Home /News /life-style /

Migraine headache: మైగ్రేన్ సమస్య ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినకూడదు..

Migraine headache: మైగ్రేన్ సమస్య ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినకూడదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూరో స్పెషలిస్ట్స్‌ మైగ్రేన్‌ ఒకరకమైన తలనొప్పి ..అది నరాల రుగ్మత అని పరిగణించారు. ఇది తీవ్రంగా ఉంటుందన్నారు. తలనొప్పి వచ్చే ఒకటి రెండు రోజుల ముందు నుంచే మైగ్రేయిన్‌ స్టార్ట్‌ అవుతుందట. దీన్నే ప్రోడ్రోమ్‌ అంటారు.

మైగ్రేన్‌( migraine)  రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు విపరీతమైన తలనొప్పి కారణంగా వాంతులు, మైకం, డిజీనెస్‌కు దారితీస్తుంది. అయితే, మీరు ఒకవేళ చాలారోజుల నుంచి మైగ్రేన్‌తో బాధపడుతున్నవారైతే. కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే ఏమవుతుందో తెలుసా ? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూరో స్పెషలిస్ట్స్‌ మైగ్రేన్‌ ఒకరకమైన తలనొప్పి ..అది నరాల రుగ్మత అని పరిగణించారు. ఇది తీవ్రంగా ఉంటుందన్నారు. తలనొప్పి వచ్చే ఒకటి రెండు రోజుల ముందు నుంచే మైగ్రేయిన్‌ స్టార్ట్‌ అవుతుందట. దీన్నే ప్రోడ్రోమ్‌ అంటారు. దీంతో తక్కువ శక్తి,డిప్రెషన్, అలసట, హైపర్‌ యాక్టివిటీ, చిరాకు వంటివి ఉంటాయి. తీవ్రమైన నొప్పి లేదా పల్సేటింగ్‌ సెన్సేషన్‌తో తలనొప్పి ఉంటుంది. ఈ నొప్పి తలకు ఒకవైపు మాత్రమే ఉంటుంది.దీంతో పాటు వికారం లేదా వాంతులు ఫోటోఫోబియా, సౌండ్‌ఫోబియా వంటివి ఉంటాయి. కానీ, కొన్ని రకాల ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల నొప్పి పెరుగుతుందని ఆ సమయంలో తినకూడని ఫుడ్స్‌ ఏంటో చూద్దాం.

ఇది కూడా చదవండి:  క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ముందుగానే ఎందుకు ప్రారంభిస్తారో తెలుసా?


చాకొలేట్స్‌...
చాకొలేట్స్‌ మైగ్రెన్‌ సాధారణ కారణం. అమెరికన్‌ మైగ్రేన్‌ ఫౌండేషన్‌ ఒక అ«ధ్యయనం ప్రకారం చాకొలెట్లు తినేవారికి 22 శాతం మైగ్రేన్‌ ప్రభావితం చేస్తుంది.

కెఫైన్‌..
ఎక్కువ కెఫైన్‌ ఫుడ్‌ తీసుకుంటే కూడా మైగ్రేన్‌ వచ్చే అవకాశం ఉంటుందట. అంటే, చాక్లెట్, కాఫీ,టీలలో కెఫీన్‌ ఎక్కువగా ఉంటుంది. కానీ, వీటిని చాలా తక్కువ పరిమాణంలో తీసుకుటే ఏ బాధ ఉండదు.
ఒక అధ్యయనం ప్రకారం మైగ్రేన్‌ అటాక్‌ 35 శాతం ఆల్కహాల్‌ కారణం.

ఇది కూడా చదవండి: మహిళల ఆరోగ్యవంతమైన గుండెకు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి


అస్పర్టేమ్‌..
అస్పర్టేమ్‌ (aspartame) (కృత్రిమ చక్కెర) అంటే ప్రాసెస్‌ చేసిన ఆహార పదార్థాల్లో ఎక్కువ శాతం స్వీట్‌ ఉంటుంది. ఈ అస్పర్టేమ్‌ మైగ్రేన్‌కు ప్రధాన కారణం.

మోనోసోడియం గ్లూటమేట్‌ (ఎంఎస్‌జీ) ఉన్న ఆహార పదార్థాలు అంటే ఏంటో తెలుసా? ఇది గ్లూటమిక్‌ యాసిడ్‌కు సంబంధించిన సోడియం సాల్ట్‌. దీన్ని ఆహారాలలో సంకలితం చేసి కూడా ఉంటుంది. ఇటువంటి ఫుడ్‌ తినడం వల్ల కూడా మైగ్రేన్‌కు దారితీస్తుందని అమెరికన్‌ మైగ్రేన్‌ ఫౌండేషన్‌ తెలిపింది.

మాంసం..
రంగు, రుచిని కాపాడే నైట్రేట్లు (క్యూర్డ్‌ మీట్‌) మాంసం హామ్, హాట్‌ డాగ్, సాసేజెస్, డెలీ మీట్స్‌లో ఉంటాయి. ఈ ఫుడ్‌ రక్తంలోకి నైట్రిక్‌ ఆక్సైడ్‌లను విడుదల చేస్తాయి. దీంతో మెదడులోని రక్తనాళాలు వ్యాకోచిస్తాయని హెల్త్‌లైన్‌ తెలిపింది. చీజ్‌ లేదా టైరామైన్‌ కూడా మైగ్రేన్‌కు కారణమని.. దీన్ని పులియబెట్టడం లేదా స్టోర్‌ చేసిన జున్ను, సోయాసాస్‌లలో కనిపిస్తుందట.
Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు