Home /News /life-style /

THESE FOODS EFFECTS YOUR SLEEP IN OVERNIGHT RNK

Sleep: బంగారు నిద్రకు.. భంగం కలిగించే ఫుడ్ ఏదో తెలుసా? జాగ్రత్తపడండి మరి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Food in dinner time: రాత్రిపూట త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీంతో యాసిడ్ రీఫ్లక్స్, కడుపునొప్పి, గ్యాస్ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో మీ నిద్రకు కూడా ఏ భంగం వాటిల్లదు.

‘Breakfast like a king, lunch like a prince and dinner like a pauper’ అని పెద్దవాళ్లు చెబుతారు. అన్ని సరైనా సమయానికి తీసుకుంటే హెల్తీగా ఉంటాం. సరైన డైట్ (Diet) కూడా పాటించాలి. కానీ, మనం వీటిని పాటిస్తున్నామా? రాత్రి త్వరగా, లైట్ ఫుడ్ (Light food)  తీసుకోవాలని మనందరికీ తెలిసిన విషయమే.. కానీ, ఇది మన నిద్రపై ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? అవును.. న్యూట్రిషనిస్టులు (Nuitrionist) దీనిపై మనకు ఏం సూచిస్తున్నారో.. మన బంగారు నిద్రకు భంగం కలిగించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుని నడుచుకుందాం.

నిద్రపై ప్రభావం చూపే ఫుడ్స్..
సాధారణంగా మన జీర్ణవ్యవస్థపై వివిధ రకాల ఫుడ్స్ వాటి నేచర్ ను బట్టి ప్రభావం చూపుతాయి. అందులో పేగు ఆరోగ్యం, బరువు, నిద్ర కూడా ఉంటుంది. డిన్నర్ అనేది మనం పడుకునే ముందు తీసుకుంటాం. రాత్రంతా 8 గంటలు ఏ ఫుడ్ లేకుండా ఉండాల్సి వస్తుంది. అందుకే రాత్రి ఫుడ్ స్కిప్ చేయకూడదు. మీరు పడుకున్నప్పుడు జీర్ణక్రియ జరుగుతుంది.

అందుకే ఆ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. దీంతో యాసిడ్ రీఫ్లక్స్, కడుపునొప్పి, గ్యాస్ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో మీ నిద్రకు కూడా ఏ భంగం వాటిల్లదు.

హై ఫ్యాట్ ఫుడ్స్..
మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. డిన్నర్ సమయంలో హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే నైట్ మనం తీసుకునే ఫుడ్ మెటబాలీజం రేటు తక్కువగా ఉంటుంది. దీంతో అది జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. అది తిరిగి ఫ్యాట్ గా జమ అయిపోతుంది. బరువు పెరుగుతారు. అంతేకాదు, మీరు రాత్రి నిద్ర సరిగ్గా పట్టకుండా ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. దీంతో మీరు నిత్ర కూడా పోలేరు.

ఇది కూడా చదవండి:  సింగిల్ అయ్యారని బాధపడకండి.. మీకున్న ప్రయోజనాలు తెలుసుకోండి..


హై షుగర్ ఫుడ్స్..
డిన్నర్ లో స్వీట్ ఐటెం లేకుండా ఊహించుకోలేం. కానీ, మీరు నమ్మరు.. షుగరీ, స్టార్చీ ఫుడ్ డిన్నర్ లో తీసుకోవడం వల్ల మీ షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరిగిపోతుంది. దీంతో ఇన్సూలిన్ సమతుల్యతలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది డయాబెటీస్ తో ఉన్నవారికి ప్రాణాంతకం. స్టార్చీ ఫుడ్ ను కూడా రాత్రి తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే ఈ స్టార్చ్ షుగర్ లా మార్పు చెందుతుంది. మళ్లీ జీవక్రియ కూడా చాలా సమయం పడుతుంది.

డీప్ ఫ్రైడ్ ఫుడ్..
సాధారణంగా మనందరికీ ఫ్రైడ్ ఫుడ్ చాలా ఇష్టం. కానీ, దీన్ని డిన్నర్ సమయంలో తీసుకోకండి. ఇందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, హై ప్రోటీన్, ఉప్పు కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. దీంతో జీర్ణం అవ్వడానికి కూడా అధిక సమయం పడుతుంది. అందుకే మీకు ఎంతో ఇష్టమైన ఫ్రైడ్, ఫెవరేట్ ఫుడ్ సాయంత్రంలోపు తినేయండి. ఎందుకంటే అది జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి:  జాగ్రత్త.. ఈ క్యాలండర్ మీ ఇంట్లో ఉంటే.. ఆ ఏడాది మొత్తం అశుభమే..!


స్పైసీ ఫుడ్..
స్పైసీ ఫుడ్ ను రాత్రి సమయంలోనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. డిన్నర్ లో స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండెమంట, యాసిడ్ రీఫ్లక్స్ సమస్యలు వస్తాయి.

హై ప్రోటీన్..
మనం ఆరోగ్యంగా ఉండటానికి రోజంతా సమతుల్య భోజనం తీసుకోవాలి. కానీ, హై ప్రోటీన్ ఫుడ్ డిన్నర్లో మాత్రమే తీసుకోకండి. ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కడుపులో రాత్రంతా అసాధారణంగా ఉంటుంది. నిద్ర లేకుండా పోతుంది.
Published by:Renuka Godugu
First published:

Tags: Sleep tips, Sleeping

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు