హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Backpain: వెన్నునొప్పి వేధిస్తోందా... తగ్గడానికి ఇలా చెయ్యండి

Backpain: వెన్నునొప్పి వేధిస్తోందా... తగ్గడానికి ఇలా చెయ్యండి

How to reduce Backpain: వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా చాలా మందికి వెన్నునొప్పి వస్తోంది. అలాంటి వారు... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. అది తగ్గిపోతుంది.

How to reduce Backpain: వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా చాలా మందికి వెన్నునొప్పి వస్తోంది. అలాంటి వారు... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. అది తగ్గిపోతుంది.

How to reduce Backpain: వర్క్ ఫ్రమ్ హోమ్‌లో భాగంగా చాలా మందికి వెన్నునొప్పి వస్తోంది. అలాంటి వారు... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. అది తగ్గిపోతుంది.

  వెన్నునొప్పి ప్రమాదకరమైనది. అది మొదట్లో వెన్నుకి మాత్రమే వస్తుంది. దాన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా అది చేతులు, కాళ్లకు కూడా పాకేస్తుంది. ఎక్కువ సేపు డెస్కు దగ్గర కూర్చొని పనిచేసేవారికి ఇది వస్తూ ఉంటుంది. అలాగే... ఎక్కువ బరువులు మోసేవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఎక్కువ టైమ్ డ్రైవింగ్ చేసినా పెయిన్ కామనే. ఇది రావడానికి ప్రధాన కారణం... చాలా కండరాలు అలసిపోవడమే. సరైన ఎక్సర్‌సైజ్ చేయకపోతే... వెన్నునొప్పి పెరుగుతూ ఉంటుంది. ఇది కణాజాలాన్ని నాశనం చేస్తుంది. కండరాలపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది వచ్చిన వారికి... కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. నిల్చున్నా, కూర్చున్నా... ఏ పని చేద్దామన్నా.. ఆ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది.

  బ్యాక్ పెయిన్లలో చాలా వరకూ మనం తీసుకునే ప్రత్యేక చర్యలతో తగ్గిపోతాయి. ఐతే... విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గకపోతే.. డాక్టర్‌ని కలవడం మేలు. అలాగే వెన్ను నుంచి ఈ నొప్పి కాళ్లు, మోకాళ్ల కింద కూడా వస్తూ ఉంటే... వెంటనే డాక్టర్‌ని కలవాలి. నీరసంగా అయిపోతున్నా, బద్దకంగా అనిపిస్తున్నా... కాళ్లలో తిమ్మిరిలా వస్తున్నా... డాక్టర్‌ను కలవాలి. చాలా మందికి బ్యాక్ పెయిన్ పెరిగినప్పుడు... జ్వరం కూడా వస్తుంది. విపరీతంగా బరువు తగ్గిపోతారు.

  ఇలా చెయ్యండి :

  - పని ప్రదేశంలో నిఠారుగా కూర్చోండి. అలాగే నిల్చున్నప్పుడు కూడా పక్కకి వంగకండి. నిఠారుగా కూర్చోవడం వల్ల వెన్నెపూసపై భారం తగ్గుతుంది. తద్వారా బ్యాక్ పెయిన్ పెద్దగా రాదు. మీ తలను తిన్నగా పైకి ఉంచండి. రోజూ చేతులు, కాళ్లూ కదిలేలా చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చెయ్యండి. డెస్కుపై ఉండే కీబోర్డ్ కంటే... మీ చేతులు పైకి ఉండేలా చేసుకోండి.

  - మంచి ఆహారం తీసుకోండి. మాంసాహారం కంటే... శాఖాహారం ఎంతో మేలు. కొవ్వు ఉండే ఆహారాలు అస్సలు తినకండి. షుగర్ వాడకం తగ్గించి... దాని బదులు నల్ల బెల్లం వాడండి. బ్రెడ్ బదులు... గింజలు, పప్పుల వంటివి ఎక్కువ తినండి. మీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతోపాటూ... అవిసె గింజలు (flax seed), సబ్జా గింజలు (chia seed) ఎక్కువగా తీసుకోండి. కాలానుగుణంగా వచ్చే పండ్లను తప్పక తినండి.

  - సరైన ఎక్సర్‌సైజ్ చెయ్యండి. ఎన్ని పనులు ఉన్నా... వ్యాయామానికి టైమ్ కేటాయించండి. మీ రెండు చేతుల వేళ్లతో... మీ కాళ్ల వేళ్లను ముట్టుకోండి. ఇలా చేసేటపపుడు... మీ కాళ్లు నిఠారుగా ఉండాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే... ప్రాక్టీస్ అవుతుంది. మీకు వెన్నునొప్పి... దాదాపు 20 నిమిషాలకు పైగా ఉంటే మాత్రం... ఇలాంటి ఎక్సర్‌సైజులు చెయ్యడం మాని... డాక్టర్‌ని కలవడం మేలు.

  - బాగా నిద్రపోండి. నిద్ర మనకు ఒకరకమైన డాక్టర్ లాంటిది. నిద్రపోయినప్పుడు మనకు చాలా రకాల రోగాలు నయం అవుతాయి. అలాగే మన శరీరం తగిన విశ్రాంతి పొంది... కండరాలన్నీ కొత్త ఉత్తేజం తెచ్చుకుంటాయి. కాబట్టి... నిద్రను నిర్లక్ష్యం చెయ్యకూడదు. రోజుకు కనీసం 7-8 గంటలైనా నిద్రపోవాలి. కొంతమంది వెల్లకిలా తిరిగి పడుకుంటారు. అలాంటి వారు... తమ మోకాళ్ల కింద దిండును పెట్టుకోవాలి. తద్వారా వెన్నెముక తిన్నగా ఉంటుంది.

  - సరైన పరుపు, సరైన దిండ్ల వంటివి ఉంటేనే నిద్ర బాగా పడుతుంది. అప్పుడే ఇలాంటి నొప్పులన్నీ మాయమవుతాయి. కాబట్టి... నిద్రపోయేటప్పుడు అన్నీ సరిగా ఉండేలా చేసుకోండి. 313 మంది బ్యాక్ పెయిన్‌తో బాధపడేవారిపై సర్వే చెయ్యగా... వాళ్లంతా సరైన పరుపు వాడట్లేదని తెలిసింది. అందువల్ల కాస్త రేటు ఎక్కువైనప్పటికీ... సరైన బ్రాండెడ్ పరుపు కొని వాడండి. బ్యాక్ పెయిన్ పెరిగి... డాక్టర్లకు వేలకు వేలు ఇచ్చేకంటే... సరైన పరుపుకి ఆ డబ్బును ఖర్చు పెట్టడం మేలు.

  - ఒత్తిడిని తగ్గించుకోండి. చాలా మంది పని ఒత్తిడి ఎక్కువై... బాగా టెన్షన్ పడతారు. అలాంటి వారికి... మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా... బాడీ మొత్తం ఆ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మెడనొప్పి, భుజాలు, వెన్ను నొప్పి వెంటాడుతుంది. అందుకే... టెన్షన్ పెరిగినప్పుడు పని కాసేపు ఆపండి. మీకు నచ్చిన పాట వినండి. మీ వాళ్లతో మాట్లాడండి. చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. కూర్చున్న చోటి నుంచి లేచి... అలా ఓ రౌండ్ వేసి రండి. తద్వారా... చాలా వరకూ వెన్ను నొప్పికి చెక్ పెట్టవచ్చు.

  First published:

  Tags: Health Tips, Work From Home

  ఉత్తమ కథలు