Health Tips : బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ అస్సలు వద్దు..ఈ సమస్యలు వస్తాయి..

చాలామంది బ్రెడ్‌ని ఎంతో ఇష్టంగా తింటారు. త్వరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌లలో బ్రెడ్ రెసిపీస్ ముందుంటాయి. అందుకే వీటిని ప్రిఫర్ చేస్తారు. కానీ, ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తేలింది.

Amala Ravula | news18-telugu
Updated: September 19, 2020, 7:30 AM IST
Health Tips : బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ అస్సలు వద్దు..ఈ సమస్యలు వస్తాయి..
బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ వద్దు..
  • Share this:
బ్రెడ్.. ఈ మాట వినగానే కొంతమంది పేషెంట్స్ తినే తిండి అంటే.. మరికొంతమంది బ్రెడ్‌ని ఎన్నిరకాలుగానైనా చేసుకుని తినొచ్చని సంతోషపడతారు. అయితే, ఏది ఏమైనా త్వరగా తయారయ్యే రెసిపీస్‌లో బ్రెడ్ వంటకాలు ముందుంటాయి. అందుకే క్షణం తీరిక లేని మహిళలు ఉదయాన్నే దీంతో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బ్రెడ్ రెసిపీస్‌ని ఉదయాన్నే తీసుకోవడం మంచిది కాదంటున్నారు. నిపుణులు.. దీని వల్ల అసిడిటీ సమస్యలు రావడమే కాకుండా.. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు.

దీనికి కారణం లేకపోలేదు. బ్రెడ్‌లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మెదడు‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.కాబట్టి ఉదయాన్నే బ్రెడ్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుందని.. ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో తప్పకుండా తీసుకోవాలంటే మాత్రం.. ఇది తీసుకున్న వెంటనే పండ్లు తీసుకుంటే సరి అని చెబుతున్నారు. అయితే.. అది కూడా రెగ్యులర్ వద్దని చెబుతున్నారు.
Published by: Amala Ravula
First published: September 19, 2020, 7:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading