ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల (Kidney diseases) వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా మనం బెకరీ ఫుడ్స్ (Bakery foods) తినడానికి ఎంతో ఇష్టపడతారు. బంగాళాదుంప చిప్స్ (potato chips) బ్రెడ్, చాక్లెట్స్ అంటే ఎక్కువ తింటారు. కానీ, జంక్ ఫుడ్పై చేసిన అధ్యయనంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల గట్ సిండ్రోమ్ లీకేజీ ఏర్పడుతుందట. తద్వారా కిడ్నీ వ్యాధి ముప్పు పెరుగుతుందని తేలింది.
ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకుల నేతృత్వంలోని అధ్యయనంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద వండిన లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఆధునాత గ్లెకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (AGE) అనే హానికరమైన రసాయనాలు అధిక స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. ఈ కెమికల్స్ రోస్ట్, ఫ్రై, గ్రిల్, కాల్చిన ఆహారం మంచి రుచి, వాసన వస్తుంది.
ఇది కూడా చదవండి: మీకు తెలుసా? ఈ పండు తింటే.. బట్టతల రాదు!
ఈ AGE మైలార్డ్ రియాక్షన్ అనే ప్రక్రియను ప్రేరెపిస్తాయి. అవి శరీరం ప్రమాద సంకేతాలను కూడా పెంచుతాయి.వాపు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి దారితీస్తాయని పరిశోధకులు తెలిపారు. అయితే, ఓట్స్, బ్లాక్బీన్స్, బఠానీ, బియ్యం, బార్లీ, బీన్స్, చిక్కుళ్లను ఉడకబెట్టి ఆపై ఫ్రిజ్లో ఉంచుతారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో బంగాళదుంప, రిఫ్రిజిరేటడ్ వంటి యాంటీ స్టార్చ్ ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ తినడం వల్ల పేగు ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాపడుతుందని కనుగొన్నారు.
మోనాష్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో డయాబెటీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్, లీడ్ రైటర్ మెలిండా కోచ్లాన్ మాట్లాడతూ ‘ఈ ఫుడ్ మీ గట్లోకి వెళ్లి.. ప్రాథమికంగా మీ పేగు బాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయి. పేగు బాక్టీరియా శోథ నిరోధక లక్షణాలు పులియబెడతాయి. ఈ ఆహారం ఉత్పత్తి చేసే జీవక్రియ’
ఇది కూడా చదవండి: మిరియాల కల్తీని ఈ సింపుల్ చిట్కాతో గుర్తించండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగంతో మరణం, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కేన్సర్, జీర్ణశయాంతర వ్యాధుల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఇది తమ దృష్టికి వచ్చిందని.. ఆహార మార్పులు దీర్ఘకాలంలో నిర్వహించడం కష్టం. కానీ, స్టార్చ్ ఫైబర్, ఆవిరితో వండిన ఆహారాలను జోడించడం వల్ల హానికరమైన ప్రభావాలు తగ్గించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kidney