• HOME
  • »
  • NEWS
  • »
  • LIFE-STYLE
  • »
  • THIS INDIAN MOBILE PHONE COMES WITH A CONTACTLESS THERMOMETER NS GH

Lava Pulse 1: టచ్ చేయకుండానే శరీర ఉష్ణోగ్రత తెలిపే సరికొత్త ఫోన్.. ధర రూ. 2 వేల లోపే..

Lava Pulse 1: టచ్ చేయకుండానే శరీర ఉష్ణోగ్రత తెలిపే సరికొత్త ఫోన్.. ధర రూ. 2 వేల లోపే..

Lava Pulse 1 feature phone

Lava Pulse 1: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 'లావా పల్స్ 1' పేరుతో వస్తోన్న ఈ ఫోన్‌లో కాంటాక్ట్‌లెస్ థర్మోమీటర్‌ ఆప్షన్ ఉంది.

  • Share this:
కరోనా నేపథ్యంలో థర్మోమీటర్లు, పల్సాక్సి మీటర్ల వాడకం పెరిగి పోయింది. షాపింగ్ మాల్స్, ఇతర జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో థర్మామీటర్ తో చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇళ్లల్లో సైతం థర్మోమీటర్ ను అనేక మంది వాడుతున్నారు. ముందు జాగ్రత్తగా ఉష్ణోగ్రతను పరీక్షించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఒక కొత్త ఫీచర్ ఫోన్‌ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 'లావా పల్స్ 1' పేరుతో వస్తోన్న ఈ ఫోన్‌లో కాంటాక్ట్‌లెస్ థర్మోమీటర్‌ ఆప్షన్ ఉంది. దీని ధర రూ.1,999. ఫోన్ సెన్సార్‌ను తాకకుండానే మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకునేలా దీన్ని రూపొందించారు. వినియోగదారులు తమ చేతులకి లేదా నుదుటి భాగానికి దగ్గరగా, కొన్ని సెంటీమీటర్ల దూరం వరకు ఫోన్‌ను తీసుకువస్తే చాలు. సెన్సార్ ఆటోమేటిగ్గా వారి శరీర ఉష్ణోగ్రతను తెరపై చూపిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ డేటాను షేర్ చేసుకోవచ్చు
రిఫరెన్స్ కోసం ఫోన్‌లో 10 రీడింగులను సేవ్ చేసుకునే అవకాశం ఉంది. మెస్సేజ్‌ల ద్వారా ఈ డేటాను ఇతరులతో పంచుకోవచ్చు. ఎక్కువ ధర ఉండే కాంటాక్ట్‌లెస్ థర్మోమీటర్లను కొనలేని వారు, వైద్య సదుపాయాలను సులభంగా పొందలేనివారు లావా పల్స్1 ఫోన్‌ ద్వారా కాంటాక్ట్‌లెస్ థర్మోమీటర్ సేవలను పొందవచ్చని లావా ఇంటర్నేషనల్ హెడ్ ప్రొడక్ట్ తేజిందర్ సింగ్ చెబుతున్నారు. లావా పల్స్1 మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ ఫోన్‌. ఇది 2.4 అంగుళాల డిస్ప్లేతో లభిస్తుంది.

అదనపు ఫీచర్లు కూడా...
దృఢమైన పాలికార్బోనేట్ బాడీతో ఈ ఫోన్‌ను రూపొందించారు. టార్చ్, వీజీఏ కెమెరా, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంట్లో ఉండే 1800mAh బ్యాటరీ.. సూపర్ బ్యాటరీ మోడ్‌తో లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఆరు రోజుల వరకు వాడుకోవచ్చు. నంబర్ టాకర్, కాంటాక్ట్స్‌ను సేవ్ చేసుకోవడానికి ఫోటో ఐకాన్, వైర్‌లెస్ FM విత్ రికార్డింగ్ ఆప్షన్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్‌ వంటి అదనపు ఫీచర్లున్నాయి. వినియోగదారులు ఏడు భాషలలో టైపింగ్ చేసుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published: