• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • TIPS TO WOMEN WHO ARE NOT INTERESTED IN SEX AND THE REASONS BA GH

Sexual Wellness: ‘అబ్బా.. సెక్స్ వద్దు’ అని మహిళలు అనడానికి కారణాలు.. వారిలో ఉత్సాహం నింపే చిట్కాలు

Sexual Wellness: ‘అబ్బా.. సెక్స్ వద్దు’ అని మహిళలు అనడానికి కారణాలు.. వారిలో ఉత్సాహం నింపే చిట్కాలు

పోలీసులు ఆదివారం పంట పొలాల్లో మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)

కొంతమంది మహిళలకు, శృంగారం గొప్పగా అనిపించకపోతే, ఉద్వేగం పొందడం కష్టం అవుతుంది. వారు సంభోగంతో క్లైమాక్స్ చేరాలని అనుకుంటారు. కానీ, తమ భాగస్వామి ఆశించిన మేర సంతృప్తినివ్వకపోతే తమ శృంగార కోరికలు తీర్చుకునేందుకు సెక్స్ టాయ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారు.

  • Share this:
పడక గదిలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా కలయికలో పాల్గొంటేనే శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించగలరు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిరాసక్తత కనబర్చినా రెండో వ్యక్తిలో ఉత్సాహం తగ్గిపోతుంది.సాధారణంగా పురుషులు సెక్స్ కోసం చొరవ తీసుకుంటారు. మహిళలు మొదట్లో ఆసక్తి కనబర్చకపోయినా.. ఫోర్ ఫ్లే తర్వాత రతి క్రీడను ఆస్వాదిస్తారు. ముద్దులు, కౌగిలింతల తర్వాత మెల్లగా భాగస్వామికి సహకరిస్తారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్ది ఆడవారిలో లైంగిక వాంఛలు తగ్గుతుంటాయి. ఈ కారణంగా మగవారితో పోలిస్తే వారు శృంగారంలో అంత ఉత్సాహంగా పాల్గొనలేరు. మహిళలు కొన్ని సమయాల్లో శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఒత్తిడి అధికమవ్వడం

మహిళల్లో శృంగారం వాంఛలు తగ్గడానికి  ఒత్తిడి ప్రధాన కారణంగా చెప్వచ్చు. ఆఫీసు లేదా ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీ లైంగిక జీవితాన్ని అది దెబ్బతీస్తుంది. అందువల్ల, ఒత్తిడి నుంచి బయటపడితేనే మీ లైంగిక జీవితం సాఫీగా సాగుతుందని గుర్తించుకోండి. ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీ రోజూవారి దినచర్య నుండి కొంత విరామం తీసుకోండి. ఆరోగ్యకమైన ఆహారాన్ని తీసుకోండి.  కొంత విశ్రాంతి తీసుకోని మీ భాగస్వామితో శృంగారాన్ని గొప్పగా ఆస్వాదించండి.

నొప్పి తలెత్తడం

శృంగారం సమయంలో కొంత మంది మహిళలకు నొప్పి కలుగుతుంది. కొంత మంది పురుషులు అసహజ శృంగారంలో పాల్గొనాలని భాగస్వాములను ఒత్తిడి తెస్తారు. దీని వల్ల వారిలో తీవ్రమైన నొప్పి తలెత్తి, శృంగారం పట్ల భయం ఏర్పడుతుంది. ఇదే కాకుండా ఆర్థరైటిస్, కేన్సర్, డయాబెటిస్, హైబీపీ, నరాల సంబంధిత సమస్యలు మొదలైనవి మహిళల్లో లైంగిక వాంఛలను తగ్గిస్తాయి. అలాగే, గర్భం దాల్చిన సమయంలో, కాన్పు తర్వాత, చంటి పిల్లలకు చనుబాలు ఇస్తున్నప్పుడు.. చాలా మంది మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. హార్మోన్లలో వచ్చే మార్పే దీనికి కారణమని చెప్పవచ్చు. ఇటువంటి సమయాల్లో మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించండి.

మానసిక కారణాలు

కొన్నిసార్లు, నిరాశ, అంతర్లీన ఆందోళన మీలో శృంగార కోరికలు తగ్గడానికి కారణమవుతుంది. మీ ఇద్దరి మధ్య తలెత్తే చిన్న చిన్న వివాదాలు కూడా లైంగిక ఆసక్తి తగ్గడానికి కారణం కావొచ్చు. చాలా మంది మహిళలు భాగస్వామితో మానసికంగా, భావోద్వేగ పరమైన అనుబంధాన్ని ఇష్టపడతారు. ఆ తర్వాతే సెక్స్‌కి ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి భాగస్వామితో ఏవైనా సమస్యలు ఉన్నా వారిలో లైంగిక వాంఛలు తగ్గుతాయి.

శృంగారం పట్ల భయం

చాలా మంది మహిళలు, శృంగారం ప్రారంభంలో అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. కానీ, ఫోర్ ప్లే తర్వాత వారు మూడ్లోకి వస్తారు. తర్వాత శృంగారాన్ని అమితంగా ఆస్వాదిస్తారు. మరికొంత మంది మహిళల్లో ఎటువంటి మానసిక సమస్యలు లేనప్పటికీ శృంగారం పట్ల విముఖంగా ఉంటారు. దీన్నే హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజార్డర్ (HSDD) అంటారు. దీనికి పరిష్కారంగా వైద్యులు సూచించే కొన్ని మందులు వాడండి.

ఉద్రేకం చెందకపోవడం

కొంతమంది మహిళలకు, శృంగారం గొప్పగా అనిపించకపోతే, ఉద్వేగం పొందడం కష్టం అవుతుంది. వారు సంభోగంతో క్లైమాక్స్ చేరాలని అనుకుంటారు. కానీ, తమ భాగస్వామి ఆశించిన మేర సంతృప్తినివ్వకపోతే తమ శృంగార కోరికలు తీర్చుకునేందుకు సెక్స్ టాయ్స్ వంటి వాటిని ఆశ్రయిస్తారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: