హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Top 10 Cancer Hospitals in India: ఇండియాలో టాప్ 10 క్యాన్సర్ ఆస్పత్రులు ఏవి? ఎక్కడున్నాయి? వాటి వివరాలు

Top 10 Cancer Hospitals in India: ఇండియాలో టాప్ 10 క్యాన్సర్ ఆస్పత్రులు ఏవి? ఎక్కడున్నాయి? వాటి వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏటా దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు ట్రీట్‌మెంట్ కోసం భారతదేశంలో అనేక ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 80 క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి.

  • Trending Desk
  • Last Updated :
  • Andhra Pradesh | Telangana

ఇండియన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, భారతదేశంలో దాదాపు 22.5 లక్షల మంది ప్రజలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఏటా దేశంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు ట్రీట్‌మెంట్ కోసం భారతదేశంలో అనేక ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. మన దేశంలో దాదాపు 80 క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి. అనేక హాస్పిటల్ చెయిన్స్ మంచి ఆంకాలజీ విభాగాలతో క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నాయి. అయితే కొన్ని ప్రభుత్వ, ట్రస్ట్ హాస్పిటల్స్ బాధితులకు ఉచితంగా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్స అందిస్తున్న టాప్-10 ప్రభుత్వ, స్వచ్ఛంద ఆసుపత్రులు ఏవో చూద్దాం. 

1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ (AIIMS, Delhi)

న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తోంది. ‘డా. B.R.A ఇన్స్టిట్యూట్ - రోటరీ క్యాన్సర్ హాస్పిటల్’ స్పెషాలిటీ సెంటర్ పేరుతో ఈ సంస్థ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ అందిస్తోంది. లీనియర్ యాక్సిలరేటర్, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, బ్రాచిథెరపీ మెషీన్‌లతో పాటు అత్యుత్తమ రేడియోథెరపీ, రేడియో డయాగ్నస్టిక్ మెషీన్‌లు ఈ సంస్థ సొంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం 3,000 సర్జరీలు జరుగుతాయి.

Exessive Exercise: హార్డ్‌కోర్ వ్యాయామం ప్రాణాంతకం.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందట..


2. టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై (Tata Memorial Hospital)

టాటా మెమోరియల్ హాస్పిటల్ (TMH) అనేది భారతదేశంలోని క్యాన్సర్‌కు సంబంధించిన స్పెషాలిటీ రిసెర్చ్, ట్రీట్‌మెంట్ సెంటర్. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా బాధితులకు చికిత్స విషయంలో ఈ ఆసుపత్రి మంచి ఫలితాలను నమోదు చేసింది. ఈ హాస్పిటల్‌లో ప్రధాన క్యాన్సర్ రకాల చికిత్స కోసం నిపుణులైన వైద్యులు ఉన్నారు. ప్రివెంటివ్ కేర్‌కు ఈ సంస్థ పేరుపొందింది. త్వరితగతిన వైద్యపరమైన నిర్ణయాలకు సహాయపడే క్లినికల్ డెసిషన్ సిస్టమ్‌ను రూపొందించడానికి TMH.. నవ్య నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తోంది. ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్‌కు 600 పడకలు అందుబాటులో ఉన్నాయి.

Pre-diabetes: మీకు 18 ఏళ్లు దాటాయా..? అయితే, వెంటనే షుగర్ పరీక్ష చేయించుకోండి.. లేకపోతే, పెద్ద ప్రమాదమే..


3.రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీ (Rajiv Gandhi Cancer Institute and Research Centre)

ఇది ఒక ఛారిటబుల్ హాస్పిటల్. ఇంద్రప్రస్థ క్యాన్సర్ సొసైటీ యూనిట్‌గా ఈ సంస్థ పనిచేస్తోంది. సమాజంలోని ప్రతి వర్గానికి నాణ్యమైన క్యాన్సర్ కేర్ ట్రీట్‌మెంట్ అందించాలనే ఏకైక లక్ష్యంతో 1996లో రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఈ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చు. ఇక్కడ క్యాన్సర్ రోగులకు 300 పడకల సామర్థ్యం ఉంది. స్పెషల్ పీడియాట్రిక్ క్యాన్సర్ కేర్ యూనిట్ ఉంది. ఇది క్యాన్సర్ చికిత్స కోసం NABH, NABL గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆసుపత్రి.

4.ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ (Delhi State Cancer Institute)

ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ను 2006లో స్థాపించారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో క్యాన్సర్ చికిత్సను అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అటానమస్, ఇండిపెండెంట్ హాస్పిటల్ ఇది. క్యాన్సర్ రోగులకు సంబంధించిన రిపోర్ట్స్‌ను ఒకే రోజులో సిద్ధం చేసే నెట్‌వర్క్ ఇక్కడ ఉంది. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్.. హై డోస్ రేట్ బ్రాకీథెరపీతో సహా అత్యాధునిక సర్జరీ సౌకర్యాలను అందిస్తోంది. ప్రతిరోజూ 800 మంది రోగులకు ఓపీ సేవలు అందిస్తోంది. ఆసుపత్రిలో 200 మంది రోగులకు కీమోథెరపీ, 250 మంది రోగులకు రేడియేషన్‌ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

Sleep tips: హాయిగా నిద్ర పట్టాలా? అయితే పడుకునే ముందు ఇలా చేయండి..



5.అడయార్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, చెన్నై (Adyar Cancer Institute)

అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్.. క్యాన్సర్ కేర్ కోసం స్థాపించిన ఒక ఛారిటబుల్ హాస్పిటల్. ఇక్కడ క్యాన్సర్ రోగుల కోసం 535 పడకలు ఉంటాయి. కాలేజ్ ఫర్ ఆంకోలాజికల్ సైన్సెస్, రీసెర్చ్ డివిజన్, ప్రివెంటివ్ ఆంకాలజీ కోసం ప్రత్యేక విభాగం.. వంటివి ఈ సంస్థ ప్రత్యేకతలు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో హై క్లాస్ ట్రీట్‌మెంట్ ఆప్షన్స్, మోడ్రన్ టెక్నాలజీతో క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే సదుపాయాలు ఉన్నాయి. 

6.రీజినల్ క్యాన్సర్ సెంటర్, తిరువనంతపురం (Regional Cancer Center)

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న రీజినల్ క్యాన్సర్ సెంటర్ ఒక ఛారిటబుల్ హాస్పిటల్. ఈ సంస్థ క్యాన్సర్ చికిత్స, పరిశోధనలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆంకాలజీ రంగంలో నిపుణుల శిక్షణతో పాటు క్యాన్సర్ చికిత్స కోసం ఆధునిక సౌకర్యాలు ఈ హెల్త్ కేర్ ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకతలు. 

7.కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, బెంగళూరు (Kidwai Memorial Institute Of Oncology)

ఈ హాస్పిటల్ భారత ప్రభుత్వం సహాయ, సహకారాలతో పనిచేసే పరిశోధనా సంస్థ. KMIO క్యాన్సర్‌ చికిత్సకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆసుపత్రి మల్టీడిసిప్లినరీ పేషెంట్ కేర్‌ను అందిస్తుంది, ఫీల్డ్ కోసం పరిశోధనలను నిర్వహిస్తుంది. క్యాన్సర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌ను కూడా ప్రోత్సహిస్తుంది.

Women Health: మొదటిసారి మెన్‌స్ట్రువల్ కప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు అనుసరించాల్సినవి.. సంబంధించిన వీడియో..



8.గుజరాత్ క్యాన్సర్ & రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, అహ్మదాబాద్ (The Gujarat Cancer & Research Institute)

గుజరాత్ క్యాన్సర్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది గుజరాత్ క్యాన్సర్ సొసైటీ, గుజరాత్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స అందించే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా దీనికి గుర్తింపు ఉంది. ఇక్కడ రోగుల కోసం అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి. క్యాన్సర్‌ని నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్‌లతో కూడిన నిపుణుల బృందం పనిచేస్తుంది. మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ప్రివెంటివ్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గైనక్-ఆంకాలజీ, న్యూరో-ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, క్యాన్సర్‌కు సంబంధించి రేడియో డయాగ్నసిస్‌ వంటి ట్రీట్‌మెంట్స్ ఈ హాస్పిటల్ ప్రత్యేకతలు.

9.పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, చండీగఢ్ (Postgraduate Institute Of Medical Education & Research)

మల్టీడిసిప్లినరీ హెల్త్ కేర్ ట్రీట్‌మెంట్, ఎడ్యుకేషన్ విషయంలో అత్యుత్తమ వైద్య సంస్థగా PGIMERకు గుర్తింపు ఉంది. అప్లాస్టిక్ అనీమియా, లింఫోమా, తలసేమియా, మల్టిపుల్ మైలోమా, బ్లడ్ క్యాన్సర్‌లకు ఇక్కడ ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ అందిస్తారు. 

10.క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ముంబై (Cancer Care Foundation of India, Mumbai)

క్యాన్సర్ లేదా క్యాన్సర్ చికిత్సల దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ, కాంప్లిమెంటరీ ట్రీట్‌మెంట్ కోరుకునే వారికి.. ముంబైలోని CCFI సెంటర్ ఉచిత చికిత్సలను అందిస్తుంది. ఇక్కడ ఆయుర్వేదం, యోగా, గోమూత్ర చికిత్సలు అందిస్తారు. క్యాన్సర్ రోగులకు ఆహారం, పోషకాహారానికి సంబంధించిన సలహాలు అందిస్తారు. ఈ చికిత్సలు అల్లోపతి ట్రీట్‌మెంట్స్‌ను ఎదుర్కోవడంలో, క్యాన్సర్ మెడిసిన్స్‌ను బాగా గ్రహించడంలో చాలా మందికి సహాయపడుతున్నాయి. CCFIకి నాసిక్,  బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి.

First published:

Tags: Cancer, Health Tips

ఉత్తమ కథలు