ఎప్పటి నుంచో భారతీయ వేడుకల్లో రకరకాల ఆహార పదార్థాలు కూడా ప్రత్యేకం. ప్రతి పండుగలో సంప్రదాయ వంటకాలను తయారు చేయడం ఆనవాయితీ. దీపావళి (diwali 2021) అంటే స్వీట్లు. రుచికరమైన స్వీట్ ట్రీట్ కలగలిపి దీపావళిని జరుపుకొంటారు. కానీ, ఇది అధిక కేలరీలకు (high calories) దారితీస్తుంది. దీంతో బరువు పెరిగే ప్రయత్నాలకు బ్రేక్ పడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ను కూడా పెంచుతుంది. ఈ దీపావళికి మీరు డెజర్ట్స్‌లను (desserts) ఆస్వాదించలేరని దీని అర్థం కాదు. మీరు చేయాల్సిందల్లా సరైన రకమైన స్వీట్‌ను ఎంచుకోవడం ఉత్తమ ఎంపిక. అవేంటో తెలుసుకుందాం.
లడ్డూ..
దీపావళి (diwali 2021) సందర్భంగా లడ్డూ తప్పనిసరిగా తినాల్సిన స్వీట్. ఇది దేవుడికి నైవేధ్యంగా సమర్పించే స్వీట్. చాలా మందికి లడ్డూ ఫెవరేట్. బేసన్ లేదా డ్రైఫ్రూట్స్ లడ్డూలను నిస్సందేహాంగా తినవచ్చు . ఒకవేళ మీరు ఇంట్లోనే లడ్డూను తయారు చేసుకుంటున్నట్లయితే, తప్పకుండా అందులో రాగులను కలిపి తయారు చేసుకోండి. చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించండి. ఈ లడ్డూ ఎంతో ఆరోగ్యకరమైంది. మోతీచూర్ లడ్డూలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఉసిరితో గుండె సంబంధిత వ్యాధులకు చెక్! ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఇంకా..
కొకనట్ బర్ఫీ..
ఇండియన్ స్వీట్స్ విషయానికి వస్తే కొబ్బరితో తయారు చేసిన బర్ఫీ. ఇది ఈ పండుగ సీజన్లో తినాల్సిన మరో డెజర్ట్. దీన్ని తయారు చేయడం సులభం.. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలంటే కొన్ని పదార్థాలను వేయకూడదు. దీన్ని సహజంగా కొబ్బరి, ఖర్జూరాలు, నట్స్, బెల్లం కలిపి తయారు చేస్తారు.దీంతో కేలరీలు తగ్గుతాయి.
పాల పదార్థాలు..
ఈ దీపావళికి పెరుగు పాలతో ఎలాంటి స్వీట్స్ చేసినా చాలా మంచిది. రసగుల్లాతో పాటు ఇతర పదర్థాలు ఉంటాయి. ఈ స్వీట్లను తినే సమయంలో చక్కెర తగ్గించి షుగర్ సిరప్‌ను వేయండి. పెరుగుపాలతో చేసిన స్వీట్లు మీ పేగుకు కూడా మేలు చేస్తాయి. ఇది అతిసారాన్ని నివారించడంలో సహాయపడుతుంది. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నివారిస్తుంది.
ఇది కూడా చదవండి: Diwali 2021: విదేశాల్లో వెలుగుల దీపావళి!
మూంగ్ దాల్ హల్వా..
ఎవరైనా హల్వా అనగానే మనకు గుర్తుకు వచ్యేది పంచదార, నెయ్యి మాత్రమే. కానీ, మీరు నెయ్యి, తక్కువ చక్కెరతో తయారు చేసిన హల్వాను కూడా ఆస్వాదించవచ్చు. పండుగ సమయంలో మీరు మూంగ్, బేసన్ లేదా రవ్వ అన్ని రకాల హల్వాలను ఆస్వాదించవచ్చు. రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటానికి దానికి కొన్ని నట్స్‌ను జోడించండి.
ఖీర్..
ఖీర్‌ను మనం ఇంట్లోనే తయారు చూసుకుంటాం. దీన్ని డిన్నర్ తర్వాత ఆస్వాదించవచ్చు. ప్రతి ఇంట్లో ఖీర్‌ను తయారు చేయడం సాంప్రదాయం. మీ ఇంట్లో ఖీర్ తయారు చేసుకునేటపుడు చక్కెరను తక్కువగా వాడండి. ఇతరులకు అందించేటపుడు కూడా జాగ్రత్త వహించండి. దీంట్లో క్యారెట్ లేదా ఖర్జూరంతో ఖీర్‌ను తయారు చేసుకుంటే మరింత ఆరోగ్యకరం.
టేక్అవే..
దీపావళి వార్షిక పండుగ, దీనికి ప్రత్యేక వంటకాలను తయారు చేయకుండా ఉండలేరు. అతిగా సేవించకండి, ఎందుకంటే ఇది ఇతరరోజు ఉబ్బరం, యాసిడిటీకి దారిస్తుంది. ఇంట్లో తయారు చేసుకునే, ప్రత్యేకమైన స్వీట్లకు ప్రాధాన్యతనివ్వండి. ఏడాది పొడవునా లభించే స్వీట్లకు దూరంగా ఉండండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021