ఫుట్‌వేర్ (Footwear) లేనేదే ఏ లుక్కు (Fashion Look) కంప్లీట్ కాదనేది కాదనలేని నిజం. ఎందుకంటే ఫుట్‌వేర్ అనేది ఒక వ్యక్తి ఓవరాల్ లుక్ మార్చేస్తుంది. సూట్‌తోపాటు మంచి బూట్లు ఉంటేనే ఆ లుక్ రిచ్‌గా కనిపిస్తుంది. అందుకే ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అయ్యే వారితో పాటు స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారు దుస్తులతో పాటు ఫుట్‌వేర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు అట్రాక్టివ్‌గా కనిపించాలంటే ఐదు ఫుట్‌వేర్ స్టైలింగ్ రూల్స్ (Footwear Styling Rules) పాటించాలి. అవేవో తెలుసుకుందాం.
క్వాలిటీ ఫుట్‌వేర్..
మనం ధరించే దుస్తులు ఎంత క్వాలిటీగా ఉన్నాయో.. ఫుట్‌వేర్ అంతకుమించి క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి ఒక్క అకేషన్‌కి, వేసుకున్న బట్టలకు మ్యాచ్ అయ్యేలా మంచి షూస్, స్నీకర్స్, లోఫర్స్, కస్టమ్ షూలు కొనుగోలు చేయాలి. వీటిలో ఇవన్నీ కోనుగోలు చేయకపోయినా కొనేదేదో ఎక్కువ కాలం మన్నికతో వచ్చేలా క్వాలిటీ ఫుట్‌వేర్ కొనాలి. తక్కువ క్వాలిటీ గల షూస్ తీసుకుంటే అవి కొద్ది నెలలకే పాడైపోయి నిరుపయోగంగా మారుతాయి. వీటి లుక్ కూడా కొద్ది రోజుల్లోనే చెడిపోతుంది. అందుకే పాదాలకు చాలా కంఫర్టబుల్‌గా ఉండే, స్టైలిష్‌గా కనిపిస్తూ ఎక్కువ కాలం మన్నిక అయ్యే షూస్ లేదా శాండిల్స్ తీసుకోవడం మంచిది.
బెస్ట్ సాక్స్..
షూస్ మాత్రమే కాదు దానితో పాటు ధరించే సాక్స్ లుక్ బాగుండటం కూడా ముఖ్యమే. ముఖ్యంగా మీరు లోఫర్స్ ధరిస్తే, లోఫర్ సాక్స్ మాత్రమే ధరించాలి. అదే మీరు స్నీకర్స్ ధరిస్తే, మీ అంకిల్ (Ankle) వరకు ఉండే సాక్స్‌లను ధరించాలి.
మ్యాచింగ్ అనవసరం..
మీరు వేసుకునే షూస్ మీ బట్టలకు, ధరించిన అన్ని యాక్సెసరీలకు తప్పకుండా మ్యాచ్ కావాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీ షూస్ మీ బ్యాగ్, బెల్ట్ వంటి ఇతర యాక్సెసరీలకు మ్యాచ్ అయినా మీ లుక్ అట్రాక్టివ్‌గానే కనిపిస్తుంది. అన్నీ ఒకే కలర్‌లో ఉన్నా ఆ లుక్ అనేది అంత బాగుండదు. ఒకవేళ ఏ కలర్ షూస్ వేసుకోవాలో తెలియకపోతే మీరు ట్యాన్, బ్రౌన్, బ్లాక్, వైట్ వంటి కలర్ ఫుట్‌వేర్ ధరించవచ్చు.
క్లీన్ షూస్..
మీరు హై-క్వాలిటీ ఫార్మల్ లేదా క్యాజువల్ బూట్ల కొనుగోలు చేసినప్పుడు.. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బూట్లు లేదా చెప్పులు మురికిగా ఉంటే అవి ఎంత ఖరీదైనవైనా, క్వాలిటీ గల ఫుట్‌వేర్ అయినా ఎవరికి నచ్చవు. అలాగే వాటిని మళ్లీ కొత్త వాటిలా శుభ్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైపోతుంది.
బాటమ్ వేర్ ఫోల్డింగ్..
ఫార్మల్ ఈవెంట్‌కు వెళ్లేటప్పుడు మీ బాటమ్ వేర్ మడత పెట్టేయకూడదు. బదులుగా మీ ప్యాంటును అడ్జస్ట్ చేసుకోవాలి. షూస్ లుక్ ఏమాత్రం చెడిపోకుండా ఓవరాల్ లుక్ మరింత అట్రాక్టివ్‌గా మార్చుకునేందుకు ఈ రూల్ కూడా మగవారు ఫాలో అవ్వాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Footwear, Life Style, Tips