Home /News /life-style /

THESE FOOD ITEMS WILL IMPROVE MENS SPERM COUNT AND QUALITY HSN

Sperm Quality: పెళ్లికి రెడీ అవుతున్న కుర్రాళ్లూ.. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సంసార జీవితం స్మాష్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ తరం కుర్రాళ్లు శృంగారంపైన ఎక్కువ ధ్యాస పెడుతున్నారు కానీ, ఆ పురుషుడిని పరిపూర్ణ మగాడిగా మార్చే ‘వీర్యం నాణ్యత’ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే ఎక్కడ చూసినా గైనకాలజిస్ట్ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. పెళ్లికి ముందే వీర్యనాణ్యతలో కింగ్ అనిపించుకుంటే పెళ్లి తర్వాత ఇక్కట్లను ఎదుర్కొనే ముప్పు తప్పుతుంది.

ఇంకా చదవండి ...
  పెళ్లయి మూడు నెలలు గడిచిందో లేదో, బంధువులు, స్నేహితులు ‘ఏమైనా విశేషమా’ అని అడుగుతుంటారు. విశేషం ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ఇబ్బందేమీ లేదు. కానీ భార్య గర్భవతి కాలేదన్న విషయాన్ని వాళ్లకు నేరుగా చెప్పలేక, వారి ప్రశ్నలకు సమాధానమివ్వలేక మగాడు సతమతమవుతుంటాడు. ఏదో ఒకటి చెప్పి టాపిక్ మార్చేస్తుంటాడు. మరికొద్ది నెలలు గడిచాక ఏదైనా ఆసుపత్రిలో చూపించుకోకపోయారా? అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. ‘డాక్టర్ దగ్గరకు వెళ్తే మీ భార్యలో ఏ లోపం లేదు. మీ లోనే లోపం’ అని డాక్టర్ చెబితే చాలు మగాడి మనసు కకావికలం అయిపోతుంది. ‘నేను శృంగారంలో బాగానే యాక్టివ్ గా ఉన్నాను కదా. ఎక్కువ టైమ్ పాల్గొంటున్నాను. భార్య కూడా ఎప్పుడూ ఏమీ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఈ డాక్టర్ ఏదో తేడాగా ఉన్నాడు. వేరే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే.’ అని సగటు మగాడు అనుకుంటుంటాడు.

  గర్భం దాల్చడానికి పైన చెప్పుకున్న కారణాలే సరిపోవు. ఉదాహరణకు మీరు ఇల్లు కడుతున్నారనుకోండి. సిమెంట్, ఇటుకలు, ఇసుక, కంకర, ఇనుము, వంటివి అన్నీ క్వాలిటీగా ఉండాలని కోరుకుంటుంటారు. అవన్నీ క్వాలిటీగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది. ఇల్లు కట్టే మేస్త్రి నిపుణుడు అయినా ముడి పదార్థాలు క్వాలిటీగా లేకుంటే ఇల్లు కలకాలం నిలవదు. మగాడి వీర్యం కూడా ఈ ముడి పదార్థం లాంటిదే. పురుషుల వీర్యం క్వాలిటీగా ఉంటేనే గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది. లేకుంటే ఎంత కాలం శృంగారంలో పాల్గొన్నా గర్భం మాత్రం రాదు. ఈ తరం కుర్రాళ్లు శృంగారంపైన ఎక్కువ ధ్యాస పెడుతున్నారు కానీ, ఆ పురుషుడిని పరిపూర్ణ మగాడిగా మార్చే ‘వీర్యం నాణ్యత’ గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే ఎక్కడ చూసినా గైనకాలజిస్ట్ సెంటర్లు, ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. పెళ్లికి ముందే వీర్యనాణ్యతలో కింగ్ అనిపించుకుంటే పెళ్లి తర్వాత ఇక్కట్లను ఎదుర్కొనే ముప్పు తప్పుతుంది.

  కొత్తగా పెళ్లయిన ఓ జంట ఓ ఏడాది పాటు సంసార జీవితాన్ని గడిపినా కూడా భార్య గర్భం దాల్చకపోతే ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే గైనకాలజిస్ట్ ను కలవాలి. అక్కడ ఇద్దరికీ టెస్టులు చేస్తారు. పురుషుడికి సంబంధించి స్మెర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ల నుంచి 200 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉండాలి. ఆ స్థాయిలో కౌంట్ ఉంటేనే ఆ వీర్యం గర్భం దాల్చడానికి పనికొస్తుంది. లేకుంటే డాక్టర్ చెప్పే సూచనలు, సలహాలు పాటించాలి. అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా ఇస్తారు. పెళ్లయ్యాక ఈ సమస్యను ఎదుర్కోవడం కంటే పెళ్లికి ముందే కుర్రాళ్లు స్మెర్మ్ కౌంట్ లోనూ కింగ్‌లనిపించుకోవడమే ఉత్తమం. దానికి చేయాల్సిందల్లా కొన్ని కొన్ని ఆహార పదార్థాలను వాడటం మొదలుపెడితే చాలు. వీర్య నాణ్యతను వాటంతట అవే వృద్ధి చేస్తాయి. మరి పురుషుల వీర్య నాణ్యతను పెంచే ఆ ఆహార పదార్థాల లిస్ట్ ఏంటో ఓ లుక్కేద్దామా..?

  బచ్చలి కూర: చాలా మంది పురుషులకు ఆకుకూరలు తినడం ఇష్టం ఉండదు. కానీ ఆకుకూరలు మగాళ్లకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా బచ్చలి కూరలో ఉండే ఫోలిక్ యాసిడ్ పురుషుల స్పెర్మ్ క్వాలిటీని సంరక్షించడంలో దోహదం చేస్తాయి. వారానికి రెండు సార్లయినా బచ్చలికూరను ఏదో ఒకరూపంలో తీసుకోవడం ఉత్తమం.

  గుమ్మడికాయ గింజలు: గుమ్మడి కాయ కూరను తినాలంటేనే కుర్రాళ్లు ఆమడదూరం వెళ్లిపోతారు. అయితే గుమ్మడికాయ గింజల్లోని రహస్యం గురించి తెలిస్తే మాత్రం కుర్రాళ్లు కాస్త కష్టమైనా దాన్ని తినేందుకు మొగ్గుచూపుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. గుమ్మడికాయ గింజల్లోని విటమిన్స్, పురుషుల దేహంలోని టెస్టోస్టిరాన్ శాతాన్ని అదుపులో ఉంచేలా చేస్తాయి. అంతేకాకుండా స్మెర్మ్ కౌంట్ ను, వీర్య నాణ్యతను పెంచేందుకు అక్కరకు వస్తాయి.

  డార్క్ చాకొలెట్స్: డార్క్ చాకొలెట్స్ తినే అలవాటున్న కుర్రాళ్లకు ఇది సంతోషకరమైన విషయమే. డార్క్ చాకొలెట్స్ లో అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది.

  అరటికాయలు: రోజూ ఒక అరటిపండును తినడం మగాళ్లకు ఎంతో మంచిది. అరటిపళ్లల్లో ఉండే ఏ, బీ1, సీ విటమిన్లు స్పెర్మ్ సెల్స్‌ను బలోపేతం చేస్తాయి. అలాగే వీర్య నాణ్యతను పెంచేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.

  గుడ్లు: ఈ తరం బ్యాచులర్ కుర్రాళ్లంతా గుడ్లను తెగ వాడుతుంటారు. అయితే ఫ్రై, ఆమ్లెట్ల రూపంలో గుడ్లను తినే బదులుగా వాటిని ఉడకబెట్టుకుని తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

  దానిమ్మ: అలాగే దానిమ్మ గింజల్లో సహజంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు స్పెర్మ్ క్వాలిటీని పెంచేందుకు దోహదపడతాయి. వీటిని నేరుగా తినడంతోపాటు జ్యూస్ చేసుకుని తాగినా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.

  ఆరెంజ్: ఈ పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్‌ను పెంచడతోపాటు వీర్యకణాల కదలికలను యాక్టివ్ గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనితోపాటు టమోటాలు, క్యాబెజీ, బ్రోకోలీల్లో కూడా విటమిన్ సీ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా కుర్రాళ్లు తమ డైట్‌లో చేర్చుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Women health

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు