Immunity Drinks: ఈ సీజన్ లో వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ పానీయాలు తీసుకోండి.. అవి ఏంటంటే?

రోగ నిరోధక శక్తి పెంచే పానీయాలు

Immunity boosters: అసలే వర్షాకాలం.. వైరల్ ఫీవర్లు వెంటాడే సీజన్.. ఇప్పటికే కోరనా మహమ్మారి భయపెడుతోంది. దానికి ఏ మాత్రం తీసుపోకుండా డెంగ్యూ, మలేరియాలు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రతి మనిషి తమ రోగ నిరోధక శక్తిని తప్పక పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి ఈ మూడు పానీయాలు తీసుకుంటే చాలు..

 • Share this:
  Healthy Drinks: ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ (Corona Second Wave) భయం.. ఇదే సమయంలో థర్డ్ వేవ్ (Third Wave) హెచ్చరికలు.. వీటికి తోడు వర్షకాలం వచ్చే వైరల్ ఫీవర్లు (Viral Fever).. దీంతో ప్రతి మనిషికి రోగ నిరోధక శక్తి (Immunity booster) చాలా అవసరమైంది. రోగనిరోధక శక్తి ఎవరిలో తక్కువగా ఉంటే ఆ వ్యక్తికి అన్ని రోగాలు అటాక్ అవుతాయి. తరచుగా జలుబు (Cold), దగ్గు (cough), జ్వరం (fever) మొదలైన సమస్యలు వస్తాయి. అంతేకాదు ఈ రోజుల్లో రకరకాల వైరస్‌ (Virus)లు పుట్టుకొస్తున్నాయి. ఇవి ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిపైనా అధికంగా అటాక్ చేస్తున్నాయి. సెప్టెంబర్ (September), నవంబర్ (November) మధ్య వైరల్, డెంగ్యూ, మలేరియా, ఫ్లూ, దగ్గు మొదలైనవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. వాటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఈ 3 ఆరోగ్యకరమైన పానీయాలు చక్కగా పనిచేస్తాయి. అందులో మొదటిది జీలకర్ర, బెల్లం పానీయం. మనిషిలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచే పానియం జీలకర్ర బెల్లం కలిపిన రసం. శ్లేష్మాన్ని తొలగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని తొలగించడంలో సహాయపడతాయి. బలహీనతతో జ్వరం లేదా ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యే వారికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒకటిన్నర గ్లాసుల నీటిని వేడి చేయాలి. తర్వాత దానికి ఒక చెంచా జీలకర్ర కొంత బెల్లం కలపాలి. దానిని బాగా మరిగించి ఫిల్టర్ చేసి టీ లాగా తీసుకోవాలి. ఇది మీ శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

  రెండోది పసుపు పాలు.. పసున మనకు ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. వంటకాల రంగు కోసం, రుచి కోసం వాడడమే కాదు. యాంటీ బయోటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఇంట్లో పసువు వాడకం సర్వ సాధారణం. పసుపును పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఇందులో యాంటీసెప్టిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. నిద్రించే సమయంలో పసుపు పాలను ప్రతిరోజూ తీసుకుంటే ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  ఇదీ చదవండి: : ఇంతింతై.. కొలనంతై.. జెయింట్ వాటర్ లిల్లీ ప్రత్యేకతలు ఎన్నో..

  ఇక మూడోది ఈ సీజన్‌లో తులసి, గిలోయ్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. దీన్ని చేయడానికి, ఒక గ్లాసు నీటిలో 8 తులసి ఆకులు, జిలోయ్ స్టిక్స్ కలపాలి. ఇది కాకుండా అల్లం, నల్ల మిరియాలు, పసుపు కలపాలి. ఆ తర్వాత నీటిని సగం వరకు మిగిలేలా మరిగించాలి. దాన్ని ఫిల్టర్ చేసి నిమ్మరసం, ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. ప్రతి ఉదయం పరగడుపున ఈ పానీయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి.
  Published by:Nagesh Paina
  First published: