• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • TOO MUCH COWS MILK CAN ACTUALLY DAMAGE TO YOUR BONES WARNS NEW STUDY MS GH

Cow Milk: ఆవుపాలు అతిగా తాగితే ప్రమాదమా..? విస్మయం చెందే నిజం చెప్పిన తాజా అధ్యయనం

Cow Milk: ఆవుపాలు అతిగా తాగితే ప్రమాదమా..? విస్మయం చెందే నిజం చెప్పిన తాజా అధ్యయనం

ప్రతీకాత్మక చిత్రం

Cow Milk: రోజుకు మూడు గ్లాసులు, అంతకు మించి ఆవుపాలు తాగేవారిలో.. ఎముకలు విరిగే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. పాలల్లో సహజంగా లభించే D-గలాక్టోజ్, లాక్టోజ్ ఇందుకు కారణం కావచ్చని పేర్కొన్నారు.

  • News18
  • Last Updated:
  • Share this:
ఆహారాన్ని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఏదైనా అవసరానికి మించి తీసుకుంటే అది విషంగా మారుతుందనే విషయాన్ని కొత్త అధ్యయనం నిరూపిస్తోంది. ఎన్నో రకాల పోషకాలకు నిలయమైన పాలను ఎక్కువగా తీసుకోకూడదని పరిశోధకులు తెలిపారు. ఎముకల ఆరోగ్యానికి ఆవు పాలు తాగాలని సాధారణంగా డాక్టర్లు సూచిస్తారు. కానీ వీటిని ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయని పరిశోధకులు తేల్చారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని BMJ జర్నల్‌లో ప్రచురించారు. ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల పాలు తాగడం వల్ల మహిళల్లో ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు.

రోజుకు మూడు గ్లాసులు, అంతకు మించి ఆవుపాలు తాగేవారిలో.. ఎముకలు విరిగే ప్రమాదం 16 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెప్పారు. పాలల్లో సహజంగా లభించే D-గలాక్టోజ్, లాక్టోజ్ ఇందుకు కారణం కావచ్చని పేర్కొన్నారు. D-గలాక్టోజ్ అనేది పాలల్లో ఉండే సహజ చెక్కెర. లాక్టోజ్‌ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది. ఫలితంగా శరీర భాగాల్లో మంట, వాపు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి.

తక్కువ తీసుకోవాలి...

ఎముకల బలోపేతానికి తోడ్పడే కాల్షియం పాల నుంచి ఎక్కువగా లభిస్తుంది. కానీ 8 ఔన్సుల (సుమారు 230 మిల్లీ లీటర్లు) ఆవుపాల నుంచి ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే కాల్షియంలో 30 శాతం అందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆవు పాలలో మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ఇవన్నీ ఎముకలతో పాటు దంతాల ఆరోగ్యానికి కూడా కృషి చేస్తాయి. కానీ జున్ను, కొవ్వుశాతం ఎక్కువగా ఉండే ఆవుపాలు వంటి డైరీ ఉత్పత్తుల్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంట, వాపును పెంచుతాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని పరిశోధకులు తేల్చారు. కానీ ఈ ఫలితాలను ధ్రువీకరించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని చెప్పారు.

పరిమితంగా తీసుకుంటేనే మంచిది...

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన మరో పరిశోధన కూడా ఇలాంటి వివరాలనే వెల్లడించింది. డైరీ ఉత్పత్తులు, యానిమల్ ప్రోటీన్, కాల్షియం వంటివి ఎక్కువగా తీసుకునే దేశాల్లో ఆస్టియోపోరోసిస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కనుగొన్నారు. వీటివల్ల ఎముకల్లో పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అందువల్ల తరచుగా ఎముకల్లో పగుళ్లు ఏర్పడే సమస్య ఉన్నవారు ఆవు పాలను తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది.
Published by:Srinivas Munigala
First published:

అగ్ర కథనాలు