• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • TOO MUCH SEX CAN WORSEN THE HEALTH SITUATIONS OF PEOPLE WITH HEART PROBLEMS SSR

ఇంతకంటే ఎక్కువ సేపు సెక్స్ చేస్తున్నారా... అయితే ఇది తెలిస్తే షాక్ అవుతారు..!

ఇంతకంటే ఎక్కువ సేపు సెక్స్ చేస్తున్నారా... అయితే ఇది తెలిస్తే షాక్ అవుతారు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీ ఒక్కరి జీవితంలో శ‌ృంగారం అనేది ఓ అందమైన అనుభూతి. శృంగారంతో ఆనందమే కాక ఆరోగ్యం కూడా సొంతమవుతుందంటున్నారు నిపుణులు. అయితే అడ్డదారులు తొక్కి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం...

  • Share this:
    ప్రతీ ఒక్కరి జీవితంలో శ‌ృంగారం అనేది ఓ అందమైన అనుభూతి. శృంగారంతో ఆనందమే కాక ఆరోగ్యం కూడా సొంతమవుతుందంటున్నారు నిపుణులు. అయితే అడ్డదారులు తొక్కి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అత్యంత ప్రమాదమంటున్నారు. వివాహ బంధంలోని మధురానుభూతికి తొలి అడుగు శృంగారం. అందుకే పెళ్లి చేసుకున్న కొత్తలో భార్యాభర్తలు శృంగార అనుభూతి కోసం పరితపిస్తుంటారు. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారు. అయితే ఇందులో ఎలాంటి తప్పులేదు కానీ ఎక్కువ సేపు శృంగారం చేయడం కూడా ముప్పేనంటున్నారు వైద్యులు. చాలామంది మగాళ్లు భార్య దృష్టిలో హీరో అనిపించుకోవడానికి వీలైనంత ఎక్కువ సేపు సెక్స్ చేయాలని భావిస్తుంటారు.

    సాధారణంగా సెక్స్‌ను 4,5 నిముషాలు మాత్రమే చేసే సామర్ధ్యం ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం సెక్స్ చేసే సమయాన్ని పెంచి ఎక్కువ సమయం సెక్స్ చేయాలనే ఆలోచన చాలామందిలో పెరిగింది. ఫలితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారు. కొన్ని రకాల డ్రగ్స్‌ను ఉపయోగించి సెక్స్ సమయాన్ని పెంచాలని అలాగే ఇద్దరూ,ముగ్గురితో సెక్స్ చేయాలి అనే ఆలోచనలు యువతలో పెరుగుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.

    అయితే దీని కోసం డ్రగ్స్ తీసుకోవడం వలన వారు సెక్స్ ఎక్కువ సమయం చేయడమే కాకుండా వారు ఆహారానికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వారికి ఆకలి కంటే తమ కోరికలు తీర్చుకోవాలని ఉంటుందట. అలాగే ఇద్దరి ముగ్గురితో సెక్స్ చేయాలని ఉంటుందట. ఈ ప్రభావం 72 గంటలు ఉంటుందని దీనివల్ల కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆరోగ్యంపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇద్దరి ముగ్గురితో సెక్స్ చేయడం వల్ల హెచ్.ఐ.వి మరియు హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మానసికంగా కూడా ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇండియాలో కూడా చాలామంది సెక్స్‌లో ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉండటానికి వయాగ్రా వంటివి వాడుతుంటారని, వాటిని వాడటం కంటే సహజ శృంగారమే శ్రేయస్కరమని డాక్టర్లు సూచిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: