హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Waking up Time: ఆయుర్వేదం ప్రకారం రోజూ పొద్దున్నే ఎన్నింటికి నిద్ర లేవాలో తెలుసా?

Waking up Time: ఆయుర్వేదం ప్రకారం రోజూ పొద్దున్నే ఎన్నింటికి నిద్ర లేవాలో తెలుసా?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

బ్రహ్మ ముహూర్తం అంటే రోజులోని ఓ ముఖ్యమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఇది సూర్యోదయానికి ఒక గంట ముప్ఫై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై.. సూర్యోదయం అయిన 48 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఎన్నో సత్ఫలితాలు పొందొచ్చట.

సాధారణంగా మన ఇళ్లలో పెద్దవాళ్లు ఉదయాన్నే సూర్యోదయం అవుతుండగానే నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకుంటుంటారు. ఇలా సూర్యోదయాన్నే లేచి పనులు పూర్తి చేసుకోవడం వల్ల వారు రోజంతా యాక్టివ్ గా ఫీలవుతూ ఉంటారు.. అందుకే ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయమే నిద్ర లేవడానికి సరైన సమయం అని చెబుతూ ఉంటారు. హిందూ పురాణాల్లోనూ ఈ విషయం రాసి ఉంచారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఏ పని చేసినా అందులో విజయం సాధించవచ్చని చెబుతుంటారు. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? అది ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది? తెలుసుకుందాం..

బ్రహ్మ ముహూర్తం అంటే..

బ్రహ్మ ముహూర్తం అంటే రోజులోని ఓ ముఖ్యమైన భాగం అని చెప్పుకోవచ్చు. ఇది సూర్యోదయానికి ఒక గంట ముప్ఫై ఆరు నిమిషాల ముందు ప్రారంభమై.. సూర్యోదయం అయిన 48 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఎన్నో సత్ఫలితాలు పొందొచ్చట. బ్రహ్మ ముహూర్తం మొదలైన సమయం నుంచి సూర్యోదయానికి మధ్యలో ఎప్పుడు లేచినా ఫర్వాలేదని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనివల్ల మన చుట్టూ ఉన్న వాతావరణంలో సూర్య కిరణాల వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్టీ మనలో కూడా నిండుతుంది. అందుకే ఉదయాన్నే నిద్ర లేచిన వారు మిగిలిన వారితో పోల్చుకుంటే ఫ్రెష్ గా ఫీలవుతుంటారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచే అలవాటు లేకపోతే కనీసం సూర్యోదయం సమయానికి నిద్ర లేచేలా ప్రయత్నించాలని చెబుతున్నారు నిపుణులు.

ప్రయోజనాలేంటి ?

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల జ్ఞానం పెరుగుతుందట. ఉదయాన్నే ధ్యానం చేస్తూ లేదా పుస్తకాలు చదువుతూ గడుపుతారు చాలామంది. అందుకే ఉదయాన్నే చదవడం మంచిది అని కూడా చెబుతుంటారు. ఈ సమయంలో చదవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పనితీరు కూడా మరింత సమర్థవంతంగా మారుతుంది.

శరీర తత్వాన్ని బట్టి కూడా..

మనం నిద్ర లేచే సమయం మన శరీర తత్వాన్ని బట్టి కూడా ఆధారపడి ఉండాలట. వివిధ కాలాల్లో సూర్యోదయం తొందరగా, లేదా ఆలస్యంగా కావడం ఆ కాలంలో శరీర గుణాన్ని ఆధారంగా చేసుకొనే ఉంటుందట. అందుకే వాత ప్రవృత్తి కల వారు కనీసం సూర్యోదయానికి అరగంట ముందు, పిత్త

ప్రవృత్తి గల శరీరం అయితే సూర్యోదయానికి 45 నిమిషాల ముందు.. అదే కఫ ప్రవృత్తి ఉన్న శరీరం అయితే సూర్యోదయానికి కనీసం గంటన్నర ముందు నిద్ర లేవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

అయితే ఒకవేళ మీ ఉద్యోగం లేదా ఇతర ఒత్తిళ్ల కారణంగా మీరు రాత్రి ఆలస్యంగా నిద్ర పోతుంటే వాత ప్రవృత్తి కలవారు కనీసం ఉదయం 7 గంటల లోపు నిద్ర లేవాలి. పిత్త శరీరం అయితే కనీసం 6.30 కి, కఫ శరీర తత్వం ఉన్నవారు కనీసం 6 గంటల లోపు నిద్ర లేవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మన శరీర తత్వం ఎలాంటిదో మనకు తెలియకపోతే ఏం చేయాలి? అనుకుంటున్నారా? కనీసం ఉదయం 6.30 నుంచి 7 లోపు నిద్ర లేచేందుకు ప్రయత్నించడమే..

సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం సమయానికి నిద్ర లేవడం వల్ల నులి వెచ్చని భానుడి కిరణాలు శరీరంపై పడి శరీరం యాక్టివ్ గా మారుతుంది. రోజంతా ఫ్రెష్ గా ఫీలయ్యేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అంతే కాదు.. జీర్ణ శక్తిని పెంచడం, ఆనందం, శాంతి వంటివి పెంచడంలో సహాయపడుతుంది.

First published:

Tags: Sleep tips

ఉత్తమ కథలు