HOME »NEWS »LIFESTYLE »thyroid a small gland which creates more trouble if not treated in time ba

Thyroid: థైరాయిడ్ - అత్యంత ప్రభావం చూపే అతి చిన్న గ్రంథి

Thyroid: థైరాయిడ్ - అత్యంత ప్రభావం చూపే అతి చిన్న గ్రంథి
ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో తరచుగా కొన్ని కొన్ని విషయాలలో మార్పులు జరగడం మామూలు విషయమే. దీనికి మంచి ఉదాహరణ మన థైరాయిడ్ గ్రంథి. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ అవయవం మన శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈ హార్మోన్ మన శరీరంలోని అనేక అవయవాలు తమ విధులను సక్రమమంగా నిర్వహించేలా చేస్తుంది.

  • Share this:
    జీవితంలో తరచుగా కొన్ని కొన్ని విషయాలలో మార్పులు జరగడం మామూలు విషయమే. దీనికి మంచి ఉదాహరణ మన థైరాయిడ్ గ్రంథి. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ అవయవం మన శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఈ హార్మోన్ మన శరీరంలోని అనేక అవయవాలు తమ విధులను సక్రమమంగా నిర్వహించేలా చేస్తుంది. హార్మోన్ అసమానత మన శరీరంలో ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది.1 ఈ హార్మోన్ల ఉత్పత్తి అధిక మొత్తంలో ఉన్నవారిలో హైపర్ థైరాయిడిజం, అలాగే హార్మోన్ల ఉత్పత్తి తక్కువగా ఉండే వారిలో హైపోథైరాయిడిజానికి దారితీస్తుంది.

    భారతదేశంలో హైపోథైరాయిడిజం సమస్య చాలా సాధారణం. వాస్తవానికి, 11% మంది పెద్దలు హైపోథైరాయిడిజంతో, మరియు 8% మందిలో సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం4 తో బాధపడుతున్నారు.



    హైపోథైరాయిడిజం గురించి మరింత లోతుగా అర్థం చేసుకొని వివరంగా తెలుసుకుందాం:

    హైపోథైరాయిడిజం

    ముందుగా చెప్పినట్లుగా, థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను విడుదలచేయనప్పుడు హైపోథైరాయిడిజం సంభవిస్తుంది. ఇది మన జీవక్రియతో సహా అనేక శారీరక విధులను మందగించడానికి దారితీస్తుంది.2

    సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజంలో, రక్తంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు సాధారణంగా అవసరమైన మొతాదు కంటే కొంచెం తక్కువగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజం వలె కాకుండా ఇందులో లక్షణాలు కనిపించకపోవడంతో ఆ వ్యక్తికి తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా తెలియదు.3

    హైపోథైరాయిడిజం యొక్క టెల్-టేల్ సంకేతాలు

    ప్రజలు సాధారణంగా హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలను గుర్తించడానికి పొరపాటు చేసి, ఇతర లక్షణాలుగా నిర్ణయిస్తారు. ఏదేమైనా, ఈ లక్షణాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి, కొన్నిసార్లు వీటిని గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చని మనం తెలుసుకోవాలి. హైపోథైరాయిడిజం యొక్క కొన్ని సాధారణ లక్షణాలు అలసట, బరువు పెరగడం, విచారంగా లేదా నిరాశకు గురికావడం, తరచుగా పీరియడ్స్ రావడం, శరీరం మందగించడం, వంధ్యత్వం, లైంగికంగా ఆసక్తి లేకపోవడం, తరచుగా జుట్టు రాలడం, నిద్రలేమి మొదలైనవి. 2,5

    సాదారణంగా మహిళలలు ఎక్కువగా హైపోథైరాయిడిజానికి గురవుతారు

    నిజమే, పురుషులతో పోల్చితే సాధరణంగా మహిళలలో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెపుతున్నాయి, పురుషులతో పోల్చితే మహిళలలో 5 నుండి 10 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. వాస్తవానికి, ఇది మహిళల పునరుత్పత్తి వ్యవస్థపై ప్రభావితం చేసే ఎండోక్రైన్ డిజార్డర్ (గ్రంధులకు సంబంధించిన రుగ్మత)లలో ఇది రెండవ అత్యంత సాధారణ రకం. అంతే కాదు. ఇది అన్ని వయసుల ఆడవారిపై ప్రభావితం చేస్తుంది! వయస్సు పెరిగేకొద్ది కానీ, గర్భంలో, ప్రసవానంతరం,మోనోపాస్ లో కూడా మహిళల్లో హైపోథైరాయిడిజం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

    అన్ని వయసుల మహిళలు ప్రమాదం లో ఉన్నారు

    హైపోథైరాయిడిజం / సబ్‌క్లినికల్ హైపోథైరాయిడిజం మహిళల్లో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు, వారి పునరుత్పత్తి వ్యవస్థపై కూడా ప్రభావితం చేస్తుంది. కానీ సమస్య యొక్క తీవ్రత వారి వారి వయస్సులపై ఆధారపడి ఉంటుంది. 3,5,6a,7,8,9,10

    కొన్ని సంస్థలు నిర్వహించిన అనేక అధ్యయనాలలో వెలువడిన ఫలితాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

    -యుక్తవయస్సు అమ్మాయిలలో ఈ సమస్య కారణంగా రొమ్ములు, జననేంద్రియాల అభివృద్ధి అసంపూర్ణంగా ఉంటుంది.

    - ఈ సమస్య ఉన్న యువతులలో 72.5% పైగా దీర్ఘకాలిక రక్తస్రావంకు దారితీస్తుంది,మరియు మొటిమలు, ముఖముపై జుట్టు, సక్రమంగా రాని పీరియడ్స్ వంటి సమస్యలే కాకుండా, వీరిలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

    - ప్రతి 10మంది మహిళలలో 3 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒకవేళ మీరు గర్భవతిగా ఉంటే ఈ సమస్య గర్భస్రావానికి కూడా దారితీస్తుంది, నెలలు నిండకుండానే పుట్టిన శిశువులలో కొంతమంది అకాలంగా మరణిస్తారు, 13% పైగా గర్భిణీ స్త్రీలు హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారు.

    -86% వృద్ధ మహిళలలో దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది, 60% మహిళలలో రక్తపోటు,మరియు 33% మంది రోగులు రక్తంలో లిపిడ్ల పెరుగుదలను ఎదుర్కొంటారు.

    -అంతేకాకుండా 60% పైగా హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నట్లు, వీరిలో డిప్రెషన్ లక్షణాలను ఉన్నట్లు పరిశోదనలో వెలువడ్డాయి.

    హైపోథైరాయిడిజమ్‌ను త్వరగా గుర్తించి మరియు తగిన థైరాయిడ్ ఫంక్షన్ల (థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు) సమయానుసారంగా పరీక్షించడం,చికిత్స అందించడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య సంఘాలు మార్గదర్శకాలను సిఫార్సు చేసారు. 5,6,18,19,20,21,22

    ఎవరికి పరీక్షలు చేయాలి

    • 35 సంవత్సరాల వయస్సు గల మహిళలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు జరిపించుకోవాలి.

    • వంధ్యత్వానికి చికిత్స తీసుకునే మహిళలను అందరిని పరిగణనలోకి తీసుకోవాలి.

    • గర్భిణీ స్త్రీలందరు.

    • రుతుక్రమం ఆగిన మహిళలలను, అలాంటి లక్షణాలు ఉన్నవారు.

    • మధుమేహం & అధిక రక్తపోటు రోగులు.

    • చికిత్స ప్రారంభించే ముందు లిపిడ్ డిజార్డర్స్ (రక్తంలో కొవ్వు) ఉన్న రోగులు.


    హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు స్థిరంగా లేదా నిర్దిష్టంగా ఉండవు. కానీ సమయానికి చికిత్స చేయకపోతే, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి, అంతేకాక మరిన్ని సమస్యలకు దారితీస్తాయి.25 అందువల్ల ప్రతి స్త్రీ ఒక సాధారణ రక్త పరీక్ష సహాయంతో తనను తాను పరీక్షించుకొని, తన సందేహాలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. 7 - డాక్టర్ .

    శుభవార్త ఏమిటంటే ఈ సమస్యని చికిత్స సహాయంతో తగ్గించవచ్చు. మీకు థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానించినట్లయితే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

    ఇది భాగస్వామ్య పోస్ట్.

    Disclaimer:

    ** This is in partnership with Abbott India, written by Dr P. Sreedevi, MD DNB (Gen Med), DM (Endocrinology). 

    Dr P. Sreedevi


    Information appearing in this material is for general awareness only and does not constitute any medical advice. Please consult your doctor for any questions or concerns you may have regarding your condition.

     References:

    1. org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. How does the thyroid gland work? 2010 Nov 17 [Updated 2018 Apr 19].Available from: https://www.ncbi.nlm.nih.gov/books/NBK279388/.

    2. Thyroid disease[Internet]. Available at: https://www.womenshealth.gov/a-z-topics/thyroid-disease. Accessed on Aug 15, 2020.

    3. Livingston EH. Subclinical Hypothyroidism. 2019;322(2):180.

    4. Indian Journal of Endocrinology & Metabolism / Jul – Aug 2013 / Vol -17 / Issue 4

    5. Dunn D, Turner C. Hypothyroidism in Women. Nurs Womens Health. 2016;20(1):93-98.

    6. Sanyal D, Raychaudhuri M. Hypothyroidism and obesity: an intriguing link. Indian J Endocrinol Metab. (2016) 20:554–7.

    7. Weber G, Vigone MC, Stroppa L, Chiumello G. Thyroid function and puberty. J Pediatr Endocrinol Metab. 2003;16 Suppl 2:253-257.

    8. Fatima M, Amjad S, Sharaf Ali H Sr, et al. Correlation of Subclinical Hypothyroidism With Polycystic Ovary Syndrome (PCOS). Cureus. 2020;12(5):e8142.

    9. Polycystic ovarian syndrome[Internet]. Available at: https://www.womenshealth.gov/a-z-topics/polycystic-ovary-syndrome. Accessed on Aug 15, 2020.

    10. Karaca N, Akpak YK. Thyroid disorders and fertility. Int J Res Med Sci. 2015;3: 1299-304.

    11. Ramya MR, Parvathavarthini, Savery D, et al. Menstrual disorders associated with thyroid dysfunction. Int J Reprod Contracept Obstet Gynecol. 2017 Nov;6(11):5113-5117.

    12. Shanmugham D, Natarajan S, Karthik A. Prevalence of thyroid dysfunction in patients with polycystic ovarian syndrome: A cross sectional study. Int J Reprod Contracept Obstet Gynecol. 2018;7:3055-9.

    13. Pushpagiri N, Gracelyn LJ, Nagalingam S. Prevalence of subclinical and overt hypothyroidism in infertile women. Int J Reprod Contracept Obstet Gynecol. 2015;4(6):1733-8.

    14. Dhanwal DK, Bajaj S, Rajput R, et al. Prevalence of hypothyroidism in pregnancy: An epidemiological study from 11 cities in 9 states of India. Indian J Endocrinol Metab. 2016;20(3):387-390.

    15. Deshmukh V, Farishta F, Bhole M. Thyroid dysfunction in patients with metabolic syndrome: a cross-sectional, epidemiological, Pan-India study. International journal of endocrinology. 2018;2018.

    16. A Study of Cardiovascular Changes in Newly Detected Hypothyroid Patients. MVP Journal of Medical Sciences. July-December 2017;4(2): 102–106.

    17. Hypothyroidism: a booklet for patients and their families[Internet]. Available at: https://www.thyroid.org/wp-content/uploads/patients/brochures/Hypothyroidism_web_booklet.pdf. Accessed on Aug 15, 2020.

    18. Alexander EK, Pearce EN, Brent GA, et al. 2017 Guidelines of the American Thyroid Association for the Diagnosis and Management of Thyroid Disease During Pregnancy and the Postpartum. Thyroid. 2017;27(3):315-89.

    19. Talwalkar P, Deshmukh V, Bhole M. Prevalence of hypothyroidism in patients with type 2 diabetes mellitus and hypertension in India: a cross-sectional observational study. Diabetes Metab Syndr Obes. 2019;12:369-376.

    20. FOGSI: Good Clinical Practice Recommendations on preconception care[Internet]. Available at: https://www.fogsi.org/wp-content/uploads/2016/09/FOGSI-PCCR-Guideline-Booklet-Orange.pdf. Accessed on Aug 17, 2020.

    21. Willard DL, Leung AM, Pearce EN. Thyroid function testing in patients with newly diagnosed hyperlipidemia. JAMA Intern Med. 2014;174(2):287-289.

    22. Slopien R, Owecki M, Slopien A, et al. Climacteric symptoms are related to thyroid status in euthyroid menopausal women. J Endocrinol Invest. 2020; 43(1):75–80.

    23. Hypothyroidism[Internet]. Available at: http://www.thyroid.org/wp-content/uploads/patients/brochures/ata-hypothyroidism-brochure.pdf. Accessed on Aug 15, 2020.

    24. Kumar P, Khandelwal D, Mittal S, et al. Knowledge, Awareness, Practices and Adherence to Treatment of Patients with Primary Hypothyroidism in Delhi. Indian J Endocrinol Metab. 2017;21(3):429-433.

    25. Hypothyroidism[Internet]. Available at: https://www.niddk.nih.gov/health-information/endocrinediseases/hypothyroidism#:~:text=Hypothyroidism%2C%20also%20called%20underactive%20thyroid,the%20front%20of%20your%20neck. Accessed on Aug 15, 2020.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 27, 2021, 20:53 IST