Interior design: తక్కువ ఖర్చుతోనే.. మీ ఇంటిని ఈ 5 టిప్స్‌తో లగ్జరీహౌస్‌గా మార్చేయొచ్చు!

ప్రతికాత్మక చిత్రం

విలాసవంతమైన లుక్‌ ఇంటికి రావాలంటే మరో ముఖ్య విషయం మంచి ఫర్నిచర్‌. ఇది రంగురంగులుగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది.

  • Share this:
మనం ఎక్కువ సమయం గడిపేది ఇల్లే. ఎందుకంటే ఇళ్లు మన ప్రపంచంగా ఫీల్‌ అవుతాం. అటువంటి ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అయితే, ఇల్లు మరింత అందంగా, లగ్జరీ లుక్‌ Luxury look రావాలంటే ఈ 5 చిన్న టిప్స్‌ పాటించండి. మీ ఇల్లు ఎంతో అందంగా మారిపోతుంది.  ముఖ్యంగా ఇంటి ఇంటీరియర్‌లో మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఇంట్లోకి ఎవరైనా వస్తే.. సోఫాపైనే కూర్చుంటారు. అది వెల్‌కం చెప్పే విధంగా అందంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో మీ ఇల్లు స్లైలిష్‌గా మారిపోతుంది.

మీరు మీ ఇంటిని మరింత లగ్జరీ Luxury గా మార్చాలంటే.. ఏమాత్రం ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి. ఈ ఆలోచనలు ఫుర్‌లెంకోలోని కీయూర్‌ జవేరి ఇంటిని మరింత అందంగా మార్చుకునే విధానాన్ని షేర్‌ చేసింది.

మీకు సహజంగా మీ ఇంటికి ఖరీదైన డెకరేషన్‌ Decoration చేయాలని అనిపిస్తుంది. కానీ, ఇంటి స్థలాన్ని బట్టి డెకరేట్‌ చేసుకుంటే అందంగా మారుతుంది. దీనికి మన్నికైన కుషన్‌ కవర్స్, పిల్లోస్, సెంటర్‌ టేబుల్, ఒక లైట్, వాల్‌ ఆర్ట్‌ ఇవన్నీ మీ ఇంట్లో ఎన్నో వస్తువులు ఉన్న లుక్‌ తీసుకువస్తాయి.

విలాసవంతమైన లుక్‌ ఇంటికి రావాలంటే మరో ముఖ్య విషయం మంచి ఫర్నిచర్‌. ఇది రంగురంగులుగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. మీ ఫర్నిచర్‌ అప్‌హోల్‌స్టర్‌ వెల్వేట్, లినెన్, స్వెడ్‌ వంటి నాణ్యమైనవి బెస్ట్‌ ఆప్షన్‌. లేకపోతే డెనిమ్, ఫాక్స్‌ లెథర్‌ వంటి అల్లికలను కూడా ఉపయోగించవచ్చు.

ఇంట్లో టీవీ ఇటువైపు పెట్టుకుంటే.. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండదట!



లగ్జురీయస్‌ లుక్‌ ఇంటికి తీసుకురావడానికి లైటింగ్‌ మరో ముఖ్యమైంది. ఇంటిలోని మూలల్లో వీటిని పెట్టుకుంటే ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు ఇష్టమైన ప్రదేశాల్లో సీలింగ్, ఫ్లోర్‌ ల్యాంప్స్, టేబుల్‌ ల్యాంప్స్, యాసెంట్‌ లైట్‌ పిక్చర్స్‌కు కాస్త పెట్టుబడి అవసరమే. ఈ లైట్లన్ని ఒకే రంగులో ఉంటే లుక్‌ బాగుంటుంది.

లగ్జరీ లుక్‌ కోసం ఫర్నిచర్‌కు డెకరేషన్‌ను జత చేయాలి. దీంతో మీ ఇంటి లుక్‌ మారిపోతుంది. సోఫా కింద కార్పెట్‌ మొత్తం ఆ స్పెస్‌ రూపం మారుతుంది. బెడ్‌రూం, బాత్‌రూమ్‌లపైన, డైనింగ్‌ టేబుల్‌పైన ఎలిగెంట్‌ రన్నర్‌ను ప్రయత్నించండి. మరింత లుక్‌ కోసం గోడలు, విండోలకు లేయర్‌ కవరింగ్‌ వేసుకోవాలి.

మీ ఇంటీరియర్‌లను అద్భుతంగా ఉంచడానికి కాస్త మెటాలిక్‌ టచ్‌ను జోడించవచ్చు. మెటాలిక్‌ యాక్సెసరీలను తక్కువగా ఉంచడం మేలు.గోల్డ్, కాంస్యం, రాగి లేదా వెండి రంగుల్లో ఉంటే మంచిది. సెంటర్‌పీస్, దీపాలు, లైటింగ్‌ ఫిక్చర్స్‌ మంచి ఎన్నిక.
Published by:Renuka Godugu
First published: