Yoga for kids: మీ పిల్లలు హైట్‌ పెరగటానికి ఈ యోగా టిప్స్‌!

ప్రతీకాత్మక చిత్రం

Yoga for kids height: పిల్లలకి ఉత్సాహాన్ని, ఎత్తు పెంచే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. దీనివల్ల మీ పిల్లలు పెరగడమే కాకుండా మెదడు కూడా వేగంగా పని చేసి శరీరం దృఢంగా ఉంటుంది. 

  • Share this:
సాధారణంగా పిల్లలు పెరిగే వరకు తల్లిదండ్రుల (parents) దృష్టి వారి ఆరోగ్యంపైనే ఉంటుంది.
వయస్సు పెరిగే కొద్ది ఎత్తు పెరగనప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతుంది. కానీ, ఇక మీ పిల్లలు (kids) హైట్‌ (height) పెరగడం లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈరోజు మనం పిల్లలకి ఉత్సాహాన్ని, ఎత్తు పెంచే కొన్ని యోగా ఆసనాలు ఉన్నాయి. దీనివల్ల మీ పిల్లలు పెరగడమే కాకుండా మెదడు కూడా వేగంగా పని చేసి శరీరం దృఢంగా ఉంటుంది. చాలా మంది తల్లులు పిల్లలు ఏడవగానే (crying) వారికీ చిరు తిండి పెడుతుంటారు. అంతేకాదు.. ఇక వాళ్ళు ఏది అడిగితే అది కొనిపించి తినిపిస్తూ ఉంటారు. అయితే పిల్లలకు చిన్నప్పుడు తినిపించే పదార్థాల వల్లే పెద్దయిన తరువాత వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు బలవర్ధక ఆహారం పెడితే భవిష్యత్తు బాగుంటుందని సూచిస్తున్నారు.

విల్లు మాదిరి..
వెళ్లాకి లా పడుకుని మీ శరీర బరువు కేవలం కడుపు భాగంలో వేయాలి. ఇప్పుడు అరచేతులతో మడమలను పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ కాళ్లు, చేతులను వీలైనంత ఎత్తుకు ఎత్తండి.

ఇది కూడా చదవండి:  ఈ చిట్కాతో 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

పాదహస్తాసనం...
ముందుగా నిటారుగా నిల్చుని నెమ్మదిగా శ్వాస వదులుతూ శరీరం పైభాగాన్ని నడుము కిందికి తీసుకురావాలి. చేతుల వేళ్లతో పాదాలను పట్టుకోవాలి. దీంతో మీ ముక్కు, తల మోకాళి భాగానికి వస్తుంది.

తాడాసనం..
తారసనం చేయడానికి ముందుగా పిల్లలను నిటారుగా నిలబడమని చెప్పాలి. ఆ తర్వాత రెండు కాళ్లను కలిపి దగ్గరగా పెట్టుకుని నుంచున్నాక.. రెండు చేతులను సాధ్యమైనంత పైకి స్ట్రెచ్‌ చేయమని చెప్పాలి.

ఇది కూడా చదవండి:  స్క్రీన్‌ వర్క్‌ ఎక్కువై.. మెడనొప్పి వస్తోందా? ఇలా ఈజీగా..!

వృక్షాసనం..
ఈ ఆసనం చేయడానికి కుడి పాదాన్ని, ఎడమ పాదం తొడలపై ఉంచి శరీరం మొత్తం నిటారుగా ఉండాలి. చేతులు తలపైన సూర్య నమస్కారం చేస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఈ ఆసనం ఎత్తును పెంచడానికి సహాయపడుతుంది. కానీ, అదే సమయంలో మీ పిల్లల ఆహారంపై కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. పిల్లల ఆహారం, డ్రింక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వారికి ఆడుకునేందుకు అవకాశం ఇవ్వాలి.

పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపండి. వారితో మీకు కాసేపు సమయం గడపండి. ఇది పిల్లలకు శారీరకంగా బలంగా, వారి శరీర అభివృద్ధికి దోహదం చేస్తుంది. పిల్లల కోసం ఈ ఆసనాలన్నీ వేయించే ముందు వైద్యుడి వద్ద కూడా కొన్ని సలహాలు తీసుకోవాలి.లేకపోతే యోగా టీచర్‌తో ఆసనాలు నేర్పించిన సరిపోతుంది.
Published by:Renuka Godugu
First published: