Home /News /life-style /

THESE FOOD ITEMS MAKES YOUR BONES HEALTHY RNK

Strong bones: ఈ ఫుడ్‌ తినడం వల్ల మీ బోన్స్‌ ఏం అవుతాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

For strong bones: మన ఎముకలను బలపరచడంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే వైద్యులు సైతం కాల్షియం కంటెంట్‌ ఉన్న ఫుడ్‌ను తీసుకొమ్మని సూచిస్తారు. కానీ, అది నిన్నటివరకు. డైరీ, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు ద్వారా కూడా బోన్స్‌ బలంగా మారతాయి. తరువాతి జీవితంలో అర్థరైటీస్, బోలు, ఎముకల వ్యాధులు వంటి ప్రమాదాలు తక్కువగా వస్తాయి.

ఇంకా చదవండి ...
కాల్షియం Calcium మ్యాక్రోన్యూట్రియేంట్‌ అని చాలామందికి తెలుసు. ఇది బోన్స్‌ Bones ను దృఢపరుస్తుంది. బోన్స్‌ బ్రేకేజీ రాకుండా చేస్తుంది. కాల్షియం కాకుండా ఇతర పోషకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సమిష్టిగా ఈ పోషకాలు ఎముకల సాంద్రతను పెంచుతాయి. దీంతో భవిష్యత్తులో కూడా బోన్స్‌ ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి.

విటమిన్‌ డీ..
ముఖ్యంగా ఈ విటమిన్‌ సూర్యరశ్మి ద్వారా అందుతుంది. కొవ్వులో కరిగే ఈ విటమిన్‌ ఎముకలను కూడా దృఢపరుస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండ తగిలినపుడు మన శరీరంలో స్వయంగా విటమిన్‌ డీ Vitamin D తయారవుతుంది. ఈ పోషకం మెరుగైన కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఇది బోన్స్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యువతకు రోజుకు 600 యూనిట్ల విటమిన్‌ డీ అవసరం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 800 యూనిట్లు అవసరం. సూర్యరశ్మి కాకుండా సాల్మన్, సార్డినెస్, ఓక్రా, పాలకూర, సోయాబీన్స్‌ నుంచి కూడా విటమిన్‌ డీ పొందవచ్చు.

ప్రోటీన్స్‌..
ప్రోటీన్స్‌ కణాల పెరుగుదలకు.. పునరుత్పత్తికి చాలా అవసరం. మాక్రోన్యూట్రియేంట్‌. ఎముకలను సంరక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు ఎముక పరిమాణంలో 50 శాతం ఉంటుంది. అందుకే మాంసం, గుడ్లు, బీన్స్, కాయధాన్యాల వంటి ప్రోటీన్స్‌ అధికంగా ఉండే ఆహారం ఎముకలను గాయాలు నివారించడానికి బాగా పనిచేస్తాయి.

ఇది కూడా చదవండి: మీ పిల్లలకు ఇప్పుడే పళ్లు వస్తున్నట్లయితే.. ఈ ఫుడ్‌ పెట్టండి!


విటమిన్‌ సీ..
జర్నల్‌ న్యూట్రియేంట్స్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం ఎముకల ఆరోగ్యం కాపాడటంలో విటమిన్‌ సీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది బోన్స్‌ పెరుగుదలకు ఉపకరిస్తుంది. దీర్ఘకాలంలో బోలు ఎముకల వ్యాధిని నిరోధిస్తుంది. ఇది ఎముక మాతృకలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. అంతేకాదు ఫ్రీ రాడికల్స్‌ ఎముకల ఆరోగ్యానికి హానీ కలిగించకుండా నిరోధిస్తుంది. సిట్రస్‌ పండ్ల ద్వారా ఒక రోజులో 500–1000 ఎంజీ విటమిన్‌ సీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

విటమిన్‌ కే..
విటమిన్‌ కే తరచూ గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా చేసే పోషకం అని పేరు. అయితే, ఇది కాల్షియం జీవక్రియను పెంచే ప్రోటీన్‌ను సక్రియం చేస్తుంది. తద్వారా ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాబేజీ, పాలకూర, బ్రోకొలీ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్‌ కే పుష్కలంగా ఉంటుంది. ఇవి బోన్స్‌ను హెల్తీగా ఉంచడంలో అద్భుతాలు చేస్తాయి.

ఇది కూడా చదవండి: చింతగింజలను ఇలా వాడితే.. మీ చర్మరంగు కచ్ఛితంగా పెరుగుతుంది!



మెగ్నీషియం..
మెగ్నీషియం శరీరానికి చాలా అవసరం.ఇది దాదాపు 300 ప్రతిచర్యలను సక్రియం చేస్తాయి. 60 శాతం మాక్రోన్యూట్రియెంట్‌ ఎముక కణజాలంలో కనిపిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారం బాగా పనిచేస్తుంది. దీన్ని ఇది వరకే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. గింజలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, విత్తనాలు వంటి ఫుడ్స్‌లో మెగ్నీషియం బోన్స్‌ హెల్త్‌కు మంచి వనరు.
Published by:Renuka Godugu
First published:

Tags: Vitamins

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు