Home /News /life-style /

TIPS ON HOW TO BOOST FERTILITY FOR THOSE LIVING WITH PCOS RNK

Health tips: పీసీఓఎస్‌ సమస్యకు ఇలా చెక్‌ పెట్టొచ్చు.. కానీ ఇవి అస్సలు..!

PCOS problem

PCOS problem

పీసీఓఎస్‌ (Policytic ovariun syndrome) అంటే హార్మొనల్‌ సమస్య. ప్రత్యేకంగా టీనేజీ నుంచే ఈ సమస్యలు మొదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం.

పీసీఓఎస్‌ (Policytic ovariun syndrome) ముఖ్యంగా మూడు కారణాల వస్తుంది. అధిక ఒత్తిడి, స్ట్రెస్‌ వల్ల హార్మొనల్‌ ఇంబ్యాలన్స్‌ (Hormonal imbalance) అవుతుంది. రెండోది ఎక్స్‌ర్‌సైజ్‌.. ఈ బీజీ లైఫ్‌లో చాలా మందికి ఎక్స్‌ర్‌సైజ్‌ చేసే అవకాశం లేకపోవచ్చు. ఇది కూడా పీసీఓఎస్‌కు దారితీస్తుంది. ఎక్సర్‌సైజ్‌ .లేకపోవడం వల్ల చైల్డ్‌హుడ్‌ ఒబేసిటీ కూడా వస్తుంది. మూడోది మారుతున్న ఆహారపు అలవాట్లు. ఫ్రూట్స్‌ ఎక్కువగా తీసుకోకపోవడం. ప్రాసెస్డ్‌ ఫుడ్‌ అంటే... పీజ్జా, బర్గర్‌ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం... ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ (antioxidants) తక్కువగా ఉంటాయి.

దీని వల్ల కూడా పీసీఓఎస్‌ వస్తుంది. వీటివల్ల శరీరంలో హార్మొనల్‌ ఇంబ్యాలన్స్‌ అవుతుంది. ఇలా జరిగినపుడు ప్రతి నెలా విడదలవ్వాల్సిన అండానికి ఆటంకంగా మారుతుంది. అది రిలీజ్‌ అవ్వదు. ఆ అండం లోపలే ఉండిపోయి అంటే అండాశయంలో లోపలే ఉండపోతుంది. దీంతో ఎగ్‌లోకి నీటి బుడగలు ఏర్పడతాయి. ఈ సమస్యతో ఇన్‌ఫెర్టిలిటీ (infertility) సమస్యకు దారితీస్తుంది. ఎప్పుడైతే సరైన ఎక్సర్‌సైజ్, ఆహారం తీసుకుంటే ఈ బుడగలు మాయమవుతాయి. బుడగలు లేకుంటేనే గర్భందాల్చడానికి ఆస్కారం ఉంటుంది.

అదేవిధంగా ఎక్కువ బరువు పెరిగి ఒక ఏడాదిలో 8–10 కిలోల బరువు పెరుగుతారు. ఇది కూడా చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల డయాబెటీస్‌ వస్తుంది. ఎవరికైతే పీసీఎస్‌ సమస్య ఉందో.. వారికి ఫ్యూచర్‌లో డయాబెటీస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాట్‌ ఎక్కువగా శరీరంలో ఉండటం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ కూడా ఫామ్‌ అవుతుంది. దీనివల్ల హార్ట్‌ అటాక్స్‌ వస్తాయి.
ఫర్టిలిటీ డ్రగ్స్‌ ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ వ్యాధితో బాధపడే మహిళలు వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

వెయిట్‌ కంట్రోల్‌..
ఆరోగ్యకరమైన బరువు బ్యాలన్సింగ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. దీంతో పెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. గర్భదారణకు కావాల్సిన బీఎంఐ 18.5,24.9. ఒకవే మీకు బీఎంఐ ఎక్కువగా ఉంటే బిడ్డ పుట్టేలోపు దాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. బీఎంఐ 35 ఉన్నప్పుడు గర్భదాల్చితే అది చాలా ప్రమాదకరం అవుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటీస్, బ్లడ్‌ క్లాట్స్‌ వచ్చి అత్యవసరంగా సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది.

ఒత్తిడిని తగ్గించుకోవాలి...
గర్భదారణకు ప్రయత్నిస్తున్న మహిళల్లో ఒత్తిడి చాలా నెగెటివ్‌ ఎఫెక్ట్‌ పడుతుంది. మెడిటేషన్, మంచి పాటలు వినడం, యోగా, నడక అలవాటు చేసుకోవడం, ఎక్సర్‌సైజ్, పెట్స్‌తో ఆడుకోవడం వంటివి చేస్తే... స్ట్రెస్‌ నుంచి విముక్తి కలుగుతుంది.

సమతూల్య ఆహారం..
జంక్‌ ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. సమతూల్య ఆహారం (Balanced diet) అంటే ఐరన్, జింక్, ఎక్కువ ఫైబర్‌ ఉన్న పదార్థాలు, బ్రౌన్‌ రైస్, సీడ్స్, లో కార్బొహైడ్రేట్స్, డెయిరీ ఫుడ్, పండ్లు, కూరగాయలు, లెంటిల్స్, బీన్స్‌ వంటివి ముఖ్యంగా తీసుకోవాలి. చక్కెర పదారద్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. స్వీట్స్, కూకీస్, చల్టని పానియాలు, పేస్ట్రీ, బిస్కట్స్, కేక్స్‌కు దూరంగా ఉండాలి. అవకాడో, నట్స్, ఆయిలీ ఫిష్, సీడ్స్‌లను ఎక్కువగా తీసుకోవాలి.
Published by:Renuka Godugu
First published:

Tags: Infertility, Pregnancy, Weight gain

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు