Diet For Dry Skin: మీ చర్మం పొడిబారుతుందా?.. ఈ 15 ఆహారాలతో చెక్ పెట్టండి

ప్రతీకాత్మక చిత్రం

Diet For Dry Skin: సహజమైన పద్ధతుల ద్వారానే చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మీ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

  • Share this:
చలికాలంలో సాధారణంగా అందరికీ వచ్చే పెద్ద సమస్య చర్మం పొడిబారడం. అధిక చలి కారణంగా చర్మం ఎండిపోయి, నిర్జీవంగా మారుతుంది. అందువల్ల చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఎక్కువ మంది లోషన్లు, క్రిములను ఆశ్రయిస్తుంటారు. అయితే, వీటి ఉపయోగంతో దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి, సహజమైన పద్ధతుల ద్వారానే చర్మాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. మీ డైట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మీ చర్మసౌందర్యం కోసం అధిక పోషకాలు, కొవ్వులు, విటమిన్లు అధికంగా ఉండే ఈ 15 ఉత్తమ ఆహారాలని తీసుకోవాలి. వాటిపై ఓలుక్కేయండి.

ఆరోగ్యకరమైన కొవ్వులు..
ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మం కోసం కొవ్వు ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిది. ఎందుకంటే కొవ్వు ఆమ్లాలు కణ త్వచంలో ఒక భాగంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడతాయి.

గింజలు, విత్తనాలు
వీటిలో మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ అనే ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే హానికరమైన ప్రభావాల నుండి మనల్ని రక్షించి, చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.

అవోకాడోస్
దీనిలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే విటమిన్లను కలిగి ఉంటుంది. వీటిని బ్రెడ్ స్ప్రెడ్స్‌ లేదా సలాడ్స్‌లో జోడించి తీసుకోవచ్చు.

కొవ్వు చేప
దీనిలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది మన కణ త్వచాలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. వారానికి కనీసం మూడు చేపలను తినడం మంచిదని డాక్టర్లు సలహాలిస్తున్నారు.

కొబ్బరి నూనె
కొబ్బరినూనెను చాలా మంది జుట్టుకు మాత్రమే వినియోగిస్తారు. అయితే, చలికాలంలో కొబ్బరినూనె వాడకాన్ని పెంచితే మంచిది. ఎందుకంటే కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. దీంతో పాటు ఇందులో సాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి.

ప్రోటీన్లు..
ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. వీటిని మన శరీరానికి రక్షణగా నిలిచే బిల్డింగ్ బ్లాక్‌లుగా ఉపయోగించవచ్చు. మన శరీరంలోని ప్రతి కణం, కణజాలానికి ప్రోటీన్ చాలా అవసరం. మానవుని చర్మ నిర్మాణం కొల్లాజెన్, కెరాటిన్ ప్రోటీన్లతో రూపొందించబడింది. అందువల్ల, ఆరోగ్యకరమైన చర్మానికి నాణ్యమైన ప్రోటీన్లు అవసరమని గుర్తించుకోండి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే ఈ క్రింది ఆహారాన్ని తీసుకోండి.

గుడ్లు
గుడ్లలో నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో సల్ఫర్, లుటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా అధిక తేమలో చర్మాన్ని రక్షించడానికి ఇవి సహాయపడతాయి.

సోయా
ఇది శాఖాహారపు ఆహారం. ఇది గరిష్ట మొత్తంలో ప్రోటీన్లను అందిస్తుంది. అంతేకాక, ఇది కొల్లాజెన్‌ను సంరక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మంపై ఏర్పడే ముడుతలను నివారిస్తుంది.

పాలు, పెరుగు
పాలు, పెరుగు మీ రోజువారీ ఆహారంలో నాణ్యమైన ప్రోటీన్లను చేర్చుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శుభ్రమైన గట్, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. పాలు లేదా పెరుగుతో ఫేస్ ప్యాక్‌ చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారువుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉంటే చిన్నచిన్న రంధ్రాలను మూసివేయడంలో, ముడతలు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మీ చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.

విటమిన్ సి..
చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది మన శరీరానికి బలమైన యాంటీఆక్సిడెంట్లను అందించడంలో సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాక, ఇవి రీహైడ్రేషన్కు బాగా పనిచేస్తాయి.

టమాట
టమాటల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది . ఇవి లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాక, వృద్ధాప్యం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. వీటితో ఫేస్ ప్యాక్ చేసుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది.

గువాస్
ఇవి కాలానుగుణంగా లభిస్తాయి. వీటిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. గువాస్లో ఇనుము కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి రక్తహీనత నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

విటమిన్ ఎ..
చర్మం పై పొరలను కాపాడుకోవడానికి విటమిన్ ఎ ఎంతో అవసరం. సూర్యుడి హానికరమైన ప్రభావాల కారణంగా కొల్లాజెన్ విచ్ఛిన్నం ఆపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జుట్టులోని ఫోలికల్స్ చుట్టూ, చర్మంలోని ఆయిల్ గ్రంథులకు సహాయకారిగా నిలుస్తుంది. అంతేకాక, ఇది ఫైబ్రోబ్లాస్ట్స్- కణాల ఉత్పత్తిని ప్రేరేపించి, కణజాలాలను అభివృద్ధి చేస్తుంది.

క్యారెట్లు
క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఈ రెండు విటమిన్లు ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేసి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడతాయి. అంతేకాక, వృద్ధాప్యాన్ని నివారిస్తాయి,

స్వీట్ పొటాటో
వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఈ శీతాకాలంలో బంగాళదుంపలు గల ఆహారాన్ని తీసుకుంటే అది మీ చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది.

ఆకుకూరలు
కూరగాయల్లో విటమిన్ ఎతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇవి అధిక యాంటీఆక్సిడెంట్ లెవల్ను కలిగి ఉంటాయి. కాబట్టి, అధిక కేలరీలు ఉండే ఈ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతం అవుతుంది.

నీరు
ఆరోగ్యకరమైన ముడతలు లేని, మెరుస్తున్న చర్మానికి నీరు త్రాగడం చాలా ముఖ్యమైనది. మన శరీరం ఉత్తేజంగా పనిచేయడానికి నీరు ఎంతో కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి, చర్మం హైడ్రేట్ చేయడానికి తగినన్ని నీరు త్రాగాలి. ఇది పొడిబారిన చర్మాన్ని నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.

గ్రీన్ టీ
మెరుస్తున్న చర్మం కోసం గ్రీన్ టీ తీసుకోవడం చాలా మంచి పద్ధతి. ఇది మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను జోడిస్తుంది. ఇవి దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడానికి, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది.

వెజిటెబుల్ సూప్
తాజా కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పూర్తి ప్రయోజనాలను పొందాలంటే సూప్‌లను ఆశ్రయించండి. ఆరోగ్యకరమైన ఆహారం అనేది మీ చర్మానికి అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది., కాబట్టి మీ కలల చర్మం పొందడానికి క్రమం తప్పకుండా వీటిని తీసుకోండి.
Published by:Kishore Akkaladevi
First published: