Home /News /life-style /

TOP 7 YOGA APPS FOR IPHONE USERS TO TRY OUT ON THIS YOGA DAY UMG GH

Yoga Apps: ఐఫోన్ యూజ్ చేస్తున్నారా? అయితే, ఈ 7 యోగా యాప్స్ ట్రై చేయండి

యోగా దినోత్సవం సందర్భంగా ఐఫోన్ యూజర్స్ వీటిని ట్రై చేయండి.

యోగా దినోత్సవం సందర్భంగా ఐఫోన్ యూజర్స్ వీటిని ట్రై చేయండి.

ఆరోగ్యం (Health), ఫిట్‌నెస్‌ (Fitness)పై శ్రద్ధ వహించేలా యాపిల్‌ తమ వినియోగదారులకు వివిధ ఫీచర్‌లను అందించింది. స్మార్ట్‌వాచ్‌ (Smart Watch) వంటి వాటిల్లో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యోగా దినోత్సవం (Yoga Day) సందర్భంగా.. యోగా ద్వారా ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి.

ఇంకా చదవండి ...
ఏటా యోగా దినోత్సవాన్ని జూన్‌ 21వ తేదీన నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అందరికీ కాస్తంత జాగ్రత్త పెరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించేలా యాపిల్‌ తమ వినియోగదారులకు వివిధ ఫీచర్‌లను అందించింది. స్మార్ట్‌వాచ్‌ వంటి వాటిల్లో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. యోగా దినోత్సవం సందర్భంగా.. యోగా ద్వారా ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే బెస్ట్‌ iOS యాప్‌ల గురించి తెలుసుకోండి.

ప్రయోగ (PRAYOGA)
ప్రయోగ అంటే ప్రయోగం, యాప్ యోగా పాఠాలను నేరుగా iPhone, Apple వాచ్‌లలో అందిస్తుంది. యోగా పాఠాలను అందించడానికి వాచ్‌ఓఎస్, ఐఓఎస్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటుంది. Apple వాచ్‌లో ఆడియో ద్వారా ఆసనం లేదా యోగా భంగిమలను ప్రదర్శించడానికి యాప్ వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. ప్రయోగ యాప్‌లో ML, విజన్-బేస్డ్ బాడీ ట్రాకింగ్, ఆసనం వేస్తున్నప్పుడు శరీరంలోని 17 కీళ్ల వరకు ట్రాక్ చేస్తుంది. కరెక్షన్‌లకు సంబంధించి రియల్‌టైమ్‌ ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది.

వైసా (WYSA)
వైసా అనేది వినియోగదారులు వ్యక్తపరిచే ఎమోషన్‌లకు ప్రతిస్పందించడానికి Alని ఉపయోగించే చాట్‌బాట్. సవాళ్లను సరదాగా, సంభాషణాత్మకంగా ఎదుర్కోవడంలో సహాయపడే టెక్నిక్‌లతో యాప్ వస్తుంది. వైసాను అన్ని వర్గాలకు సంబంధించిన ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. రీసెర్చ్‌ బేస్డ్‌, విస్తృతంగా ఉపయోగించే ఒత్తిడి, నిరాశ, ఆందోళన, నిద్రలేమి, మానసిక అనారోగ్యాన్ని దూరం చేసే CBT, DBT, యోగా, ధ్యానం పద్ధతులను అందిస్తుంది.

కల్ట్‌.ఫిట్‌ (CULT.FIT)
ఫిట్‌నెస్ కాన్షియస్ యూజర్‌లలో ఒక ప్రసిద్ధ యాప్ కల్ట్‌.ఫిట్. మీ వర్కౌట్‌లను బుక్ చేయడంతో పాటు, వర్కౌట్ రొటీన్‌లు, డైట్ ప్లాన్‌లు, మరిన్నింటిని అందిస్తుంది. ఈ యాప్‌తో ప్రతి వ్యాయామం లేదా ఫిట్‌నెస్ సెషన్ నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించుకోవచ్చు. బరువు తగ్గడం, కార్డియోవాస్కులర్‌ ఎండూరెన్స్‌(Cardiovascular Endurance), స్ట్రెంత్‌, స్టామినా వంటి లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు.

ఆసనా రెబెల్ (Asana Rebel)
ఆసనా రెబెల్ అనేది వినియోగదారుల కోసం వర్కవుట్, యోగా రొటీన్‌లను అందించే యాప్. ఇది అనేక ఎక్సెర్‌సైజెస్‌, రొటీన్‌లు, చిట్కాలు, మరిన్నింటితో నిర్దిష్ట ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవడానికి వినియోగదారులకు ఉపయోగపడుతుంది.

అర్బన్ యోగి (URBANYOGI)
పెర్సనలైజ్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే మరో యాప్‌ అర్బనియోగి. షార్ట్ గైడెడ్ మెడిటేషన్స్, డైలీ మోటివేషన్, స్లీప్ హిప్నాసిస్, ప్రపంచ ప్రఖ్యాత నిపుణులు అందించే కోచింగ్‌లను అందిస్తుంది. యాప్ వినియోగదారులకు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, మంచి నిద్రను పొందేలా చేస్తుంది. ఆరోగ్యం, రిలాక్సేషన్‌ ట్యుటోరియల్‌లతో పాటు కోచింగ్ కంటెంట్, మోటివేషనల్‌ చర్చలు, స్ట్రీక్ ట్రాకింగ్‌లను ఈ యాప్‌ అందిస్తుంది.

ఆరా (AURA)
3 నిమిషాల మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించడానికి, పాజిటివిటీని పెంచడానికి సులభమైన పరిష్కారం అందించే యాప్‌ ఆరా. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ఉపయోగపడే AI- డ్రివెన్‌ మైండ్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ యాప్. వినియోగదారులు ధ్యానం చేయడానికి ప్రతిరోజూ చిన్న సైన్స్-ఆధారిత, పెర్సనలైజ్డ్‌ మైండ్‌ఫుల్‌నెస్ ధ్యాన వ్యాయామాలు అందిస్తుంది.యోగా-గో (YOGA-GO)
యోగా-గో అనేది కస్టమైజ్డ్ ఫిట్‌నెస్, బరువు తగ్గించే ప్లాన్‌లను మిళితం చేసే ఒక వర్కవుట్ యాప్. ఇది ఆరోగ్యకరమైన మీల్ ట్రాకర్‌తో పాటు, వినియోగదారులకు అన్నింటినీ కలుపుకొని, టోన్డ్ బాడీని నిర్మించడానికి, సమతుల్య భావోద్వేగాలను నిర్వహించడానికి, వారి జీవితాన్ని సామరస్యంగా ఉంచడానికి పరిష్కారాన్ని అందిస్తుంది. -గో వర్కవుట్‌లకు 7 నుంచి 30 నిమిషాల మధ్య సమయం పడుతుంది. ఒక్కో సెషన్‌కు 200 కేలరీల వరకు బర్న్ చేయవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Iphone, Life Style, Yoga, Yoga day 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు