Health Tips : బట్టతలపై జుట్టు రావాలా... ఈ టోపీ వాడితే సరి

Baldness Cure : ఆ ఎలక్ట్రిక్ క్యాప్‌లోని ఎలక్ట్రిక్ ప్యాచ్... జూలు లేని ఎలుకలకు జూలు వచ్చేలా చేసింది. అలాగే అది బట్టతలపై జుట్టు వచ్చేలా చేస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 1:56 PM IST
Health Tips : బట్టతలపై జుట్టు రావాలా... ఈ టోపీ వాడితే సరి
బట్టతలపై జుట్టు రావాలా... ఈ టోపీ వాడితే సరి (credit - Twitter - Giant Freakin Robot)
Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 1:56 PM IST
Baldness Cure : ఈ రోజుల్లో బట్టతల అనేది కామన్ ప్రాబ్లం. ఇందుకు ఆహార అలవాట్లు, జన్యు లోపాలు, ఒత్తిళ్లు, టెన్షన్లు ఇలా ఎన్నో కారణాలు. ఐతే... తలపై జుట్టు లేకపోతే చాలా మంది కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఏదో ఒక సందర్భంలో వాళ్ల బట్టతలను ఉద్దేశించి కించ పరిచేలా మాట్లాడుతుంటారు. ఆ మాటలు తట్టుకోలేని వారు... ఎలాగైనా బట్టతలను పోగొట్టుకోవాలని రకరకాల లోషన్లు, మాత్రలు వాడుతుంటారు. అవేవీ ఫలితం ఇవ్వకపోతే... చివరకు ఎక్కువ మంది ఫాలో అవుతున్నది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఐతే... ఇది చేయించుకోవడానికి చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేవారికి సరైన అనుభవం లేకపోతే... ప్రాణాలకే ప్రమాదం. అందుకే... అన్ని ప్రయత్నాల వైపూ చూశాక... చిరాకొచ్చి... పోతే పోనీ బట్టతలే ఉండనీ... ఎవరేమనుకుంటే నాకేం... అని అనుకుంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో... బట్టతలపై జుట్టు వచ్చేలా సైంటిస్టులు కొత్త రకం ప్యాచ్ తయారుచేశారు. బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటి చుండ్రు. దాన్ని తరిమికొడితే... తలపై ఉన్న చర్మ రంధ్రాల నుంచీ తిరిగి కొత్త జుట్టు వచ్చేందుకు వీలవుతుంది. వీటినే మనం కుదుళ్లు అంటుంటాం. కుదుళ్ల చుట్టూ చేరే చుండ్రు... జుట్టును కొరికేస్తుంది. రాలిపోయేలా చేస్తుంది. బట్టతల వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో... విస్కాన్సిస్-మాడిసన్ యీూనివర్శిటీలో... జుడాంగ్ వాంగ్ ఆయన సహచరులు కలిసి... ఓ వైర్‌లెస్ ప్యాచ్ తయారుచేశారు. అది చుండ్రు అంతు చూస్తుంది.

ఈ మిల్లీమీటర్ మందం మాత్రమే ఉండే ప్యాచ్‌ని రోజూ తలపై కొన్ని గంటలపాటూ పెట్టుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు. అప్పుడు ఈ ప్యాచ్... మన శరీర కదలికలను బట్టీ... ఎలక్ట్రిసిటీ పల్సెస్‌ను ఉత్పత్తి చేస్తుంది. అవి బట్టతలపై చుండ్రును తరిమికొట్టడమే కాదు. బట్టతలపై తిరిగి జుట్టు మొలిచేందుకు వీలయ్యేలా చేస్తుంది. ఈ ప్రక్రియను ట్రిబోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ (triboelectric effect) అంటున్నారు.

ముందుగా ఈ ప్యాచ్‌ని బొచ్చు లేని ఎలుకలకు తగిలించారు. ఫలితంగా వాటికి కొత్త బొచ్చు వచ్చేసింది. ఆ తర్వాత చుంచెలుకలపైనా ప్రయోగించారు. 9 రోజుల తర్వాత ప్యాచ్ కింద... 2 మిల్లీమీటర్ల బొచ్చు వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందో మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. ఏం తెలిసిందంటే... ట్రిబోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల... బొచ్చు లేని ప్రదేశంలో... కొన్ని రకాల రసాయనాల్ని శరీరం రిలీజ్ చేసింది. అవి బొచ్చు పెరిగేందుకు దోహదపడ్డాయి.నెక్ట్స్ జుడాంగ్ వాంగ్... ఆ ప్యాచ్‌‌ను తన తండ్రి బట్టతలపై ప్రయోగించారు. ఆ పెద్దాయనకు కొన్నేళ్లుగా జుట్టు లేదు. నెల తర్వాత ఆయనకు కొత్త జుట్టు వచ్చేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు ఆ ప్యాచ్‌ను అందరికీ ఉపయోగపడేలా చేసేందుకు వాళ్లు ఓ క్యాప్ (Hat) తయారుచేశారు. ఆ క్యాప్ లోపల ప్యాచ్‌ని అమర్చారు. ఇప్పుడు ఆ టీమ్... తాము తయారుచేసిన క్యాప్‌ని ప్రజలపై ప్రయోగించేందుకూ, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, క్లినికల్ ట్రయల్స్‌కి పర్మిషన్ ఇవ్వాలని కోరుతోంది.

ఎవరికి పనిచేస్తుంది : పరిశోధకులు చెబుతున్నదాన్ని బట్టీ... ఆ క్యాప్ బట్టతల ఉన్న మగాళ్లందరికీ జుట్టు తేలేదు. ఇటీవల జుట్టు రాలిపోయిన వాళ్లకు మాత్రమే కొత్త జుట్టు వస్తుందట. అదే చాలా ఏళ్లుగా అంటే ఏ 20 ఏళ్లుగానో బట్టతల ఉంటే... వాళ్లకు కలిసిరాదని చెబుతున్నారు. ఎందుకంటే... ఎక్కువ ఏళ్లు బట్టతల ఉంటే... ఆ తలపై కొత్త జుట్టు మొలిచే అవకాశాలు చాలా తక్కువ అంటున్నారు. అదే ఇటీవల అంటే ఓ పదేళ్లుగా జుట్టు రాలిపోతూ... తగ్గిపోతూ ఉండేవాళ్లకు అది పనిచేస్తుందని అంటున్నారు. అదికూడా మగవాళ్లకు మాత్రమే.

మగాళ్లు నిద్రపోతున్నప్పుడు ఆ క్యాప్ పెట్టుకుంటే ప్రయోజనం ఉండదట. ఎందుకంటే... నిద్రపోతున్నప్పుడు తలలో కదలికలు ఉండవు కాబట్టి... ప్యాచ్ పరికరానికి పవర్ అందదట. అందువల్ల మెలకువగా ఉన్నప్పుడు, పగటివేళ కొన్ని గంటలపాటూ ఆ క్యాప్ పెట్టుకుంటే... నెల రోజుల్లో జుట్టు మొలుస్తుందని చెబుతున్నారు. సో... అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... వందల కోట్ల మంది బాల్డ్‌నెస్‌కి పరిష్కారం దొరికినట్లే.
First published: September 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...