Covid vaccine: మీరు డయాబెటిస్​ రోగులా?..అయితే కోవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్నాక ఇలా చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

టీకాలు తీసుకోవడం ద్వారా ఏవైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయని డయాబెటిస్ రోగులు భావిస్తుంటారు. అలాంటి భయాలేమీ అక్కర్లేదని, టీకాలు తీసుకున్నాక రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అస్తవ్యస్తమైన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మరోవైపు, డయాబెటిస్​ అనేక ఇతర అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. వీరికి కరోనా ప్రమాదం ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే, వారు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని చెబుతున్నారు. తద్వారా వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. అయితే టీకాలు తీసుకోవడం ద్వారా ఏవైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయని డయాబెటిస్ రోగులు భావిస్తుంటారు. అలాంటి భయాలేమీ అక్కర్లేదని, టీకాలు తీసుకున్నాక రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

చేపలు

చేపలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలోని ఒమేగా -3 కొవ్వులు మీ రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే, చేపలు శరీర అవయవాల్లో ఏర్పడే వాపును తగ్గించడానికి, మీకు అదనపు బలాన్ని చేకూర్చడానికి ఎంతగానో సహాయపడతాయి.

గుడ్లు

గుడ్లలోని ప్రోటీన్​ మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే అవసరమైన అమైనో ఆమ్లాలు గుడ్లలో పుష్కలంగా లభిస్తాయి.

చికెన్​

చికెన్ తినడం వల్ల యాంటీ ఇన్​ప్లమేటరీ ప్రయోజనాలు లభిస్తాయి. కోడి మాంసంలో తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. మరోవైపు అధిక ప్రోటీన్​ లభిస్తుంది. ఇది డయాబెటిస్​, రక్తపోటుపై బాగా పనిచేస్తుంది. అందువల్ల, టీకాలు తీసుకున్న తర్వాత వారానికి రెండు నుంచి మూడు సార్లు చికెన్ తినాలని డాక్టర్లు సలహాలిస్తున్నారు.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

పసుపు

పసుపులో కర్కుమిన్ ప్రోటీన్​ పుష్కలంగా లభిస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఒత్తిడిని నివారించడంలో సహాయపడుతుంది. టీకాలు వేసుకునే ముందు లేదా తర్వాత చాలా మంది ఒత్తిడికి లోనవుతుంటారు. వారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు పసుపు పాలు తాగడం లాభిస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి.

టీకాల తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా టీకా తీసుకుంటే ఇక కరోనా రాదని, మాస్క్​ లేకుండానే బయట తిరగవచ్చని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. టీకా తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డ రోగులు ఎంతో మంది ఉన్నారు. ఈ ప్రమాదం డయాబెటిస్​ రోగులకు కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల, టీకా తీసుకున్నప్పటికీ విధిగా మాస్క్‌ ధరించడం, సోషల్ డిస్టెన్స్​ పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివి పాటించాలి.
Published by:Krishna Adithya
First published: