హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Healthy Food : పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం

Healthy Food : పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం

పాలకూర దోఖ్లా (Image: Twitter - Monika)

పాలకూర దోఖ్లా (Image: Twitter - Monika)

Spinach (Palak) Dhokla : మీరు తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండాలని అనుకుంటే... ఈ పాలకూర దోఖ్లాను మీ డైట్‌లో చేర్చుకోండి. ఇది సూపర్‌ఫుడ్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎంతో రుచిగా, తింటే తేలిగ్గా ఉంటుంది. స్నాక్స్‌లా తినేందుకు ఇది బాగా సెట్ అవుతుంది.

ఇంకా చదవండి ...

Healthy Food Spinach Dhokla : స్నాక్స్ అనగానే మనకు ఎక్కువగా కనిపిస్తున్నవి ఫ్రైలు, చిప్స్ వంటివే. అవి ఎంత తింటే అంత మనకే ప్రమాదం. మన ఆహారంలో ఫ్రైలు ఎక్కువవుతుంటే... కాన్సర్ లాంటి రోగాలకు మనం దగ్గర అవుతున్నట్లే. అందువల్ల స్నాక్స్ తినాలిగానీ... ఫ్రైలు మాత్రమే తినకూడదు. సాయంత్రం వేళ టీతో కలిపి తీసుకునేందుకు సరైన ఆహారంగా పాలకూర దోఖ్లాను చెప్పుకోవచ్చు. మెత్తగా, స్పాంజిలా ఉండే దోఖ్లా... గుజరాత్‌కి చెందిన మంచి వంటకం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నచ్చిన స్నాక్ ఇది. ఇందులో మెత్తదనం, తక్కువ కేలరీల వంటి లక్షణాలు... బరువు తగ్గాలనుకునేవారికి సరైన ఫుడ్‌గా మార్చేశాయి. మీరు తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండాలని అనుకుంటే... ఈ పాలకూర దోఖ్లాను మీ డైట్‌లో చేర్చుకోండి.

సాదాసీదా దోఖ్లాను... శనగపిండితో తయారుచేసుకోవచ్చు. దీనికి సూపర్‌ఫుడ్‌గా చెప్పుకునే పాలకూరను కలపాలి. ఐతే... పాలకూరనే ఎందుకు కలపాలన్న డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే పాలకూరలో ఎక్కువ పోషకాలుంటాయి. అవి మనకు కావాల్సిన పోషకాల్ని అందిస్తాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ బాగా ఉంటుంది. అది మనకు శక్తిని ఇస్తుంది. పాలకూరలో విటమిన్ A, C, K ఉంటాయి. మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి.

పాలకూర దోఖ్లాకు కావాల్సినవి :

- పాలకూర 2 కట్టలు

- శనగపిండి (200 గ్రాములు)

- 2 టేబుల్ స్పూన్ల ఆవాలు.

- ఒక అంగుళం అల్లం.

- ఒక కొత్తిమీర కట్ట, పచ్చిమిర్చి

పాలకూర దోఖ్లా తయారీ విధానం :

Step 1- పాలకూర ఆకులు, అల్లం, పచ్చిమిర్చి మిశ్రమంలో కొద్దిగా నీరు, ఉప్పు వేసి... మిక్సీలో బ్లెండ్ చెయ్యాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో శనగపిండి వేసి... కొద్దిగా నీరు పొయ్యాలి. మరీ పలుచగా కాకుండా స్మూత్‌గా ఉండేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ గంటపాటూ పక్కన పెట్టాలి.

Step 2 - ఈ మిశ్రమంపై కొద్దిగా ఫ్రూట్ సాల్ట్ వెయ్యాలి. బాగా కలపాలి. దాన్ని స్టీమర్‌లో లేదా దోఖ్లా మేకర్‌లో ఉంచాలి.

Step 3 - దోఖ్లా తయారవ్వగానే దాన్ని బయటకు తీసి... ముక్కలుగా కట్ చెయ్యాలి. అన్ని ముక్కలపైనా షుగర్ సిరప్ వెయ్యాలి.

Step 4 - కొంచెం నూనెలో ఆవాలు వేయించాలి. వాటిని నూనెతో సహా... అన్ని దోఖ్లా ముక్కలపైనా పొయ్యాలి.

Step 5 - కొబ్బరి తురుము, కొత్తిమీర ఆకులు వేసి... పుదీనా చట్నీతో సెర్వ్ చేసుకోవచ్చు.

రెగ్యులర్ దోఖ్లా లాగానే... పాలకూర దోఖ్లా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. దీన్లోని పోషకాలు మీకు ఎంతో మేలు చేస్తాయి.


ఇవి కూడా చదవండి :


Health : పొడవైన జుట్టు సీక్రెట్ తెలిసిపోయింది... మీరూ పాటించండి


Aloe Vera : ప్రకృతి నుంచీ లభించే అద్భుతం... అలోవెరాతో ఆరోగ్య ప్రయోజనాలు


#HealthTips: పల్లీలు తింటే హార్ట్ ఎటాక్ రాదట..

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే హిమాలయన్ వయాగ్రా...‘యర్సాగుంబా’ పడక సుఖానికి ప్రకృతి వైద్యం...

#HealthTips: బ్లడ్ క్యాన్సర్‌ని తగ్గించే విటమిన్ సి ఇంజెక్షన్

Published by:Krishna Kumar N
First published:

Tags: Food, Health, Health benifits, Tips For Women, Women health

ఉత్తమ కథలు