THESE ITALIAN GROWN PUMPKIN WEIGHTS 1226 KG AND BREAKS WORLD RECORD RNK
Giant pumpkin: భలే..భలే.. భారీ గుమ్మడికాయ.. బరువు 1,226 కేజీలు!
Italian grown pumpkin weights 1226 kg
Giant pumpkin: గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ గుమ్మడి కాయ బరువు 17.5 వయోజన పురుషులు, ఒక చిన్న కారు వెయిట్ కంటే బరువుగా ఉంటుంది.
సాధారణంగా కుకింగ్ ఆర్ట్ అయితే, కూరగాయలను (vegetables) పెంచడం సైన్స్ అంటారు. దీనికి సరైన ఎరువులు, ఉష్ణోగ్రత నియంత్రణ, సమతూల్య నీరు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2021 మార్చిలో కెనడా (canada) లోని క్యూబెక్కు చెందిన క్యాబినెట్ మేకర్ డామియన్ అల్లార్డ్ మూడు భారీ వెయిట్ ఉన్న టర్నిప్ (turnip) లను పెంచారు. ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన టర్నిప్గా రికార్డును బద్దలు కొట్టింది. అత్యధికంగా కూరగాయలు పండించి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన అదే లీగ్లో ఓ ఇటాలియన్ రైతు 1,226 కేజీల బరువున్న ‘మాన్స్టర్ గుమ్మడికాయ’ని పెంచాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness world record-GWR) ప్రకారం ఇది అన్ని ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ గుమ్మడి కాయ బరువు 17.5 వయోజన పురుషులు, ఒక చిన్న కారు వెయిట్ కంటే బరువుగా ఉంటుంది. ఈ భారీ గుమ్మడికాయను టుస్కానీకి చెందిన రైతు స్టెఫానో కుట్రుపి పెంచారు. ఆసక్తికరంగా స్టెఫానో 2008 నుంచి పెద్ద గుమ్మడికాయలను పెంచుతున్నారు. 2021 సెప్టెంబర్ 26న గుమ్మడికాయను పెకియోలీలో జరిగిన కాంపియోనాటో డెల్టా జుకోన్ గుమ్మడికాయ పండుగ 10వ ఎడిషన్లో ప్రదర్శించారు. గ్రేట్ గుమ్మడి కాయ కామన్వెల్త్ ప్రతినిధులు అంచనా వేశారు. ఉత్పత్తుల నాణ్యత పోటీలో ప్రవేశించడానికి సరిపోతుందని ధ్రువీకరించారు.
అతడి మాదిరి రికార్డు సాధించాలని చూస్తున్న ఇతరులకు ఏదైనా టిప్స్, సీక్రెట్స్ అందించగలరా అని అడిగినపుడు ‘ఏ రహస్యాలు లేవు, ఏ రంగాల్లో అయినా పద్ధతి పట్టుదలతో లక్ష్యాన్ని సాధించగలరన్నారు.
ఈ ప్రక్రియను వివరిస్తూ.. మే మధ్యలో సూర్యుడు అట్లాంటిక్ జెయింట్ మొక్కల ఆకులను కాల్చడం ప్రారంభించాడు. జూన్ మధ్య నుంచి ఆగస్టు మధ్య వరకు సాధారణ ఉష్ణోగ్రతలు 33, 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండేవి. అంకురోత్పత్తి నుంచి పంట వరకు వాతావరణ నియంత్రణ ఒక కీలకమైన అంశం.
మొక్కలు తమను తాము ఉత్తమంగా అవసరమైనప్పుడు వేడి అందించడం.. చల్లబరచడం, షేడింగ్, పొగమంచుచ నీరు పోయడం దాణా వంటివి ముఖ్యం అన్నారు. గిన్నిస్ వెబ్సైట్ ప్రకారం లో జుకోన్ పోటీలో స్టెఫానో రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మరో రెండు ఎంట్రీలు వరుసగా 978.99 కిలోలు, 794.51 కేజీల బరువుతో ఉన్నాయి.
Published by:Renuka Godugu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.