‘గోతులో చికెన్’ఎప్పుడైనా టేస్ట్ చేశారా ... సంక్రాంతికి కొత్త టేస్ట్

అందులో ఆరు వెదురు బొంగులు దూరందూరంగా అమర్చాలి. కింద మన్ను అంటకుండా అరిటాకులు ఏర్పాటు చేయాలి.

news18-telugu
Updated: October 20, 2019, 3:17 PM IST
‘గోతులో చికెన్’ఎప్పుడైనా టేస్ట్ చేశారా ... సంక్రాంతికి కొత్త టేస్ట్
‘గోతులో చికెన్’ఎప్పుడైనా టేస్ట్ చేశారా ... సంక్రాంతికి కొత్త టేస్ట్
  • Share this:
చికెన్ అంటే చాలు చాలామంది నాన్ వెజ్ ప్రియులకు నోరూరుతుంది. చికెన్‌లో ఉన్న అన్నిరకాల వెరైటీలను అస్వాదిస్తుంటారు. చికెన్ మంచూరియా, చికెన్ పకోడి, చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్స్, తందూరి చికెన్ ఇలా చెప్పలేనన్ని రకారకాల వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. ఇక వీటితో పాటు... కొన్ని ప్రాంతాల్లో బొంగులో చికెన్, కుండలో చికెన్ లాంటి వెరైటీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు వీటికి ‘గోతులో చికెన్’ కొత్త టేస్ట్ అందించే ఫుడ్ నాన్ వెజ్ ప్రియులకు అందుబాటులో వచ్చింది. అయితే దీని తయారీ కొంచెం ప్రాసెస్‌తో కూడుకున్నది. గోతులో చికెన్ టేస్ట్ చేయాలంటే... చాలా కష్టపడాల్సి వస్తుంది.

ముందుగా ఓ రెండుఅడుగుల ఖాళీ స్థలంలో గోతిని తవ్వాలి. అందులో ఆరు వెదురు బొంగులు దూరందూరంగా అమర్చాలి. కింద మన్ను అంటకుండా అరిటాకులు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత కోడిని ముక్కలు చేయకుండా కోడికి కోడిని బాగా మసాలా దట్టించి గోతిలో ఏర్పాటు చేసిన వెదురు కర్రలకు తగిలించాలి. ఆ తర్వాత వాటిపై ఇనుప డబ్బాలు మూతగా పెట్టాలి. ఇలా ఒకేసారి గోతిలో ఆరుకోళ్లను పెట్టవచ్చు. ఆతర్వాత గోతిలో చుట్టుపక్కల కట్టెపుల్లలు వేయాలి. నిండుగా కట్టెపుల్లలు కప్పి వాటికి మంట పెట్టాలి. బాగా మండిన తర్వాత... మంట చల్లారిన తర్వాత... గోతిలో ఏర్పాటు చేసిన కోళ్లను బయటకు తీయాలి. కాస్త శుభ్రం చేసి ముక్కలకు కోసి వడ్డించుకొని తినేయడమే. బొంగులో చికెన్ పాతది , ఇప్పుడు గోతులో చికెన్ కొత్తది , ఈ సంక్రాంతి కి కొత్తరకం రడీ అంటూ ఇప్పటికే ఈ ట్రెండింగ్ షురూ అయ్యింది.

First published: October 20, 2019, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading