Home /News /life-style /

THIS SEEMINGLY HEALTHY FOOD CAN LEAD TO HYPERTENSION UMG GH

High Blood Pressure: హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారా..? వీటిని ఆహారంగా తీసుకుంటున్నారేమో చెక్ చేసుకోండి..!

బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారేమో చూడండి.

బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నారేమో చూడండి.

జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్స్‌, ప్యాక్ చేసిన తృణ ధాన్యాలను బ్రేక్‌పాస్ట్ (BreakFast) సమయంలో ఎక్కువగా తీసుకుంటారు. వీటి వల్ల బీపీ (BP) పెరిగే అవకాశం ఉంది. గుండెలోని ధమని గోడలపై రక్తం ఫోర్స్ ఎక్కువగా ఉండే స్థితిని హై‌బీపీ(అధిక రక్తపోటు) (High BP) అంటారు. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ (Heart Attack) వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు.

ఇంకా చదవండి ...
ఇటీవల కాలంలో హైబీపీ సమస్య చాలా మందిలో సర్వసాధారణమైంది. జీవన శైలిలో మార్పులు, జంక్ ఫుడ్‌కు అలవాటుపడడం, వ్యాయామం చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణం. గుండెలోని ధమని గోడలపై రక్తం ఫోర్స్ ఎక్కువగా ఉండే స్థితిని హై‌బీపీ(అధిక రక్తపోటు) అంటారు. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. హైబీపీ లెవల్స్ మేనేజ్‌మెంట్‌లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే వ్యాధులు మరింత తీవ్రం కావచ్చు. సాధారణంగా జంక్ ఫుడ్, షుగర్ ఫుడ్స్‌, ప్యాక్ చేసిన తృణ ధాన్యాలను బ్రేక్‌పాస్ట్ సమయంలో ఎక్కువగా తీసుకుంటారు. వీటి వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది.

బ్రేక్‌పాస్ట్‌గా తృణధాన్యాలు
ప్యాక్ చేసిన తృణధాన్యాల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయం బ్రేక్‌పాస్ట్‌గా ఎంపిక చేసుకోవడం శరీర ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు ఇష్టమైన అల్పాహారం ఎంపికలో ఈ జోడించిన చక్కెరలు హైబీపీకి దారితీయవచ్చు. వాటిలో కేలరీలు కూడా ఎక్కువగా, పోషక విలువలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మధుమేహానికి కూడా దారి తీస్తుంది. కాబట్టి మీరు అధిక చక్కెర లెవల్స్ ఉన్న ధాన్యాలను అల్పాహారంగా తీసుకోకపోవడమే ఉత్తమం.

ఇదీ చదవండి: యోగాతో మ్యాథ్స్‌కు సంబంధం.. ఆసనాల వెనుక ఉండే మ్యాథమెటిక్స్‌ను పిల్లలకు ఇలా నేర్పించండి


షుగర్ పెరగడం డేంజర్
హైబీపీకి షుగర్ కూడా ముఖ్యకారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. తక్కువ షుగర్ లెవల్స్ ఉన్న తృణ ధాన్యాలు రక్తంలో చక్కెరను పెంచుతాయి. ఎందుకంటే వాటిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మరోపక్క చాలా మంది సిఫార్సు చేసిన పరిమాణం కంటే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా తింటుంటారు. ఇది కూడా షుగర్ లెవల్స్ పెరగటానికి కారణం కావచ్చు.

ఇదీ చదవండి: హెయిర్ ఫాల్ సమస్య వేధిస్తుందా..? సమస్యకు చెక్ పెట్టే ఆయిల్స్ ఇవే..


మరి ఏం తినాలి..?
ఆకుకూరలు, బీన్స్, కాయధాన్యాలు, విత్తనాలు, చేపలు, సిట్రస్ పండ్లు, క్యారెట్లు వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. దీంతో బీపీ లెవల్స్ నార్మల్‌గా ఉంటాయి. కాబట్టి, ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం, మీరు తృణధాన్యాలకు బదులుగా తాజా సీజనల్ పండ్లను ఎంచుకోవచ్చు. పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్స్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ అల్పాహారానికి సహజమైన తీపి రుచిని కూడా జోడిస్తాయి. గుడ్డు కూడా సాధారణ పోషక విలువల అల్పాహార ఎంపికలో ఒకటి. వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అల్పాహారంగా మరొక బెస్ట్ ఆప్షన్ ఓట్ మీల్. ఓట్స్‌లో ఐరన్, బి విటమిన్స్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేసే పోషకాలు.



వీటికి దూరంగా ఉండండి..
టేబుల్ షుగర్, జామ్, ప్రిజర్వ్స్, స్వీట్స్ అండ్ చాక్లెట్స్, పండ్ల రసాలు, శీతల పానీయాలు, బిస్కెట్‌లు, బన్స్, కేక్స్ వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. అలాగే ప్రాసెస్, శుద్ధి చేసి ప్యాక్ చేసిన ఆహారాలకు బదులుగా సహజ తీపి పదార్థాలను ఆహారంగా ఎంపిక చేసుకోండి.
Published by:Mahesh
First published:

Tags: Blood pressure, Breakfast, Health benefits, Health care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు