ఎప్పటి నుంచో భారతీయ వేడుకల్లో రకరకాల ఆహార పదార్థాలు కూడా ప్రత్యేకం. ప్రతి పండుగలో సంప్రదాయ వంటకాలను తయారు చేయడం ఆనవాయితీ. దీపావళి (diwali 2021) అంటే స్వీట్లు. రుచికరమైన స్వీట్ ట్రీట్ కలగలిపి దీపావళిని జరుపుకొంటారు. దీపావళి (diwali 2021) ఐదు రోజుల పండుగ. ఇది ధన్తేరాస్ (dhanteras 2021) తో ప్రారంభమవుతోంది. ప్రతిరోజూ వివిధ పూజలు చేస్తారు. సాంప్రదాయ వంటకాలు తయారు చేసుకుంటారు. అవి తినకుండా ఉండలేరు. దీంతో చాలా మంది గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం, యాసిడిటీ (acidity) వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఈ దీపావళికి కూడా మీరు అలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తే.. కొన్ని ఇంటి చిట్కాలతో సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
వాము..
దీపావళి పండుగ రోజు కాస్త ఎక్కువగా తినడం వల్ల యాసిడిటీ,గ్యాస్, అజీర్ణం (indigestion problem)వంటి సమస్యలు ఎదురైతే.. వాముతో నిరోధించవచ్చు. ఒక చిన్న చెంచా వాము తీసుకుని దాన్ని మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత అందులో చిటికెడు రాళ్ల ఉప్పు కలిపి భోజనం చేసిన తర్వాత నీళ్లలో వేసుకుని తాగాలి.
ఇది కూడా చదవండి: Diwali 2021: విదేశాల్లో వెలుగుల దీపావళి!
శొంఠి..
శొంఠి కూడా గ్యాస్, యాసిడిటీ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందిజ దీని కోసం ఆహారం తిన్న 10–15 నిమిషాల తర్వాత నీటిలో అర టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవాలి.
కరక్కాయ..
మీ కడుపుని శుభ్రం చేయడానికి కర క్కాయ కూడా బాగా పనిచేస్తుంది. దీంతో మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. దీనికోసం కరక్కాయను పొడి కొట్టి, తిన్న తర్వాత 10–15 నిమిషాల తర్వాత అర టీస్పూన్ మామూలు నీటిలో వేసుకుని తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: భలే..భలే.. భారీ గుమ్మడికాయ.. బరువు 1,226 కేజీలు!
ఇంగువ..
ఇంగువ మీకు రెట్టింపు ప్రయోజనాలు అందించడంలో సహాయపడుతుంది. దీపావళి పండుగలో మీరు ఎక్కువగా తిన్నా, అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం సమస్య వచ్చినట్లయితే చిటికెడు ఇంగువ పొడిని నీళ్లలో వేసుకుని తాగాలి. కాబట్టి దీని కోసం ఇంగువను వేయించి నీళ్లలో కలిపి తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021