గుండె పదిలంగా ఉండాలంటే ఇలా చేయండి..

శరీరంలో అతి ముఖ్యమైన, సన్నితమైన భాగం హృదయం.. గుండెకు వ్యాయమం తప్పనిసరి..

news18-telugu
Updated: January 7, 2019, 11:15 PM IST
గుండె పదిలంగా ఉండాలంటే ఇలా చేయండి..
నమూనా చిత్రం
  • Share this:
హృదయం.. మన శరీరంలో అతి ముఖ్యమైన మరియు సన్నితమైన భాగం. హృదయాన్ని పదిలంగా ఉంచుకోవాడానికి వ్యాయామాలు చేయడమే కాదు.. మదికి విశ్రాంతినిచ్చే వ్యాయామాలు అవసరమే.

శరీరంలోని అన్ని భాగాలకు నిత్యం రక్తం సరఫరా చేసే హృదయానికి.. చివరకు నిద్రలో కూడా విశ్రాంతి దొరకదు.  అయితే రక్త ప్రసరణ వేగాన్ని తగ్గించాడానికి మాత్రం కొన్ని వ్యాయామాలున్నాయి.  దీంతో హృదయానికి  కొంత ఉపశమనం కలుగుతుంది.  అందుకే మీ కోసం కొన్ని వ్యాయామాలు..  రోజులో కనీసం 5 నిమిషాలైన వీటికి కేటాయించడం.

గోడకు దగ్గరగా చాప వేసుకుని వెల్లకిలా పడుకోవాలి.

ఇలా పడుకున్నప్పుడు మోకాళ్లను మడిచి, పైకి లేపి, పిరుదులు గోడకు తగలాలి.


చేతులను వెనక్కి వాల్చేసి, కాళ్లను నెమ్మదిగా నిటారుగా పైకి లేపాలి.
పైకి లేపిన కాళ్లను గోడకు ఆనించి, బరువును గోడ మీదే వేయాలి.

ఈ భంగిమలో మనసు ప్రశాంతంగా ఉంచుకుని, ఊపిరి పీల్చుకోవాలి.ఇలా ఉన్నప్పుడు గుండె వేగం తగ్గడం మనకు స్పష్టంగా తెలుస్తుంది.
ఇలా 5 నిమిషాల పాటు ఉండి నెమ్మదిగా కాళ్లను కిందకి దించి, చేతులు నేల మీద ఉంచి, లేచి నిలబడాలి.
ఈ వ్యాయామాలు చేయడం ద్వారా హృదయాన్ని పదిలంగా ఉంచుకోగలం.
First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>