Home /News /life-style /

hair fall treatment: జుట్టు రాలిపోతుందా.. బట్టతల వస్తుందేమోనని భయమా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

hair fall treatment: జుట్టు రాలిపోతుందా.. బట్టతల వస్తుందేమోనని భయమా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే మనం ఈ జాగ్రత్తలు (hair fall treatment) తీసుకుంటే జుట్టు రాలడాన్ని (hair loss) నివారించొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం.

    సగటు జీవిలో జుట్టు రాలిపోతుండటాన్ని ( hair loss) చూసి తట్టుకోలేడు. ఇక అమ్మాయిలైతే (girls) మరేమరి. కేశాలు వారి అందాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పడలో అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. మహిళల కురులు (women hairs) మగవారికీ ఇష్టమే. కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా (beauty) కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్​ స్టైల్స్​ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్​ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే మనలో చాలామందికి వారి ఆహారపు అలవాట్లు, జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం (hair fall) జరుగుతుంది. జుట్టు (hair) రాలిపోతుంటే విలవిలలాడిపోతూ ఉంటారు చాలా మంది.  అయితే నల్లని ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పటి ఆరోగ్య పరిస్థితులు వలన జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే మనం ఈ జాగ్రత్తలు (hair fall treatment) తీసుకుంటే జుట్టు రాలడాన్ని (hair loss) నివారించొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం.

    విటమిన్స్​..

    జుట్టుకి విటమిన్ B (Vitamin B6) కాంప్లెక్స్ చాలా ముఖ్యం. దీని లోపం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి6 మన జుట్టు ఆరోగ్యానికి సంబంధించినది. ఈ విటమిన్ లోపం ఉన్నట్లయితే జుట్టు బలహీనంగా (hair weak) మారుతుంది. ఎక్కువగా ఊడిపోయి బట్టతల (bald head)వస్తుంది.

    మన శరీరంలో జింక్ (zinc) కొరత ఉందని పలు ఆరోగ్య సంస్థల నివేదికలు చెబుతున్నాయి. జింక్ లోపం శ్వాసకోశ వ్యవస్థ, చర్మానికి సంబంధించిన వ్యాధులను మాత్రమే కలిగిస్తుంది. జింక్ లోపం ప్రధాన లక్షణం జుట్టు వేగంగా రాలడం (hair fall). మీ జుట్టు అకస్మాత్తుగా రాలడం ప్రారంభించిందని మీకు అనిపిస్తే అది జింక్ లోపం వల్ల కావచ్చు. జింక్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని సరిచేయవచ్చు.

    బయోటిన్ (biotin) అనేది జుట్టుకు అవసరమైన మూలకం. ఇది లేకపోవడం వల్ల జుట్టు పలుచబడుతుంది. దీని లోపం వల్ల గోళ్లు కూడా విరిగిపోతాయి. కండరాల అలసట, బలహీనత, మైకము, కాళ్ళలో తిమ్మిరి వంటివి బయోటిన్ లోపం లక్షణాలు. ఇది శరీరానికి అవసరమైన మూలకం. కానీ జుట్టు, గోళ్లకు ఇది చాలా ముఖ్యమైనది.

    (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hair fall, Treatment

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు