Raw Meat Diet: మూడేళ్లుగా పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఆరోగ్యం గురించి అతడు ఏం చెప్పాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన వెస్టన్ రోవ్ అనే వ్యక్తి గత మూడు ఏళ్లుగా కోడి మాంసం, గుడ్లు, ఇంకా తదితర మాంసాహార పదార్థాలను పచ్చిగానే తింటున్నాడట. అంతేకాదు వెస్టన్ రోవ్ తన గురించి ఒక డాక్యుమెంట్ కూడా రూపొందించాడు. పచ్చి మాంసం హెల్దీ లైఫ్‌కి తారకమంత్రం అని తన డాక్యుమెంట్‌లో వివరించాడు.

  • Share this:
ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ వివిధ రకాల డైట్స్ మన జీవితాల్లోకి అడుగు పెడుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రజలు తమదైన శైలిలో ప్రత్యేకమైన డైట్స్ తయారు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. వారు తయారు చేసే ప్రతి డైట్‌కి ప్రత్యేక లక్షణాలు, ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం ఆ కోవకే చెందిన ఓ డైట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే పచ్చి మాంసం డైట్ (raw meat diet). అమెరికాలోని నెబ్రాస్కాకు (Nebraska) చెందిన వెస్టన్ రోవ్ అనే వ్యక్తి గత మూడు ఏళ్లుగా కోడి మాంసం, గుడ్లు, ఇంకా తదితర మాంసాహార పదార్థాలను పచ్చిగానే తింటున్నాడట. అంతేకాదు వెస్టన్ రోవ్ (Weston Rowe) తన గురించి ఒక డాక్యుమెంట్ కూడా రూపొందించాడు. పచ్చి మాంసం హెల్దీ లైఫ్‌కి తారకమంత్రం అని తన డాక్యుమెంట్‌లో వివరించాడు.

వెస్టన్ రోవ్ తన డాక్యుమెంట్‌ను 'ది నేచురల్ హ్యూమన్ డైట్' (The Natural Human Diet) అనే యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశాడు. ఈ యూట్యూబ్ ఛానల్‌లో వెస్టన్ సాల్మన్, టర్కీ, చికెన్ మాంసం, పచ్చి మాంసం తినడం చూడొచ్చు. ఈ ఆహారపు అలవాట్లు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. కానీ రోవ్ మాత్రం పచ్చి మాంసం తినడం వల్ల రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా (energetic throughout the day) అనిపిస్తుందని చెబుతున్నాడు.

Sad: ఇలాంటి దుస్థితి ఎవరికి రాకూడదు.. కలిసి ఉంటూనే మనసులో ఎంత పగ.. ఇంటర్నెట్‌లో వెతికి మరి..

ఇటీవల మీడియాతో మాట్లాడిన వెస్టన్.. పచ్చి ఆహారం తన ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిందని వివరించాడు. శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పాడు. తన జీవితంలో ఎన్నడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నానని అన్నాడు. ఈ పచ్చి మాంసం డైట్ ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యంతో బాధపడలేదంటున్నాడు. జలుబు, జ్వరం లాంటి జబ్బులు తన దరిచేరలేదని వెస్టన్ తెలిపాడు.

Diwali 2021 Car Offers: దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ మోడళ్లపై బెస్ట్ ఆఫర్లను పరిశీలించండి..

వెస్టన్ పందులు, ఆవులు వంటి జంతువుల తాజా మాంసం, చికెన్, గుడ్లు కూడా క్రమం తప్పకుండా తింటున్నాడు. సాధారణ ఆహారంతో పోలిస్తే ఈ ప్రత్యేకమైన ఆహారం అతనిలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచేస్తుందట. అయితే పచ్చి చికెన్ మాంసం తరచుగా తింటే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్‌ (salmonella infection) వచ్చే ప్రమాదం ఉంది. ఈ సాల్మొనెల్లా ఆహారం లేదా నీరు కలుషితం కావడం వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్నారా? అని వెస్టన్ ని ప్రశ్నించినప్పుడు.. "ఇది చాలా వివాదాస్పదమైనది. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా సహజ సమతుల్యత కలిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది మన శరీరాలతో సహజీవనం చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది." అని వెస్టన్ రోవ్ చెప్పుకొచ్చాడు.
Published by:Sumanth Kanukula
First published: