హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Love: మీ ప్రేమ బంధం బలంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Love: మీ ప్రేమ బంధం బలంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

కలిసి జీవించాలంటే ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ఇంకా ఏమీ అవసరం లేదని అనుకుంటారు. అయితే వాస్తవానికి వస్తే కలిసి కలకాలం జీవించడానికి, బంధం బలంగా ఉండేందుకు ప్రేమ ఒక్కటే సరిపోదు.

ప్రేమ కంటికి కనిపించకుండా నచ్చిన వారిపై చూపించే మధురమైన భావన. ఎవరైనా నచ్చితే వారిని బలంగా కోరుకోవడం, వారిపై ఆశలు, ఫీలింగ్స్ ను పెంచుకోవడం సాధారణమే. అంతే కాకుండా కలిసి జీవించాలంటే ప్రేమ ఒక్కటి ఉంటే చాలు ఇంకా ఏమీ అవసరం లేదని అనుకుంటారు. అయితే వాస్తవానికి వస్తే కలిసి కలకాలం జీవించడానికి, బంధం బలంగా ఉండేందుకు ప్రేమ ఒక్కటే సరిపోదు. అన్నింటి కంటే ప్రేమ ముఖ్యమైనదే అయినప్పటికీ మరికొన్ని అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మరి ప్రేమ జీవితంలో ప్రేమ కంటే ముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నమ్మకం..

ప్రేమలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం నమ్మకం. మీరు అవతలివారిని ఎంత ప్రేమించినప్పటికీ నమ్మకం లేకపోతే ఆ బంధం నిలబడదు. ఆరోగ్యకరమైన బంధంలో ఒకరినొకరిపై ఉండే నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే నమ్మకం ద్వారానే ఇద్దరి మధ్య బంధం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది.

ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం..

ప్రేమికులు ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఒక జంటకు ఒకే ఆసక్తి లేదా అభిరుచులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వారు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

సురక్షితంగా, భద్రంగా ఉన్నామని అనిపించాలి

మీ బంధంలో మీరు సురక్షితంగా లేదా భద్రంగా లేరని అనిపించకపోతే.. అవతలి వ్యక్తిని మీరు ఎంత ప్రేమిస్తున్నారనే విషయంపై పెద్దగా పట్టింపు ఉండదు. మీరు మీ భాగస్వామితో సురక్షితంగా ఉన్నట్లు భావిచడం ముఖ్యం. మీరు మీ భాగస్వామిని వారిని చాలా ప్రేమించినా.. వారు మీకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎంత ఇష్టపడినా ప్రయోజనం ఉండదు. ప్రేమ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.


మాట్లాడుకోవడం..

కమ్యూనికేషన్ అనేది ప్రేమకు ఇంధనం లాంటిది. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే ప్రేమ బంధం సరిగ్గా ఉండదు. సరిహద్దులను నిర్ణయించడానికి ప్రేమను వ్యక్తీకరించడానికి, పరిష్కరించడానికి మీ అవసరాల గురించి మాట్లాడానికి మీ సంబంధంలో సంభాషణ అనేది చాలా అవసరం. మంచి సంభాషణలు అనేవి దీర్ఘకాలిక సంబంధానికి దారితీస్తాయి.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Love, Relationship

ఉత్తమ కథలు