హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

పెంపుడు జంతువులతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం గుర్తుంచుకోవలసిన విషయాలు

పెంపుడు జంతువులతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం గుర్తుంచుకోవలసిన విషయాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Travel Tips : చాలా మంది ఎక్కడికెళ్లినా తమ పెట్స్(Pets)కూడా తీసుకెళ్తుంటారు. అయితే ప్రయాణం(Travelling)లో పెంపుడు జంతువును చూసుకోవడం అంత తేలికైన పని కాదు. వాస్తవానికి ఇంట్లో మీరు పెంపుడు జంతువులను చాలా పాంపర్డ్‌గా ఉంచుతారు. వాటి తిండికి, ప్రయాణానికి, నిద్రకు అన్ని ఏర్పాట్లూ ఇంట్లోనే ఉంటాయి కానీ ప్రయాణంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Travel Tips : చాలా మంది ఎక్కడికెళ్లినా తమ పెట్స్(Pets)కూడా తీసుకెళ్తుంటారు. అయితే ప్రయాణం(Travelling)లో పెంపుడు జంతువును చూసుకోవడం అంత తేలికైన పని కాదు. వాస్తవానికి ఇంట్లో మీరు పెంపుడు జంతువులను చాలా పాంపర్డ్‌గా ఉంచుతారు. వాటి తిండికి, ప్రయాణానికి, నిద్రకు అన్ని ఏర్పాట్లూ ఇంట్లోనే ఉంటాయి కానీ ప్రయాణంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి ఆరోగ్యంతో పాటు భద్రత బాధ్యత కూడా మీపై ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా పెంపుడు జంతువులతో ప్రయాణం చేయాలనుకుంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా ప్రయాణంలో పెట్స్ సంరక్షణను సులభతరం చేయవచ్చు.


విమానంలో ప్రయాణం
పెంపుడు జంతువులను ప్రయాణంలో తీసుకెళ్లేటప్పుడు విమానంలో ప్రయాణించడం బెస్ట్ ఆప్షన్. అటువంటి పరిస్థితిలో మీరు పెంపుడు జంతువులకు అనుకూలమైన విమానయాన సంస్థను ఎంచుకోవచ్చు, ఇక్కడ పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో ఇలాంటి విమానాలు చాలా ఉన్నాయి, వాటిలో పెంపుడు జంతువులను తీసుకెళ్లే సౌకర్యం ఉంది.


ఆరోగ్యంపై దృష్టి

విమానయాన సంస్థలు కూడా పెట్స్ ని మోసుకెళ్లడానికి వాటి స్వంత నియమాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, 8 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెంపుడు జంతువులను, 5 కిలోల కంటే ఎక్కువ బరువున్న పెంపుడు జంతువులను ఎయిర్‌లైన్‌లో తీసుకెళ్లడానికి అనుమతించబడదు. కాబట్టి విమానంలో ప్రయాణించే ముందు పెట్స్ యొక్క ఆరోగ్యం, బరువును తనిఖీ చేయండి.


Relationship tips : మీ భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తున్నారని చూపించే సంకేతాలు


కారులో ప్రయాణం

పెంపుడు జంతువులతో కారులో ప్రయాణించడం కూడా సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన అనుభవంగా నిరూపించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కారులో పెట్స్ ని సౌకర్యవంతంగా ఉంచుకోవడంతో పాటు, మీరు దానికి అవసరమైన అన్ని వస్తువులను కూడా తీసుకెళ్లవచ్చు. ఎల్లప్పుడూ పెట్స్ ని ముందు సీటుపై ఉంచాలని, కారు విండోను మూసి ఉంచాలని గుర్తుంచుకోండి. తద్వారా అది సురక్షితంగా ఉంటుంది.


హోటల్ బుకింగ్‌పై శ్రద్ధ వహించండి

పెంపుడు జంతువులతో ట్రిప్ సమయంలో హోటళ్లను బుక్ చేసుకునేటప్పుడు పెట్ ఫ్రెండ్లీ హోటల్‌ను ఎంచుకోవడం మంచిది. ఇలాంటి హోటళ్లలో పెంపుడు జంతువులను ఉంచుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ట్రిప్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Pet dog, Traveling

ఉత్తమ కథలు