హోమ్ /వార్తలు /life-style /

Honeymoonకు వెళ్లాలనుకుంటున్న వారికి అలర్ట్.. అక్కడికి వెళ్తే డైవర్స్ తప్పదట.. తెలుసుకోండి

Honeymoonకు వెళ్లాలనుకుంటున్న వారికి అలర్ట్.. అక్కడికి వెళ్తే డైవర్స్ తప్పదట.. తెలుసుకోండి

ఆ ప్లేస్ అంటేనే కొత్త జంటల్లో హడల్ పుడుతోంది. మాల్దీవ్స్ ఎంత సుందరమైన ప్రాంతమైనా, పెళ్లయ్యాక జీవితం అంతకంటే సుందరంగా, మధురంగా ఉండాలి కానీ పెటాకులైతే ఏం ప్రయోజనం. అందుకే ఆ ప్రదేశానికి హనీమూన్ అంటే ఆలోచించుకోండి.

ఆ ప్లేస్ అంటేనే కొత్త జంటల్లో హడల్ పుడుతోంది. మాల్దీవ్స్ ఎంత సుందరమైన ప్రాంతమైనా, పెళ్లయ్యాక జీవితం అంతకంటే సుందరంగా, మధురంగా ఉండాలి కానీ పెటాకులైతే ఏం ప్రయోజనం. అందుకే ఆ ప్రదేశానికి హనీమూన్ అంటే ఆలోచించుకోండి.

ఆ ప్లేస్ అంటేనే కొత్త జంటల్లో హడల్ పుడుతోంది. మాల్దీవ్స్ ఎంత సుందరమైన ప్రాంతమైనా, పెళ్లయ్యాక జీవితం అంతకంటే సుందరంగా, మధురంగా ఉండాలి కానీ పెటాకులైతే ఏం ప్రయోజనం. అందుకే ఆ ప్రదేశానికి హనీమూన్ అంటే ఆలోచించుకోండి.

  సెలబ్రిటీలంతా Maldivesకు చెక్కేస్తుంటే మాల్దీవ్స్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ గా నిలుస్తోంది. కాజల్ అగర్వాల్ వంటి సెలబ్స్ అయితే ఏకంగా హనీమూన్ కూడా ఈ కాస్ట్లీ లగ్జరీ మాల్దీవ్స్ లోనే ఎంజాయ్ చేశారు. కానీ మీకు తెలుసా మాల్దీవ్స్ లో హనీమూన్ అంటే డైవర్స్ కు దారితీస్తుందనే సెంటిమెంట్ ఒకటి ఉందని. ఈమధ్యకాలంలో కొత్తగా పెళ్లైనవారు హనీమూన్ అంటే ముందు మాల్దీవ్స్ అనుకుని, ఆతరువాతి సెంటిమెంట్ తెలిసాక డ్రాప్ అవుతున్నారు కూడా. హనీమూన్ కు మాల్దీవ్స్ వచ్చే జంటల్లో సుమారు 20శాతం మంది విడాకులతో తమ జీవితం పెటాకులు చేసుకుంటున్నారట. దీంతో మాల్దీవ్స్ అంటే కొత్త జంటల్లో హడల్ పుడుతోంది. మాల్దీవ్స్ ఎంత సుందరమైన ప్రాంతమైనా, పెళ్లయ్యాక జీవితం అంతకంటే సుందరంగా, మధురంగా ఉండాలి కానీ పెటాకులైతే ఏం ప్రయోజనం. అందుకే మాల్దీవ్స్ లో హనీమూన్ అంటే ఆలోచించుకోండి.

  మీరు విడాకులు వద్దనుకుంటే మాత్రం మాల్దీవ్స్ కు దూరంగా ఉండండి. ఏం ప్రపంచంలో ఏ ఇతర ప్రాంతాలు లేవా ఇలా హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు. అంతెందుకు మన దేశంలో ఏమైనా తక్కువ హనీమూన్ డెస్టినేషన్స్ ఉన్నాయా ఏంటి చెప్పండి. అసలు మీరు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని పర్యాటక ప్రాంతాలు చూశారు. అండమాన్, కేరళ, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో లేని అందాలు ఇతర దేశాల్లో ఉన్నాయా ఒక్కమారు ఆలోచించండి. ఇక విదేశాల్లో top bucket list honeymoon destination లగ్జరీగా హనీమూన్ చేసుకోవాలనుకుంటే అయ్యే ఖర్చులు తడిసి మోపెడయ్యేబదులు హ్యాపీగా మీకు కావాల్సిన బడ్జెట్ లో లగ్జరీ హనీమూన్ ను ఇక్కడే ఆస్వాదించవచ్చుగా.

  compare అనే వెబ్ సైట్ సర్వే

  మాల్దీవ్స్ లో హనీమూన్ చేసుకున్నాక, డైవర్స్ తీసుకున్న 3,100 మంది జంటలను కంపేర్ డాట్ బెట్ Compare.bet అనే వెబ్ సైట్ ఇంటర్వ్యూ చేశాక ఈ సెంటిమెంట్ ను వెలుగులోకి తెచ్చింది. డ్రీమీ హనీమూన్ పేరుతో ఇలా మాల్దీవ్స్ కు వెళ్లి బోల్తా ఎందుకు కొడతారని ట్రిప్ అడ్వైజర్స్ పదేపదే చెబుతున్నారు. మాల్దీవ్స్ తరువాతి స్థానంలో ఉంది మరాకేష్, మరాకేష్ కు హనీమూన్ వెళ్లిన జంటల్లో 17శాతం మంది విడాకులు తీసుకున్నారు. మోరాకోలోని ఎక్జాటిక్ సిటీగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి కూడా హనీమూన్ జంటలు వెళ్లద్దనే సలహాతో పాటు బోరాలో హనీమూన్ కు వెళ్లిన 13శాతం జంటలు, బాలీకి వెళ్లిన 10శాతం హనీమూన్ కపుల్, మారిషస్ లో హనీమూన్ ఎంజాయ్ చేసిన 8శాతం జంటల పరిస్థితి కూడా ఇదే.

  సెలబ్రిటీ (celebrities) హనీమూన్ లు ఇక్కడ

  స్విట్జర్లాండ్ లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల హనీమూన్ లగ్జరీగా జరిగింది. విద్యాబాలన్-సిద్ధార్థా రాయ్ కపూర్ జంట మాత్రం కరీబియన్ దీవుల్లో హనీమూన్ జరుపుకున్నారు. అభిషేక్-ఐశ్వర్యలు యూరప్ లో జరుపుకున్నారు. శిల్పాషెట్టీ-రాజ్ కుంద్రాలు బహమాస్ వెళ్లారు. షారూఖ్-గౌరీల హనీమూన్ ప్యారిస్ లో, అమీర్ ఖాన్-అమృతారావ్ లు ముంబైకి సమీపంలోని పంచ్ గనీలో హనీమూన్ జరుపుకున్నారు. షాహిద్ కపూర్-మీరా లండన్ లో హనీమూన్ ఎంజాయ్ చేశారు.

  మాధురీ దీక్షిత్-శ్రీరాం నేనేల హనీమూన్ డెస్టినేషన్ హవాయి ద్వీపం. అనుష్క-విరాట్ కోహ్లిల హనీమూన్ ఫిన్లాండ్ లో జరిగింది. జెనీలియా-హృతేష్ దేశ్ ముఖ్ లో విశాఖపట్నంలో తమ హనీమూన్ జరుపుకోవడం హైలైట్. మీకో విషయం తెలుసా మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్ లనే తీసుకోండి వీరి హనీమూన్ జరిగింది మాల్దీవ్స్ లో, ఆతరువాత వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం మలైకా అర్జున్ కపూర్ ను డేట్ చేస్తుండగా అర్బాజ్ ఇంకో మోడల్ ను డేటింగ్ చేస్తున్నారు.

  Indiaలో టాప్ 5 హనీమూన్ డెస్టినేషన్స్ 

  గోవా, అండమాన్స్, కేరళలోని మున్నార్, కశ్మీర్ లోని గుల్మార్గ్, రాజస్థాన్ లోని ఉదయ్ పూర్, యూపీలోని ఆగ్రా (Agra) వంటి హనీమూన్ డెస్టినేషన్స్ కోసం విదేశీయులు మనదేశానికి ఎగబడి వస్తుంటే మనమెందుకు ఇతర దేశాల్లో హనీమూన్ జరుపుకోవాలనుకుంటున్నామో ఆలోచిస్తో హనీమూన్ డెస్టినేషన్స్ ను మనదేశంలో ఎన్నో మనం రీడిస్కవర్ చేయవచ్చని ట్రావెల్ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.

  First published:

  ఉత్తమ కథలు