1.విపరీతంగా బరువు పెరుగుతారు: ఫ్రెంచ్ ఫ్రైలలో పిండి పదార్థాలు ఎక్కువ. వీటిని ఆయిల్‌లో ప్రాసెస్ చేయడం వల్ల ఈ పిండి పదార్థాలు మన నోటికి బాగుంటాయి గానీ... శరీరానికి హాని చేస్తాయి. వీటిని మన బాడీ త్వరగా ఆరగించుకోలేదు. రోజూ తినడం వల్ల పిండిపదార్థాలు బాడీలో పేరుకుపోయి... బరువు పెరుగుతారు.
2. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం : ఫ్రెంచ్ ఫ్రైలను ఆరోగ్యానికి హాని చేసే ట్రాన్స్ ఫాట్స్‌లో ముంచి తీస్తారు. ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తారు. ఫలితంగా వాటిని తిన్నవారికి బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడీలో తయారై... క్రమంగా అంది గుండె జబ్బులు వచ్చేలా చేస్తుంది. ఎన్నో పరిశోధనల్లో ఇది రుజువైంది. తరచుగా ఫ్రై చేసిన ఆహారం తింటే... టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు తేల్చారు.
3. క్యాన్సర్ వచ్చే ప్రమాదం : ఫ్రెంచ్ ఫ్రైలను రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇది రుజువైంది. బంగాళాదుంపలను ఎక్కువ వేడిలో ఉడికిస్తే వాటిలో చక్కెర (పిండి పదార్థం)... అక్రిలామైడ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది గ్లిసిడమైడ్‌గా మారి... మన DNA నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చేందుకు కారణమవుతుంది.
4. కిడ్నీలు పాడవుతాయి, హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ : ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే మనకు బీపీ పెరుగుతుంది. రాన్రానూ అది హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది.
5. బ్రెయిన్ నరాలు దెబ్బతింటాయి : ఫ్రెంచ్ ఫ్రైలలో అక్రిలామైడ్ ఉంటుంది. అది మెదడులోని నరాలను దెబ్బతీస్తుంది. నరాల బలహీనత వచ్చేలా చేస్తుంది. క్రమంగా ఇది న్యూరోడీజనరేటివ్ (మెదడులో నరాలు దెబ్బతినుట) వ్యాధికి దారితీస్తుంది.
6. త్వరగా చనిపోయే ప్రమాదం : అధికబరువు, గుండె జబ్బులు, క్యాన్సర్, హార్ట్ ఎటాక్, టైప్ 2 డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, మెదడు సమస్యలు... అన్నీ కలిసి త్వరగా చనిపోయేలా చేస్తాయి. అంతెందుకు ఇలాంటి రకరకాల రోగాలతో రోజూ బతకడం కూడా నరకప్రాయమే.
ఈ అధ్యయనం వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పొందుపరిచారు. 45 నుంచీ 79 ఏళ్ల వయసున్న మొత్తం 4,400 మంది డేటా సేకరించిన పరిశోధకులు... 8 ఏళ్లపాటూ... వారిని పరిశీలించారు. వాళ్లంతా ఫ్రెంచ్ ఫ్రైలను వారానికి నాలుగైదు రోజులు తినేవారే. పరిశోధన ముగిసేనాటికి 236 మంది చనిపోయారు.
దీన్ని బట్టీ మనకు అర్థమయ్యేదొకటే. ఈ ఫ్రైలు, ఆయిల్ ఫుడ్డును వీలైనంతవరకూ తగ్గించుకోవాలి. ఉడకబెట్టిన వాటినే తినాలి. అప్పుడు అడ్డమైన రోగాలూ మన దరిచేరవు.
ఇవి కూడా చదవండి :
ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...
రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...
ఎంతకీ జ్వరం తగ్గట్లేదా... ఇలా చెయ్యండి... అరగంటలో తగ్గుతుంది...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Tips For Women, Women health