శృంగారం : అలా చేశారో ఆమె మూడ్ ఆఫ్ అయినట్టే..

భాగస్వామి ఇష్టాయిష్టాలను తెలుసుకుని శృంగారంలో ఆమెకూ స్వేచ్చనిస్తే ఇద్దరు దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. లేదంటే శృంగారం అనేది కేవలం బలప్రదర్శనగా మిగిలి భాగస్వామిలో అసంతృప్తిని మిగులుస్తుంది.

news18-telugu
Updated: June 26, 2019, 8:12 AM IST
శృంగారం : అలా చేశారో ఆమె మూడ్ ఆఫ్ అయినట్టే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శృంగారంలో భాగస్వామి ఇష్టాయిష్టాలను తెలుసుకుని మసులుకోవడం చాలా ముఖ్యం. ఆమెపై ఆధిపత్యం ప్రదర్శించాలని కాకుండా.. శృంగారంలో ఆమెకూ స్వేచ్చనివ్వాలి. అప్పుడే ఇద్దరు దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు. శృంగారంలోకి దిగేముందు దానికి తగ్గ మూడ్‌ను ప్రిపేర్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు.. గదిలో మీ భాగస్వామికి ఇష్టమైన మ్యూజిక్‌ను ప్లే చేయండి. ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటే.. మూడ్ ఆఫ్‌లో ఉన్నా సరే మనసు కాస్త కుదుటపడుతుంది. కాబట్టి మీ భాగస్వామికి ఇష్టమైన మ్యూజిక్‌ను ప్లే చేయడం ద్వారా ఆమె మనసును గెలుచుకోవచ్చు. అయితే ఆమెకు ఇష్టమైన మ్యూజిక్ ఏంటి..? ఇష్టపడనిదేంటి..? వంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. అలా కాకుండా ఆమెకు అయిష్టమైన మ్యూజిక్ ప్లే చేశారనుకోండి.. చిరాకుతో మూడ్ ఆఫ్ అయిపోవడం ఖాయం.

శృంగార సమయంలో మరో ముఖ్యమైన విషయం.. సెల్‌ఫోన్‌ను వీలైనంత దూరంగా ఉంచడం. శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా సెల్ రింగ్ అయిందనుకోండి.. అప్పటిదాకా ఉన్న హుషారు కాస్త ఒక్కసారిగా ఉసూరుమంటుంది.ఒక్కసారి మూడ్ ఆఫ్ అయితే మళ్లీ ఆ మూడ్‌లోకి రావాలంటే కష్టం. కాబట్టి ఆ సమయంలో సెల్‌ఫోన్‌ను అసలు పడక గదిలో లేకుండా చూసుకుంటే మేలు.


First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>