రారంభమ‌వుతుంది. డీలక్స్ రూమ్‌లో మూడు రోజుల వ‌స‌తి క‌ల్పిస్తారు. ఎలిగెంట్ స్టే ఇన్ కోకో బోడు హితి- డబుల్ షేరింగ్‌లో ప్రతి వ్యక్తికి రూ.74,990 నుంచి ప్రారంభమవుతుంది. ఐలాండ్ విల్లాలో మూడు రోజుల బ‌స‌, భోజ‌నం, విమానాశ్రయానికి రిట‌ర్న్ జ‌ర్నీ వంటి స‌దుపాయాలు క‌ల్పిస్తున్నారు. భారతీయ పౌరులకు 30 రోజుల వ్యాలిడిటీతో ఉచిత వీసాను మాల్దీవులు అందిస్తుంది.

3 అమెరికా:  అమెరికాకు వెళ్లాల‌నుకునేవారు టికెట్లు బుకింగ్ చేయడానికి ముందే సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారిక వెబ్‌సైట్లో నియ‌మ నిబంధ‌న‌లు తెలుసుకోవ‌డం మంచిది. యూఎస్‌లో చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న ప్ర‌యాణికుల‌ను త‌మ దేశంలోకి అనుమ‌తిస్తారు. ఢిల్లీ నుంచి న్యూయార్క్ కు రిటర్న్ ఫ్లైట్ రూ.59,000 నుంచి ప్రారంభమవుతుంది. న్యూయార్క్కు వెళ్లే ఫాస్టెస్ట్ ఫ్లైట్ టికెట్ ధ‌ర‌లు రూ.96,000 నుంచి ప్రారంభమవుతాయి. ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో రిటర్న్ ఫ్లైట్ రూ.66,519 వద్ద ప్రారంభమవుతుంది, ఫాస్టెస్ట్ ఫ్లైట్ టికెట్‌ ధర రూ.98,918

International Womens day 2020, IRCTC Womens day special tour, IRCTC Dazzling Dubai Womens Special tour, IRCTC Dubai package, IRCTC tours, IRCTC tourism, అంతర్జాతీయ మహిళల దినోత్సవం 2020, ఐఆర్‌సీటీసీ డాజ్లింగ్ దుబాయ్ వుమెన్స్ స్పెషల్ టూర్, ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్, ఐఆర్‌సీటీసీ దుబాయ్ టూర్, ఐఆర్‌సీటీసీ వుమెన్స్ స్పెషల్ టూర్, ఐఆర్‌సీటీసీ టూర్స్
ప్రతీకాత్మక చిత్రం


ప్యాకేజీలు: యూఎస్ఏ ఈస్ట్ కోస్ట్ విత్ చికాగో- ఆరు రోజుల‌కు రూ.2,05,000. యూఎస్ఏ వెస్ట్ కోస్ట్- రూ.2,20,805. యూఎస్ఏ ఈస్ట్ కోస్ట్ & వెస్ట్ కోస్ట్- 12 రోజుల‌కు రూ.3,20,670. ఇతర ప్యాకేజీల వివ‌రాల‌ను www.kesari.in లో చూడ‌వ‌చ్చు.

4. కెనడా:  కెన‌డాలోకి ప్రవేశ అనుమతుల కోసం ఆ దేశ అధికారిక ఇమిగ్రేష‌న్ వెబ్‌సైట్‌ను ప‌రిశీలించ‌డం మంచిది. ఆ దేశంలో చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న‌ భారతీయ పౌరులు కెనడాకు వెళ్ల‌వ‌చ్చు. షిప్పింగ్ శాఖ అనుమ‌తులు ఇచ్చిన త‌రువాత భారతీయ పాస్‌పోర్ట్‌లు ఉన్న నావికుల‌ను అనుమ‌తిస్తారు. ఢిల్లీ నుంచి టొరంటోకు చౌకైన విమాన ప్ర‌యాణం రూ.98,636 నుంచి ప్రారంభమవుతుంది.

IRCTC Amazing Andaman tour package, IRCTC Andaman Tour from hyderabad, IRCTC tours from hyderabad, IRCTC tourism, IRCTC tours, ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ అండమాన్ టూర్, ఐఆర్‌సీటీసీ టూరిజం, హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్స్, అండమాన్ టూర్ ప్యాకేజీ
(ప్రతీకాత్మక చిత్రం)


ప్యాకేజీలు: బెస్ట్ ఆఫ్ కెనడా-13 రోజుల‌కు రూ.384,070. కెనడాతో పాటు యూఎస్ ఈస్ట్ కోస్ట్ ట్రిప్‌- 11 రాత్రులకు రూ.3,02,603. ఇతర ప్యాకేజీల వివ‌రాల‌ను www.kesari.in లో చూడ‌వ‌చ్చు.

5. బ్రిటన్:  ప్రవేశ అనుమతుల వివరాల కోసం బ్రిట‌న్ బోర్డ‌ర్ కంట్రోల్ వెబ్సైట్‌ను ప‌రిశీలించండి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ లేదా నార్త్‌ ఐర్లాండ్‌కు వేర్వేరుగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ అనుమ‌తులు ఇస్తున్నారు. చెల్లుబాటయ్యే UK వీసా ఉన్న వ్య‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ఢిల్లీ నుంచి లండన్‌కు చౌకైన విమాన టికెట్ ధ‌ర‌లు రూ.54,000 నుంచి ప్రారంభమవుతాయి.

IRCTC Amazing Andaman tour package, IRCTC Andaman Tour from hyderabad, IRCTC tours from hyderabad, IRCTC tourism, IRCTC tours, ఐఆర్‌సీటీసీ అమేజింగ్ అండమాన్ టూర్, ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ అండమాన్ టూర్, ఐఆర్‌సీటీసీ టూరిజం, హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్స్, అండమాన్ టూర్ ప్యాకేజీ
ప్రతీకాత్మక చిత్రం


ప్యాకేజీలు: భోజనం, వసతి, సైట్ సీఈంగ్ సహా ఒక్కో వ్యక్తికి రేట్లు వ‌ర్తించే ప్యాకేజీలు ఉన్నాయి. కేవలం లండన్ వ‌ర‌కే అయితే- మూడు రోజుల‌కు రూ.41,990.  బెస్ట్ ఆఫ్ యూకే అండ్ ఐర్లాండ్- ఏడు రోజుల‌కు రూ.56,990. జెమ్స్ ఆఫ్ స్కాట్లాండ్- ఐదు రోజుల‌కు రూ.64,490).

6. ఖతార్:  ప్రవేశ అనుమతుల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను ప‌రిశీలించాలి. చెల్లుబాటు అయ్యే ఖతార్ వీసా ఉన్నవారిని అనుమ‌తిస్తారు. నాన్‌స్టాప్ ఖతార్ ఎయిర్‌వేస్ న్యూ ఢిల్లీ నుంచి దోహా వ‌ర‌కు విమాన స‌ర్వీసులు అందిస్తోంది. టికెట్ ధ‌ర‌లు రూ.38,585 నుంచి ప్రారంభమవుతాయి. 2020 డిసెంబర్ 31 వరకు ఖతార్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించే ప్రయాణీకులు.. తమ ప్ర‌యాణ తేదీల‌ను (బయలుదేరే ముందు మూడు రోజుల వరకు) ఉచితంగా మార్చవచ్చు.

IRCTC Majestic Kerala With Shree Padmanabhaswamy tour, IRCTC Kerala tour package, IRCTC Kerala tour from Visakhapatnam, IRCTC Kerala tour from Vizag, IRCTC tours, IRCTC tourism, ఐఆర్‌సీటీసీ మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి, ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ, ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ విశాఖపట్నం, ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ వైజాగ్, ఐఆర్‌సీటీసీ టూర్స్, ఐఆర్‌సీటీసీ టూరిజం
ప్రతీకాత్మక చిత్రం


ప్యాకేజీలు: భోజనం, వసతి, సైట్ సీఈంగ్‌తో క‌లిపి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఖతార్ ఎక్స్‌ప్లోరర్- మూడు రోజుల‌కు  రూ.26,096, అమేజింగ్ ఖతార్- నాలుగు రోజుల‌కు రూ.33,745), ఖతార్ రిటైల్ థెరపీ- మూడు రోజుల‌కు రూ.34,545, రొమాంటిక్ హాలిడే- ఐదు రోజుల‌కు రూ.45,840 చొప్పున ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 26, 2020, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading