హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

After lunch: మధ్యాహ్నం లంచ్​ చేసిన తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? వివరాలివే..

After lunch: మధ్యాహ్నం లంచ్​ చేసిన తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మధ్యాహ్నం సమయంలో భోజనం చేశారు అంటే ఇక నిద్ర చాలా మందికి వస్తూ వుంటుంది. నిద్రను ఎంత కంట్రోల్ (Control) చేసుకోవాలి అన్న కూడా అస్సలు కంట్రోల్ కాదు . అయితే ఈ నిద్ర ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో నిద్ర  పోతూ (Sleep) ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకు చాలామందికి సమయం ఉండట్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటున్నారు. అయితే చాలామంది మధ్యాహ్నం (After Noon) సమయంలో కూడా నిద్రపోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. రాత్రి సమయం కంటే మధ్యాహ్నం నిద్రని  ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక మధ్యాహ్నం సమయంలో భోజనం చేశారు అంటే ఇక నిద్ర చాలా మందికి వస్తూ వుంటుంది. నిద్రను ఎంత కంట్రోల్ (Control) చేసుకోవాలి అన్న కూడా అస్సలు కంట్రోల్ కాదు.సమయం దొరికితే బాగుండు ఒక కునుకు తీసే వాళ్లు ఉంటారు.  అయితే రాత్రి సమయాల్లో 8 గంటల పాటు నిద్ర పోయినప్పటికీ మధ్యాహ్న సమయంలో కూడా చాలామంది నిద్రపోవడం ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ నిద్ర ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దాం..

  నిద్ర (sleep) రావడానికి వెనుక పెద్ద కారణమే..

  మధ్యాహ్నం భోజనం చేశారు అంటే చాలు ఎంతో మంది కేవలం నిమిషాల వ్యవధిలోనే నిద్ర పోతూ ఉంటారు. అయితే మధ్యాహ్న భోజనం (After Lunch) కాగానే అందరికీ నిద్ర ఎందుకు వస్తుంది అనేది మాత్రం చాలామందికి తెలియదు.  అయితే మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర (sleep) రావడానికి వెనుక పెద్ద కారణమే ఉంది అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎక్కువ భోజనం చేసిన సమయంలో శరీరంలో.. క్లోమ గ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీని సంకేతాలు మెదడుకు అందగానే సెరటోనిన్ (Serotonin), మెలటోనిన్ (Melatonin) అనే  హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.

  అయితే మెలటోనిన్ (Melatonin) అనే హార్మోన్ నిద్రకు సంబంధించిన హార్మోన్. ఇక ఇది ఉత్పత్తి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి  కూడా ఇక నిద్ర వస్తుంది. ఎప్పుడెప్పుడు నిద్ర పోవాలా అని అందరూ వేచి చూస్తూ ఉంటారు.  అయితే ఇలా మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన  వెంటనే నిద్ర వస్తే గ్రీన్ టీ తాగడం ద్వారా నిద్రను దూరం చేసే అవకాశం ఉందని అంతేకాకుండా కాసేపు అటూ ఇటూ నడవడం ద్వారా కూడా నిద్ర దూరమవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే కూడా నిద్ర మాయం అవుతుందట.

  పిల్లలు, పెద్దలు రాత్రి  ఇంట్లో ఒకేసారి నిద్రపోతే చాలా మంచిది. దీనివల్ల నిద్ర సమయం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అందరూ ప్రతీరోజు ఒకే సమయంలో మేల్కోవడం కూడా ఉత్తమం. అలాగే ప్రతీరోజు 30 నుంచి 60 నిమిషాలు నిద్రపోయే ముందు కొన్ని పనులు చేస్తే మంచిది. పిల్లలకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించడం, వారితో పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి.

  నిద్రపోయే ముందు టీవీ చూడటం, సోషల్ మీడియా వాడటం, వీడియోగేమ్స్​ లాంటివి అసలు చేయకూడదు. పిల్లలకు అసలే ఇలాంటివి అలవాటు చేయకూడదు. నిద్రపోయే ముందు ప్రశాంతమైన, నిశ్శబ్ద వాతావరణం ఉంటే నిద్ర నాణ్యతగా ఉంటుంది. అలాగే పిల్లలు నిద్రపోయేటప్పుడు పూర్తి చీకటిగా ఉండకుండా నైట్​లైట్లు వినియోగించాలి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Food, Sleep tips

  ఉత్తమ కథలు