కొత్త సంవత్సరం (new year) సరికొత్తగా సాగాలి, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు అయిపోవాలి. జీవితం కొత్తగా మొదలవ్వాలి, సన్నగ అవ్వాలి (weight reduction), పొదుపు ఎక్కువ చేయాలి, బట్టలు కొనరాదు, ఫిట్నెస్ ఫ్రీక్ కావాలి, బింజ్ వాచింగ్, బింజ్ ఈటింగ్ మానేయాలి.. ఇలా బోలెడన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ప్రతి ఏడాది తీసుకునేవే. ఇలాంటి న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అందరూ తీసుకుంటున్నారు. కానీ ఆచరణలో పెట్టి తామనుకున్నది సాధించేవారు మాత్రం అతికొద్ది మంది మాత్రమే. ముఖ్యంగా ఏడాదికి అయ్యే జిమ్ ఫీజు మొత్తం కట్టేసి ఆతరువాత జిమ్ ముఖం కూడా చూడని వారు మన సర్కిల్ లో చాలామందే ఉంటారు.
అలవాట్లు మారవా?
ఏదైనా మార్పు రావాలంటే పాత అలవాట్లకు గుడ్ బై కొట్టి కొత్త అలవాట్లను ఫాలో అయినప్పుడే. కానీ పాత అలవాట్లను మనలో ఎందరు మార్చుకోగలరు? ఓపన్-యాక్సెస్ జర్నల్ లో ఇలాంటి విషయాలపై బోలెడంత లోతైన సమాచారాన్ని పబ్లిష్ చేశారు. ఈ జర్నల్ చదివితే అసలు మనం ఎక్కడ, ఎందుకు విఫలమవుతున్నామో ఇట్టే అర్థమవుతుంది.
పాటిజివ్, కమిటింగ్ గా ఉండాలి
మనం ఓ నిర్ణయం తీసుకునేప్పుడే అది పాజిటివ్ (positive) గా ఉండేలా, కమిటింగ్ గా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి మన గోల్ (goal) ను సెట్ చేసుకోవటంలో ముందు ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకుంటూనే, ఇందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను ఫుల్ కమిట్ మెంట్ తో రూపొందించుకుని, పక్కగా అమలయ్యేలా చిత్తశుద్ధి చూపాలి. ఫలానా తిండి తినటం మానేయాలి, లేదా ఫలానా చెడ్డ అలవాటు మానేయాలంటే అది అంత ఈజీగా జరిగే పని కాదని మీకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే గతంలోనూ ప్రతీ న్యూ ఇయర్ కు మీరు ఇలాంటివే నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చు.
రీసెర్చ్ సాగిందిలా..
స్టాక్ హోం యూనివర్సిటీ, లింకపింగ్ యూనిర్సిటీ సంయుక్తంగా చేసిన ఈ పరిశోధనలో 1,066 మంది తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ను పరిశీలించారు. ఇందులో భాగంగా పార్టిసిపెంట్లను 3 గ్రూపులుగా విభజించారు. సపోర్ట్ తీసుకున్న వారు, లిమిటెడ్ సపోర్ట్ తీసుకున్న వారు, ఎక్స్ టెండెడ్ సపోర్ట్ తీసుకున్నవారుగా విభజించి, ఏడాది పొడవునా ప్రతి నెలా వీరు తమ నిర్ణయాన్ని ఎంత వరకు పాటిస్తున్నారో గమనించారు. అయితే ఇందులో అప్రోచ్ గోల్ పెట్టుకున్న వారు 59శాతం విజయవంతమయ్యారు.
ఉదాహరణకు మీరు స్వీట్లు తినటం మానేసి సన్నబడాలని న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకుంటే మాత్రం పెద్దగా అది వర్కవుట్ కాదు. కానీ స్వీట్లకు బదులు నేను పళ్లు తింటా అని అనుకుంటే మాత్రం ఇది చాలావరకు సాధ్యమవుతుందని పరిశోధనలో పాల్గొన్న స్టాక్ హోం యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ పర్ కార్ల్ బర్గ్ తేల్చారు. అందుకే మీరు సెట్ చేసుకునే గోల్స్, మీ మానసిక ప్రవర్తనపై మీకు సంపూర్ణ అవగాహన ఉండాల్సిందే.
అందరికీ చెప్పండి
పరిశోధకులు చెబుతున్న ట్రిక్ ఏంటంటే న్యూ ఇయర్ రిజల్యూషన్ పక్కాగా అమలు కావాలంటే మనకు సపోర్ట్ ఉండాలి. అందుకే మీరు తీసుకున్న నిర్ణయాన్ని నలుగురికి చెప్పండి. సోషల్ సపోర్ట్ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు ఆచరణలో సాధ్యమయ్యే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోవాలి. అసాధ్యాలు సాధ్యమని అతిగా విశ్వసించి, మోసపోకండి. అయినా ఇలా న్యూ ఇయర్ రిజల్యూషన్ (తీసుకోకపోతే మార్పు రాదా అనకండి. పరిశోధనలో ఈ విషయంపై ఆసక్తికరమైన పాయింట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.
మనకు అత్యంత ముఖ్యమైన దాన్నే గోల్ గా పెట్టుకుంటాం. ఇలా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ (resolutions)తీసుకున్న వారిలో నిజాయితీ ప్రదర్శించిన వారు 42శాతం తమ గమ్యాన్ని చేరుకున్నారు. కానీ ఎటువంటి రిజల్యూషన్ తీసుకోకుండా తమకు కావాల్సింది సాధించిన వారు కేవలం 4శాతం మందే ఉన్నారట. కాబట్టి రెజల్యూషన్స్ అవసరం, మీలో మీకు కావాల్సిన మార్పును తెచ్చుకోవాలంటే ఇది ఉత్తమ మార్గం అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
రివ్యూ చేసుకోండి
మీరే మీ పరిస్థితిని రివ్యూ చేసుకోండి. గతంలో మీరు తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పూర్తయ్యాయా? అవెందుకు పూర్తీ కాలేదు? మీరెక్కడ ఫెయిల్ అయ్యారు? కారణాలన్నీ మనస్ఫూర్తిగా అవగతం చేసుకుని, ఈ లోటుపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి. మీపై మీకే చిత్తశుద్ధి ఉండాలి. మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటూ పోతే రెజల్యూషన్స్ తీసుకోవటం వృథా కదా. అందుకే మీకు మీరే బెస్ట్ క్రిటిక్. అప్పుడే రెజల్యూషన్స్ వర్కవుట్ అవుతాయి.