జీవితంలో పెళ్లి మరువలేని ఘట్టమైతే.. హనీమూన్ మధురమైన జ్ఞాపకం. ఈ జ్ఞాపకాన్ని మరింత అందంగా, ఆనందంగా జీవితాంతం గుర్తుండేలా మార్చుకోవాలంటే ఆహ్లాదభరితమైన హనీమూన్ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అందరికీ విదేశాలకు వెళ్లేంత స్థోమత ఉండదు. కాబట్టి, భారత్‌లోనే తక్కువ ఖర్చుతో హనీమూన్‌కు ప్లాన్ చేసుకోవచ్చు. భారతదేశానికి హనీమూన్ పర్యటనలు నిజంగా ప్రత్యేకమైనవి. భారతదేశంలోని కొన్ని ప్రదేశాలు మరపురాని హనీమూన్ అనుభవాన్ని తీసుకొస్తాయి. కాబట్టి, పెళ్లైన కొత్త జంటలు భారతదేశంలోనే అద్భుతమైన, ఉష్ణమండల హనీమూన్ పర్యటన కోసం ప్లాన్ చేయండి. అద్భుతమైన హనీమూన్ కోసం భారతదేశంలోని ఈ 7 ఉత్తమ గమ్యస్థానాలను పరిశీలించండి.
తాజ్‌మహల్, ఆగ్రా
ప్రేమకు చిహ్నంగా పేర్కొనే తాజ్ మహల్ హనీమూన్ ప్రియులకు గొప్ప ఎంపిక. ప్రపంచంలోనే 7 వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ మొఘల్ సామ్రాజ్య నివాస స్థావరం. ఆగ్రాలో ఉండే తాజ్‌మహల్‌లో ఇప్పటికీ చాలా అందమైన మసీదులు, సందడిగా ఉండే చౌక్లు, పురాతన బాత్‌హౌస్‌లు అనేకం ఉన్నాయి. రాజధాని న్యూఢిల్లీ నుండి తక్కువ సమయంలోనే ఆగ్రా చేరుకోవచ్చు. అకామిడేషన్ కొరకు ఇక్కడ అనేక ఫైవ్‌స్టార్, సెవన్ స్టార్ హోటళ్ళు అందుబాటులో ఉన్నాయి. కేవలం ఆగ్రానే కాకుండా ఉత్తర భారతదేశం సందర్శనలకు ప్రసిద్ధిగా పేరుగాంచిన విషయం తెలిసిందే.
ఉదయపూర్, రాజస్థాన్
రాజ్‌పుత్‌ల పురాతన భూమిగా పేర్కొనే ఉదయపూర్‌లో అత్యంత విలాసవంతమైన రాజభవనాలు ఉన్నాయి. మీ కొత్త జీవితాన్ని అద్భుతంగా ప్రారంభించాలంటే ఉదయపూర్‌లో హనీమూన్ తప్పనిసరి. ఇక్కడ ఉండే అత్యంత సంపన్నమైన ప్యాలెస్‌లు, హోటళ్లు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అంతేకాక, సందడిగా ఉండే బజార్లు, ఉత్కంఠభరితమైన హవేలీలు, సుందరమైన పర్వత శ్రేణులు మీ హనీమూన్ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.
మరారికులం, కేరళ
ఎత్తైన కొబ్బరి చెట్ల మధ్య వీచే గాలులు, మెరిసే మణి తరంగాలకు కేరళలోని మరారికూలం ప్రసిద్ధి. ఇది హనీమూన్‌కు అద్భుత గమ్యస్థానంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో విలాసవంతమైన హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. దీని దగ్గర్లో ఉండే మారారీ బీచ్‌లో అనేక లగ్జరీ రిసార్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఉండే బీచ్‌లు, వారసత్వ దేవాలయాలు, చర్చిలు, మ్యూజియాలు మిమ్మల్ని కనివిందు చేస్తాయి.
కుమారకోం, కేరళ
కేరళను "దేవుని స్వంత దేశం" అని పిలుస్తారు. మీ హనీమూన్ జీవితాంతం గుర్తుండాలంటే కేరళను మించిన డెస్టినేషన్ లేదు. కేరళలోని బ్యాక్ వాటర్స్ మీదుగా నెమ్మదిగా చేసే పడవ ప్రయాణం మీ వివాహానికి అత్యంత శృంగారభరితం చేస్తుంది. పచ్చని ఉష్ణమండల అడవులు, తెల్లని ఇసుక బీచ్‌లు, ఎత్తైన కొబ్బరి చెట్లతో కప్పబడిన వెనిస్ లాంటి కాలువలు మీలో రొమాంటిక్ ఆలోచనలను రేకెత్తిస్తాయి. మీ హనీమూన్ కోసం ఇక్కడ ఒక పడవను కూడా అద్దెకు తీసుకోవచ్చు. మీరు ఒడ్డుకు చేరినప్పుడు, కుమారకోం పక్షుల అభయారణ్యాన్ని సందర్శించి విదేశీ వలస పక్షులను కూడా చూడవచ్చు. లేదా సమీపంలోని అలెప్పీని సందర్శించవచ్చు.
ఖజురాహో, మధ్యప్రదేశ్
ఖాజురాహో గురించి ప్రస్తావించకుండా భారతదేశంలోని అగ్ర హనీమూన్ గమ్యస్థానాల జాబితా పూర్తికాదు. ఈ చిన్న పట్టణానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఉండే అద్భుతమైన పురాతన దేవాలయాలు సహజమైన సింగిల్ బ్లాక్స్ రాళ్ళతో చెక్కబడి ఉంటాయి. అంతేకాక, ఇక్కడి శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కబడ్డాయి. దీంతో ప్రాచీన కళాకారుల సృజనాత్మకత, ప్రతిభను చూసి మీరు విస్మయం చెందుతారు. భారతీయ చరిత్ర, పురాణాల గురించి తెలుసుకోవాలనుకునే వారు ఇక్కడ ఉన్న ఆలయాను సందర్శించవచ్చు.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్
డార్జిలింగ్ ఒక గొప్ప హనీమూన్ గమ్య స్థానంగా పేరొందింది. అద్భుతమైన అనుభవాలకు నెలవైన ఈ నగరం శృంగార వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. మీరు ప్రశాంతమైన అనుభవాలను ఇష్టపడుతున్నట్లైతే డార్జిలింగ్ బెస్ట్ డెస్టినేషన్‌గా చెప్పవచ్చు. కాంచన్ జంగా పర్వత శ్రేణి చేరుకోవడానికి ఇక్కడి నుండి కొద్ది గంటలు మాత్రమే పడుతుంది. ఇక్కడ మీరు మంచుతో కప్పబడిన అడవుల గుండా ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. పర్యటనలు, టీ కాచుకొనుటకు అనేక తేయాకు తోటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాక, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు.
అండమాన్ దీవులు
సూర్యుడు -ముద్దాడుతున్నట్లుగా కనిపించే బీచ్‌లు, ప్రాచీన అడవులు, మణి జలాలతో నిండిన అద్భుతమైన ప్రదేశంగా అండమాన్ దీవులను పేర్కొనవచ్చు. హనీమూన్ కోసం ప్లాన్ చేసే కొత్త జంటకు అండమాన్ దీవులు బెస్ట్ డెస్టినేషన్‌గా చెప్పవచ్చు. నీటిని ఇష్టపడే జంటలకు అండమాన్ సరైన హనీమూన్ స్పాట్. ఇక్కడ గ్లాస్ బాటమ్డ్ పడవలో స్కూబా డైవ్ లేదా సముద్రంలో ప్రయాణించి ఆనందించవచ్చు. అంతేకాక, ఇక్కడ అద్భుతమైన సముద్ర జీవులను చూడవచ్చు. పై హనీమూన్ ప్రదేశాలను సందర్శించడానికి అక్టోబర్, మార్చి ఉత్తమ సమయం. మంచి సన్‌లైట్, ఫోటోగ్రఫీ కోసం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రదేశాలను సందర్శించండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Best tourist places, Travel