How to ride bike safely in rainy season : వర్షాకాలం(Monsoon) వచ్చేసింది. వానలు ఇప్పుడే దంచికొడుతున్నాయి. అయితే వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలపై(Two Wheeler) ప్రయాణించేవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి.మన ప్రభుత్వాలు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వర్షాకాలం వచ్చిందంటే చాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దారా గుంతలు కనిపించని నగరం ఉండదు. చాలా నగరాల్లో రోడ్లన్నీ గుంతలమయమే. మన తెలుగురాష్ట్రాల్లోని చాలా నగరాల్లో కూడా ఇదే పరిస్థితి. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాల కారణంగా చాలా నగరాల్లో రోడ్లు(Roads) గుంతలమయంగా కనిపించడమే కాకుండా ట్రాఫిక్ జామ్‌లు కూడా సర్వసాధారణంగా మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) పెరుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్కూటీ(Scooty), బైక్(Bike) వంటి ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వర్షంలో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టైర్ల చెకింగ్
వర్షంలో బైక్ లేదా స్కూటీ తోలే ముందు టైర్లను చెక్ చేయడం మర్చిపోవద్దు. మీ టైర్ గ్రిప్ అరిగిపోయినట్లయితే మీ వాహనం సులభంగా రోడ్డుపై జారిపోతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా టైర్ మార్చండి. అంతేకాకుండా టైర్‌లోని గాలిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.
నెమ్మదిగా
వాస్తవానికి మీరు గొప్ప డ్రైవర్ కావచ్చు. అయితే వర్షాకాలంలో బైక్ లేదా స్కూటీని నెమ్మదిగా నడపడం మంచిది. దీనితో మీ నియంత్రణ వాహనంపై ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో, మీరు వెంటనే బ్రేకులు వేయడం ద్వారా వాహనాన్ని ఆపవచ్చు. అదే సమయంలో వేగంగా వాహనం నడుపుతున్నప్పుడు సడన్ బ్రేక్ పడడంతో స్కిడ్ అయి పడిపోయే అవకాశం ఉంది.
Skin Care Tips For Men : మెరిసిపోయే చర్మం కోసం..వర్షాకాలంలో పురుషులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
దూరం
వర్షంలో మీ ముందు, వెనుక, పక్కన కదులుతున్న వాహనాల నుండి ఎల్లప్పుడూ దూరం ఉంచడానికి ప్రయత్నించండి. అదే సమయంలలో ఓవర్‌లోడ్ వాహనాలకు తగినంత దూరంగా ఉండటం మర్చిపోవద్దు. అలాగే హెడ్‌లైట్‌ని ఆన్‌లో ఉంచండి. దీని వల్ల వర్షంలో మీకు ఇబ్బంది ఉండదు మరియు మీ చుట్టూ తిరిగే వాహనాలు కూడా మిమ్మల్ని సులభంగా చూడగలుగుతాయి.
బ్రేక్‌లను సరిగ్గా ఉపయోగించండి
వర్షం సమయంలో వెనుక బ్రేక్ వేయడం ఎల్లప్పుడూ మంచిది. దీని కారణంగా మీ బండి నెమ్మదిగా ఆగిపోతుంది. అదే సమయంలో ముందు బ్రేక్ వేయడంతో క బండి కస్మాత్తుగా నిలిచిపోతుంది. దీని వల్ల మీ వాహనం జారిపోవడమే కాకుండా మీ వెనుక ఉన్న వాహనం మీ వాహనాన్ని ఢీకొనవచ్చు. అందువల్ల, అత్యవసర పరిస్థితుల్లో కూడా వాహనాన్ని వెంటనే ఆపడానికి ముందు మరియు వెనుక బ్రేక్‌లను కలిపి వేసి ముందు బ్రేక్‌ను మాత్రమే వేయకుండా ఉండండి.
నిండిన నీటి నుండి దూరం
వర్షాల సమయంలో నీరు నిలిచిన రోడ్లపైకి వెళ్లవద్దు. ఇలా చేయడం వల్ల రోడ్డు గుంతల్లో పడడమే కాదు. బైక్ లేదా స్కూటీ ఎగ్జాస్ట్‌లోకి కూడా నీరు వెళ్లవచ్చు. దీని కారణంగా మీ బండి ఆగిపోవచ్చు. అందువల్ల, వర్షంలో పొడి రోడ్లపై మాత్రమే ప్రయాణించండి. నీటిలో మునిగి ఉన్న రోడ్లపైకి వెళ్లవద్దు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike accident, Bike rides, Monsoon rains