Exams Tips: ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఇలా చేయండి..

పరీక్షల సమయం వచ్చేసింది. ఏడాదంతా ఎంత చదివామన్నది పరీక్షలే నిర్ధారిస్తాయి. కాబట్టి.. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి..

Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:43 PM IST
Exams Tips: ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 23, 2019, 6:43 PM IST
* చాలామంది పిల్లలు ఏడాదంతా ఆడుతూ పాడుతుంటారు. పరీక్షలు రాగానే కంగారు పడిపోతుంటారు. అలా కాకుండా.. నిదానంగా కూర్చుని ఇప్పటివరకూ ఏం చదివారో.. ఏం తెలుసుకున్నారో దాన్ని మళ్లీ ఓ సారి రివైండ్ చేయాలి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ చదవాలి. చదివినంత వరకే కాదు... అది మనం ఎంతవరకూ రాయగలం అనేది గుర్తుంచుకోవాలి.
*ఎగ్జామ్స్‌లో ముఖ్యంగా రాత బాగుండాలి. రాసేది ఏదైనా చక్కగా, గుండ్రంగా అక్షరాలు ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి.
* ఒత్తిడిగా ఫీల్ అవ్వొద్దు.. ఎంతవరకూ వచ్చో అది రాయాలి. రానివాటి గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయకూడదు.

* అయిపోయిన పరీక్షల గురించి అతిగా ఆలోచించకూడదు.. తర్వాత పరీక్షలేంటో ఎలా రాయాలో చూడాలి.
* హెవీగా తినకూడదు. సులభంగా అరిగేవి ఫైబర్ తీసుకోవాలి. అదే విధంగా.. నీటిని ఎక్కువగా తాగాలి. నిద్ర సరిగ్గా పోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
* ఈ సమయంలో తల్లదండ్రులూ పిల్లల్ని ప్రోత్సహించాలి. వారిని బాగా చదువుతున్నావని ప్రోత్సహించాలి. అంతేకానీ, పర్సెంటేజ్ రావాలి, ఫెయిల్ అవ్వొద్దు అంటూ భయపెట్టకూడదు.


* పరీక్షల సమయంలో పిల్లల్ని అసలు కంగారు పెట్టొద్దు.
* ఎప్పుడూ చదవడమే కాకుండా ప్రతి అరగంటకోసారి 5-10 నిమిషాల గ్యాప్ తీసుకుని ఇష్టమైన పనిచేయాలి.
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...