హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Face Washing: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదని అర్థం..!

Face Washing: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం లేదని అర్థం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే క్లెన్సర్ వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అందువల్ల ముఖంపై పేరుకునే మురికి, ధూళి కణాలను వదిలించుకోవాలి. కొన్నిసార్లు పనుల్లో పడి చర్మ సంరక్షణపై చాలామంది దృష్టిపెట్టరు. ఈ లక్షణాలు కనిపిస్తే మీరు ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోనట్టే..

ఇంకా చదవండి ...

ముఖ చర్మం సంరక్షణ సరిగ్గా లేకపోతే అందంగా కనిపించరు. వ్యక్తిగత పరిశుభ్రతలో చర్మ సంరక్షణ కూడా ఒక భాగం. అందానికి మెరుగులు దిద్దుకునే ముందు చర్మ ఆరోగ్యాన్ని సరిచూసుకోవాలి. చర్మ తత్వాన్ని బట్టి కొన్ని రకాల క్లెన్సర్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. క్లెన్సింగ్ వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. దీనివల్ల చర్మంపై పేరుకునే అదనపు నూనెలు తొలగిపోతాయి. జిడ్డు చర్మ తత్వం ఉన్నవారు తరచుగా క్లెన్సింగ్ చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే క్లెన్సర్ వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అందువల్ల ముఖంపై పేరుకునే మురికి, ధూళి కణాలను వదిలించుకోవాలి. కొన్నిసార్లు పనుల్లో పడి చర్మ సంరక్షణపై చాలామంది దృష్టిపెట్టరు. ఇలాంటప్పుడు చర్మం నిగారింపును కోల్పోయి డల్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని కొన్ని సూచనల ద్వారా గుర్తించవచ్చు.

మేకప్ అవశేషాలు

ఈ రోజుల్లో మేకప్ సాధారణ విషయమైంది. ముఖానికి వేసుకున్న మేకప్ పూర్తిగా తొలగించుకోకపోతే ఎన్నో దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ముఖం కడిగిన తరువాత కాటన్ ప్యాడ్, టోనర్ సాయంతో చర్మంపై తుడవాలి. ఒకవేళ చర్మంపై ఫౌండేషన్ అవశేషాలు ఉంటే, ముఖం సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని అర్థం. మేకప్‌ను పూర్తిగా తొలగించడానికి ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ లేదా బామ్‌లను ఉపయోగించాలి. ఆ తరువాత మృదువైన క్లెన్సర్ వాడాలి. లేదంటే ముఖంపై పోగుపడే మేకప్ అవశేషాలు చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల చర్మం నల్లగా, డల్‌గా అనిపిస్తుంది.

నిగారింపు కోల్పోవడం

కొంతమంది రోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్నా సరే.. చర్మం పొడిగా, నిస్తేజంగా కనిపిస్తుంది. ఇలాంటి సమస్య ఉన్నవారు సరైన క్లెన్సర్‌ను ఉపయోగించలేదని అర్థం. మృత కణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. ఇలాంటప్పుడు ఎక్స్ ఫోలియేటింగ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించాలి.

మేకప్ చర్మంపై నిలవకపోవడం

మేకప్ ఉత్పత్తులు చర్మంపై సరిగ్గా అతుక్కోకుండా, మేకప్ ఊడిపోతుంటే.. ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని భావించాలి. మేకప్‌ వేసుకోవడానికి ముందు చర్మంపై పేరుకుపోయే మురికిని వదిలించుకోవాలి. లేదంటే ఇది చర్మానికి, మేకప్‌కు మధ్య ఒక అడ్డుపొరగా మారుతుంది. ఈ సమస్య ఎదురైతే నాణ్యమైన క్లెన్సర్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

పొడిబారడం, జిడ్డుగా ఉండటం

ముఖ చర్మం మరీ జిడ్డుగా లేదా పొడిబారినట్టు కనిపిస్తే, ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవట్లేదని భావించాలి. ఒక్కొక్కరి చర్మం ఒక్కోలా ఉంటుంది. అందువల్ల చర్మ తత్వాన్ని బట్టి క్లెన్సర్‌ను ఎంచుకోవాలి. చర్మం పొడిగా ఉంటే మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌ వాడాలి. మామూలు క్లెన్సర్లు వీరి ముఖ చర్మంపై సెబమ్ ఉత్పత్తిని తగ్గించి మరింత పొడిబారుస్తాయి. ఆయిల్ స్కిన్ ఉండేవారు చర్మంపై అదనంగా పేరుకుపోయే నూనెలను శుభ్రం చేసే క్లెన్సర్‌ని ఎంచుకోవాలి.

దురద, దద్దుర్లు

అదేపనిగా ఎక్కువసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. క్లెన్సర్‌ని ఎక్కువగా అప్లై చేయడం వల్ల ఇలాంటి దుష్ర్పభావాలు కనిపిస్తాయి. ముఖ చర్మంపై దురద, దద్దుర్లు వంటివి కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Published by:Hasaan Kandula
First published:

Tags: Ayurveda health tips, Ayurvedic tips for healthy life, Health benifits, Health secrets

ఉత్తమ కథలు