Home /News /life-style /

TIPS TO MAKE HAIR COLOR AT HOME PVN

Hair Color : జుట్టు తెల్లబడుతోందా?వంటగదిలో ఉండే వీటితో మీకు నచ్చిన కలర్ హెయిర్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Tips to make hair color at home:ఆరోగ్యంతో పాటు, బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం ప్రభావం కూడా మన జుట్టుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వెంట్రుకలు త్వరగా తెల్లబడటం ప్రారంభమవుతుంది.

Tips to make hair color at home : ఆరోగ్యంతో పాటు, బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారం ప్రభావం కూడా మన జుట్టుపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా వెంట్రుకలు త్వరగా తెల్లబడటం ప్రారంభమవుతుంది. కొంతమంది తెల్ల జుట్టును దాచుకోవడానికి హెయిర్ కలర్ వాడుతుంటారు. అయితే, వంటగదిలో ఉండే కొన్ని సహజ పదార్ధాల సహాయంతో మీరు జుట్టుకి సహజంగా కలర్స్ వేసకోవచ్చు.

నిజానికి, మార్కెట్‌లో లభించే హెయిర్ కలర్స్ కొంత సమయం వరకు తెల్ల జుట్టును దాచడంలో మీకు సహాయపడతాయి. అయితే వీటిని వాడడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టుతో పాటు తెల్లజుట్టు సమస్య మరింత పెరగడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో కొన్ని సహజమైన జుట్టు రంగులను ఉపయోగించి మీరు మీ జుట్టుకు మీకు ఇష్టమైన రంగును ఇవ్వవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సహజ నలుపు రంగు
వెంట్రుకలు నల్లగా చేయాలనుకుంటే ..ఇందుకోసం ముందుగా కొన్ని కరివేపాకులను నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. ఇప్పుడు 1-2 రోజులు ఉంచండి. తర్వాత ఈ మిశ్రమాన్ని హెన్నాలో వేసి వేడి చేసి జుట్టుకు బాగా పట్టించాలి. 2 గంటల తర్వాత షాంపూతో జుట్టును కడగాలి.

Exercise Tips : జిమ్ లో రోజుకి ఎంతసేపు ఎక్సర్ సైజ్ చేస్తే బెటర్

గోధుమ రంగు జుట్టు కోసం
గోధుమ రంగు జుట్టును ఇష్టపడితే, మీ జుట్టును సహజంగా బ్రౌన్ చేయాలనుకుంటే..మీరు ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు. దీని కోసం, హెన్నా హెన్నా పౌడర్‌లో అర టీస్పూన్ కాఫీ పొడిని కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని జుట్టు మరియు తలకు పట్టించి కొన్ని గంటల తర్వాత జుట్టును కడగాలి. ఇది మీ జుట్టు బ్రౌన్ కలర్‌గా మారుతుంది.

బుర్గుండి లేదా ఎరుపు
కొంతమంది లైట్ ఎరుపు రంగు జుట్టును ఇష్టపడతారు. దీని కోసం మీరు బీట్‌రూట్ సహాయం తీసుకోవచ్చు. ఇది జుట్టుకు బుర్గుండి రంగును ఇవ్వడమే కాకుండా, కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇందుకోసం కొబ్బరినూనెలో దుంప రసాన్ని కలిపి జుట్టుకు పట్టించి రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడుక్కోవాలి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Hair problem tips, Hair styling

తదుపరి వార్తలు