ప్రేమకు వయసుతో సంబంధం లేదని కొందరు అంటారు. ఇలా వయసుతో నిమిత్తం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. వయసుల మధ్య భారీ తేడా ఉన్న కూడా పట్టించుకోని వారు మరికొందరు. తాజాగా ఇలాంటి ఓ జంట తమ అనుభూతిని షేర్ చేసుకుంది. 21 ఏళ్ల యువతి.. 43 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. అతని ఇదివరకే తనకంటే ఒక సంవత్సరం చిన్నదైన కూతురు కూడా ఉన్న సంగతి తెలిసి కూడా.. అతని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. ఇద్దరి మనసులు కలవడంతో.. ఇప్పుడు ఇద్దరు కలిసే ఉంటున్నారు. వివరాలు.. అమెరికాలోని ఆరిజోనా సియెర్రా విస్టాకు చెందిన 21 ఏళ్ల ఇయా గిల్‌కు, 43 ఏళ్ల రఫాల్కు మధ్య ప్రేమ పుట్టింది. అయితే వారిద్దరికి తమ మధ్య ఉన్న వయసు వ్యత్యాసం పెద్ద విచిత్రంగా అనిపించలేదు. ఎందుకంటే తమ మనసులు కలిశాయని ఆ జంట చెబుతోంది. ఇందుకు సంబంధించిన విశేషాలను ఆ జంట.. వారి యూట్యూబ్ చానల్లో షేర్ చేసుకుంది.
ఇయా మాట్లాడుతూ.. స్టాక్‌బ్రోకర్‌గా పనిచేస్తున్న రఫాల్ తన దృష్టిని ఆకర్షించేందుకు తనవైపు ఎలా చూసేవాడో గుర్తుచేసుకుంది. మరోవైపు తాను 2019 ఏప్రిల్‌లో బార్లో ఇయాను కలిసినట్టుగా రఫాల్ చెప్పాడు. ఆమె బార్లో ఉన్నందున్న ఆమె వయసు ఎక్కువగా భావించినట్టు తెలిపాడు. ఇక, వారి మధ్య పరిచయం డేటింగ్‌కు దారితీసిందని తెలిపారు.
అయితే డేటింగ్ ప్రారంభమైన మూడు వారాల వరకు కూడా ఒకరి వయసుల గురించి మరోకరికి తెలియదు. రఫాల్.. ఇయా తల్లిని కలిసిన తర్వాత ఆమె వయసు విషయం గురించి తెలిసింది. ఆ తర్వాత రఫాల్కు ఇయా వయసుకు దగ్గరగా ఉన్న కూతురు(సెలీన్).. ఉందని ఇయాకు తెలిసింది. ఈ విషయం తెలసుకున్న ఇరువురు షాక్‌కు గురయ్యారు. అయితే వారి మధ్య 22 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ.. అది పెద్ద వింతగా అనిపించలేదు. ఇద్దరు కలిసి జీవించాలనే నిర్ణయించుకున్నారు.
మరో వైపు ఇయా.. సెలీన్ను కలిసింది. ఇద్దరి వయసు దగ్గరగా ఉండటంతో.. వారు కలిసి షాపింగ్ చేయడం, సెలూన్‌కు వెళ్లడం, క్రీడల్లో పాల్గొనడం చేసేవారు. దీంతో వారి మధ్య ప్రెండ్షిప్ ఏర్పడింది. ఇప్పుడు సెలీన్.. తన తండ్రి, అతని గర్ల్‌ఫ్రెండ్ ఇయాతో కలిసి ఉంటుంది. ఇక, ఈ జంటకు అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి.. అయితే వారు మాత్రం తాము సంతోషంగా ఉన్నట్టు వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.