ఏదైనా సంబంధంలో కొత్తగా మార్పు కనిపించినప్పడు ఒకరితో మరొకరు సమయం గడపడం మంచిది. కొత్త జంటలు (new couples) గంటల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. సమయం గడిచే కొది వారి మధ్య కంప్లై ట్స్ మొదలవుతాయి. అలాంటి పరిస్థితుల్లో అంతా గొడవగా మారుతుంది. నిజానికి ఈ రిలేషన్‌షిప్ (relationship)లో ఇంత గ్యాప్ రావడానికి కారణం దంపతుల మధ్య లైఫ్‌లో ఎక్సైట్‌మెంట్ లేకపోవడం. అవును.. ఇది విసుగ్గా అనిపించవచ్చు. అలాంటి సమయంలో కాస్త ఒకరితోమరొకరి సమయాన్ని వెచ్చించుకవాలి. లేకపోతే దూరం కావడం సహజం. మీకు, మీ భాగస్వామి మధ్య గ్యాప్ ఉందనిపిస్తే.. ఈచిట్కాలను అనుసిరించండి. మీ సంబంధానికి తిరిగి ఉత్సాహాన్ని తీసుకురావచ్చు.
టైం కేటాయించడం..
మీ విలువైన సమయాన్ని మీ పార్ట్నర్‌తో (partner) గడపడానికి సుదీర్ఘ సెలవులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి గడపవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామితో సరైన సంభాషణకు ప్రయత్నించండి. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ సంబంధాల్లో అపార్థాలను పెంచుతుంది.
ఇది కూడా చదవండి: ఉసిరితో గుండె సంబంధిత వ్యాధులకు చెక్! ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకా..
మీ భాగస్వామిని సంతోష పెట్టడానికి పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే, మీ భాగస్వామికి కొన్ని అభినందనలు (wishes) ఇవ్వడం ద్వారా మంచి అనుభూతిని కలిగించవచ్చు. మీ సంబంధానికి ఆనందం, ఉత్సహాన్ని తీసుకురావడానికి.. కొన్ని సార్లు మీ జీవిత భాగస్వామికి అభినందనలు ఇవ్వండి.
సర్‌ప్రైజ్ గిఫ్ట్..
మీరు కొన్నిసార్లు మీ భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వచ్చు. ఈ బహుమతులు తప్పనిసరిగా ఖరీదైనవి కాకపోయినా ఫర్వాలేదు, కానీ, ఆ బహుమతి మీ భాగస్వామి అభిరుచికి తగినదిలా ఉండాలి. సర్‌ప్రైజ్ గిఫ్ట్ (surprise gift) గా ఒక వెకేషన్ లేదా డిన్నర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: పళ్లను బ్రష్ చేసుకోవడానికి 2 నిమిషాలు సరిపోదా?
ఎప్పుడూ మీ అభిప్రాయమే కరెక్ట్ అని చెప్పవద్దు. అప్పుడు వారి మధ్య గ్యాప్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు కొంచెంద స్పేస్ ఇవ్వండి. ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండండి. అలా చేయడం వల్ల రిలేషన్‌షిప్ ఆనందండా ఉంటుంది.
జోక్స్..
ఎప్పుడూ ముభావంగా ఉండకుండా అప్పుడప్పుడు కాస్త జోకులు (jokes) , వినోదం కలిగించడం వల్ల మీ సంబంధం ఎక్సైట్‌మెంట్‌గా ఉంటుంది.సంబంధాన్ని సరదాగా చేయడానికి నవ్వడం అవసరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Relationship