మనమందరం ఇంటి వెలుపల కాలుష్యం (pollution) పెరుగుతుందని ఇంట్లో సురక్షితంగా ఉన్నామని భావిస్తాము. కానీ అది అలా కాదు. ఇంటి లోపల కూడా కాలుష్యం ఉంటుంది. బయట కాలుష్యం కంటే ఇది చాలా ప్రమాదకరం. అయితే ఇండోర్ ప్లాంట్లు (Indoor plants) ఈ కాలుష్యాన్ని తగ్గించగలవని మీకు తెలుసా? ఇటీవలి అధ్యయనంలో, ఇంటి లోపల మొక్కలు నాటితే, ఇండోర్ కాలుష్యాన్ని 20 శాతం తగ్గించవచ్చని పేర్కొన్నారు.
బ్రిటన్లోని బర్మింగ్హామ్ యూనివర్సిటీ పరిశోధకుల నేతృత్వంలో దీనిపై అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనంలో ఇంటి అందాన్ని పెంచడానికి చాలా మంది మొక్కలు నాటుతారని, అయితే అవి ఇండోర్ కాలుష్యాన్ని కూడా తొలగించగలవని వారికి తెలియదు అన్నారు. పరిశోధకులు తమ అధ్యయనంలో పీస్ లిల్లీ, ఫెర్న్ అరమ్ అనే మొక్కలను చేర్చారు. ఈ మొక్కలను అత్యంత రద్దీగా ఉండే రోడ్డు పక్కన ఉన్న కార్యాలయంలో ఉంచారు. ప్రతిరోజూ పర్యవేక్షించారు. ప్లాంట్లు కార్యాలయం లోపల నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించగలవని కనుగొన్నారు.
నైట్రోజన్ హైడ్రాక్సైడ్ను తొలగించగల సామర్థ్యం సమానంగా ఉంటుంది..
పరిశోధనల్లో వారు ఎంచుకున్న మొక్కలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని డాక్టర్ క్రిస్టియన్ పిఫ్రాంగ్ చెప్పారు. అయినప్పటికీ, మొక్కలన్నీ కార్యాలయ వాతావరణాన్ని చక్కదిద్దగలిగాయి. కార్యాలయంలో ఉన్న నైట్రోజన్ డయాక్సైడ్ను తొలగించే సామర్థ్యాన్ని మొక్కలు కలిగి ఉన్నాయి. నిజానికి ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వెలువడే గ్యాస్, వంట చేసే సమయంలో వెలువడే పొగ కారణంగా ఇంట్లోని గాలి నాణ్యత కూడా దెబ్బతీస్తాయి. .
ఈ మొక్కలు కాలుష్యాన్ని (Pollution) నివారించడంలో అత్యంత ప్రభావవంతమైనవి
నిపుణుల అభిప్రాయం ప్రకారం, పీపల్, మర్రి, జామున్, వేప, హర్సింగర్, అశోక, అర్జున, మహువా, గన్నేరు మొదలైన సాంప్రదాయ చెట్లు కాలుష్యాన్ని తట్టుకోగలవు. ఈ మొక్కలను రోడ్ల వెంబడి ,నివాస ప్రాంతాలలో నాటాలి, అవి దుమ్ము సూక్ష్మ కణాలను గ్రహిస్తాయి. ఈ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి, కాలుష్యాన్ని చాలా వరకు నివారిస్తాయి.
ఇంటి లోపల ఈ మొక్కలను నాటడం ద్వారా కాలుష్యం తొలగిపోతుంది
-bamboo palm
-పీస్ లిల్లీ (peace lily)
-gerbera daisy
-snake plant
-areca palm
-spider plant
(Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air Pollution, Oxygen generation plant, Oxygen plants, Uk