TOP 7 PERSONALITIES THAT SWITCHED THEIR CAREERS AND FOUND SUCCESS FULL DETAILS HERE GH VB
Success Story: రజనీకాంత్ నుంచి ధోని వరకు.. కెరీర్ గేర్ మార్చి సూపర్ స్టార్స్ అయిన ప్రముఖులు వీరే..
రజనీకాంత్, ధోని (ఫైల్)
డాక్టర్ (Doctor) అవ్వబోయి యాక్టర్ (Actor) అయ్యాను అనేది చాలా కాలం నుంచి ఉన్న సామెత. చాలా మంది చిన్నప్పటి నుంచే తమ డ్రీమ్ జాబ్ (Dream Job) గురించి ఆలోచిస్తారు. ఎప్పటికైనా దానిని సాధించాలని కలలు కంటారు. అయితే అందరికీ అది కుదరదు. ఆర్థిక ఇబ్బందులు కావొచ్చు లేక పరిస్థితుల ప్రభావమైన అవ్వొచ్చు కలలు కన్న వృత్తిలో కాకుండా నచ్చని జాబ్‌లో పనిచేయాల్సి వస్తుంది.
డాక్టర్ (Doctor) అవ్వబోయి యాక్టర్ (Actor) అయ్యాను అనేది చాలా కాలం నుంచి ఉన్న సామెత. చాలా మంది చిన్నప్పటి నుంచే తమ డ్రీమ్ జాబ్ (Dream Job) గురించి ఆలోచిస్తారు. ఎప్పటికైనా దానిని సాధించాలని కలలు కంటారు. అయితే అందరికీ అది కుదరదు. ఆర్థిక ఇబ్బందులు కావొచ్చు లేక పరిస్థితుల ప్రభావమైన అవ్వొచ్చు కలలు కన్న వృత్తిలో కాకుండా నచ్చని జాబ్‌లో పనిచేయాల్సి వస్తుంది. పొట్ట కూటి కోసం తప్పదు అని కొందరు సర్దుకుపోతే... మరికొందరేమో తమ కెరీర్ (Career)కు గుడ్‌బై చెప్పి కొత్త కెరీర్‌ను ఎంచుకొని సక్సెస్ అవుతుంటారు. దీనికి వయసుతో సంబంధం లేదని కూడా నిరూపిస్తారు. అలా తమ కెరీర్ గేర్ మార్చి సూపర్ స్టార్స్‌గా ఆవిర్భవించిన ఏడుగురి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమ సాధారణ కెరీర్లను వదులుకుని సెలబ్రిటీలుగా ఎలా మారారో ఒక లుక్కేద్దాం పదండి మరీ...
రజనీకాంత్ (Rajnikanth): కర్ణాటకలోని బెంగళూరులో బస్ కండెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించిన రజనీకాంత్ అనంతరం సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్‌గా ఎదిగారు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో రజనీకాంత్ ఒకరు. అంతేకాకుండా ఏ ఇండియన్ యాక్టర్‌కు లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మలేసియా, సింగపూర్, హాంకాంగ్‌లలో రజనీకాంత్ ఏర్పరచుకున్నాడంటే అతడి స్టామినా ఎంటో తెలుస్తుంది.
మహేంద్ర సింగ్ ధోని (Dhoni): టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అతడు అదే ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్‌ను విజేతగా నిలిపాడు. అయితే అతడు క్రికెటర్‌గా కంటే కూడా ముందు రైల్వే టీటీగా పనిచేశాడు. ఖరగ్‌పూర్ స్టేషన్లో 2001 నుంచి 2003 వరకు టీటీ వృత్తిని నిర్వర్తించాడు.
ఫాల్గుని నాయర్ (Falguni nayar): నైకా (Nykaa)... ఈ ఏడాదే ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యింది. నైకా పేరు తెలియని ఆడవారు మన దేశంలో ఉండరేమో. ఎందుకంటే నైకాకు భారత్‌లో అంతపేరు. ఈ నైకా ఫౌండరే ఫాల్గుని నాయర్. 20 ఏళ్లు ఒక బ్యాంకర్‌గా పనిచేసిన ఆమె... తన 50 ఏట నైకాను ఆరంభించి సూపర్ సక్సెస్ అయ్యింది.
వెర వాంగ్ (vera wang): వెర వాంగ్... ఫ్యాషన్ ప్రపంచంలో ఈమె గురించి తెలియని వారుండరు. ఈ అమెరికన్ వెడ్డింగ్ డ్రెస్‌లతో ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుత వయసు 72. ఫ్యాషన్‌తోనే కాదు... తన పేరు మీద విడుదల చేస్తున్న పర్ఫ్యూమ్లతోనూ ఈమె పాపులర్ అయింది. ఈ వృత్తిలోకి రాక ముందు ఈమె స్కేటర్‌గా జర్నలిస్ట్‌గా పని చేసింది. 40 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను ఫ్యాషన్వైపు మళ్లించి సూపర్ సక్సెస్ అయింది.
జొనా పెరెట్టీ (Jonah Peretti): బజ్‌ఫీడ్, ద హఫింగ్టన్ పోస్ట్ వంటి మీడియా సైట్లను ఆరంభించాడు. వీటిని ఆరంభించడానికంటే ముందు జొనా కంప్యూటర్ సైన్స్ టీచర్‌గా పనిచేశాడు. ఎలెన్ డిజెనెరస్ (ellen degeneres): ఎలెన్ టాక్ షోతో ప్రపంచమంతా తన పేరు తెలిసేలా చేసుకున్నారు ఎలెన్ డిజెరస్. హోస్ట్‌గా యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాల్లో ఈమె విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఎలెన్ తన తొలి నాళ్లలో బార్ అటెండర్‌గా, వెయిటర్‌గా, వ్యాక్యూమ్ సెల్లర్‌గా ఆమె పనిచేశారు. ఈమె గురించి మరో ఆసక్తికర అంశం ఏంటంటే... ఈమె ఒక లెస్బియన్.
జార్జియో అర్మానీ (Giorgio Armani): ఫ్యాషన్ ప్రపంచంలో జార్జియో అర్మానీ పేరు తెలియని వారుండరు. ఇటలీ ఆర్మీలో పనిచేసిన ఇతడు... 1953లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి మిలాన్‌లోని ఒక స్టోర్‌లో విడో డ్రెస్సర్‌గా పనిచేశాడు. అనంతరం క్లోత్ సెల్లర్‌గా మారి... 1975 తన పేరు మీదే మిలాన్‌లో ఫ్యాషన్ హౌజ్‌ను ఆరంభించాడు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.