షుగర్ ఫ్రీ మామిడి పండ్లు... డయాబెటిక్ పేషెంట్లకు పండగే...

Sugar Free Mangoes : ఎంతో రుచికరమైన మామిడి పండ్లను తినాలంటే డయాబెటిక్ పేషెంట్లు కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. కారణం వాటిలో ఉండే అతి తియ్యదనమే. తాజాగా వారు కూడా తినదగ్గ మామిడి పండ్లు వచ్చేశాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 8:28 AM IST
షుగర్ ఫ్రీ మామిడి పండ్లు... డయాబెటిక్ పేషెంట్లకు పండగే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రకరకాల రంగులు, రుచులతో సమ్మర్ సీజన్‌లో ఆకట్టుకునే మామిడిపండ్లు నచ్చనిదెవరికి. పండ్లలో రారాజుగా పిలిచే మామిడిలో అల్ఫాన్సో, కేసర్, లాంగ్డా వంటివి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడుతున్నవి. ఐతే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మామిడి జాతి మాత్రం వనరాజ్. ప్రపంచంలోనే డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా ఉండే ఇండియాలో వనరాజ్ జాతి మామిడి పండ్లు వారికి ఎంతో మేలు చెయ్యబోతున్నాయి. సాధారణంగా మామిడి పండ్లు తినొద్దని షుగర్ పేషెంట్లకు డాక్టర్లు సూచిస్తారు. అవి తింటే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయి, కంట్రోల్ తప్పుతారని చెబుతుంటారు. అలాగని మామిడి తినకుండా ఉండటం చాలా కష్టం. అందుకే వారు కూడా తినేందుకు వీలుగా మామిడి పండ్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ఫలించడం ద్వారా షుగర్ ఫ్రీ వనరాజ్ జాతి మామిడి పండ్లను తయారుచెయ్యగలిగారు.

మహారాణా ప్రతాప్ యూనివర్శిటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ‌లో పరిశోధకులు... గ్లూకోజ్ (షుగర్ పదార్థం) తక్కువగా ఉండే మామిడి పండ్లు ఏవి ఉన్నాయో గమనించారు. వనరాజ్ జాతిలో గ్లూకోజ్ తక్కువగా ఉన్నట్లు తేలింది. వాటిపై చేసిన పరిశోధనలు ఫలించడంతో... డయాబెటిక్ పేషెంట్లు తినదగ్గ విధంగా వనరాజ్ పండ్లను సృష్టించారు.

వనరాజ్ మామిడి పండ్లను మధ్యప్రదేశ్‌ ప్రజలు ఎక్కువగా తింటారు. గుజరాత్‌లో వాటిని పండిస్తున్నారు. ఇవి పొడుగ్గా ఉంటూ... పై భాగంలో ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని మార్పులు చెయ్యడం ద్వారా ఈ పండ్లలో గ్లూకోజ్‌ని 9 శాతానికి మాత్రమే పరిమితం చేశారు. సాధారణంగా మేంగోలో 24 శాతం గ్లూకోజ్ ఉంటుంది. అందువల్ల వనరాజ్ జాతి పండ్లను షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణ మామిడి పండ్లలో పుల్లదనం అన్నది 15 నుంచీ 16 శాతం ఉంటుంది. వనరాజ్ పండ్లలో అది 31 శాతం ఉంది. అయినప్పటికీ అవి పులుపు కంటే తీపిగా ఉన్నట్లే అనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇకపై వనరాజ్ జాతి పండ్లను డయాబెటిక్ పేషెంట్లు తినవచ్చని సూచిస్తున్నారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు